hyderabadupdates.com movies 45 నిమిషాల ట్రెక్కింగ్ – 100 మిలియన్ల ట్రెండింగ్

45 నిమిషాల ట్రెక్కింగ్ – 100 మిలియన్ల ట్రెండింగ్

ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో చికిరి చికిరి జపమే కనిపిస్తోంది. గత కొన్ని నెలల్లో హిందీ నుంచి తెలుగు దాకా ఏ సాంగ్ కు ఇంత రెస్పాన్స్ రాలేదన్నది వాస్తవం. దీంతో పోల్చుకోవడం వల్లే అఖండ తాండవం రెండు పాటలు , రాజా సాబ్ నుంచి టైటిల్ సాంగ్ వచ్చినా జనాలకు ఫాస్ట్ గా ఎక్కలేదు. తాజాగా అన్ని భాషలు కలిపి చికిరి చికిరి 100 మిలియన్ల వ్యూస్ సాధించింది . ఈ సందర్భంగా మేకింగ్ వీడియో పంచుకున్న రామ్ చరణ్ అందులో తామెంత కష్టపడింది ప్రత్యక్ష సాక్ష్యం రూపంలో విడుదల చేశాడు. 45 నిముషాలు ట్రెక్కింగ్ చేసి, ఎత్తయిన కొండలు ఎక్కి రిస్కీ లొకేషన్లలో దీన్ని షూట్ చేసుకుని వచ్చారు.

నిజంగానే వీడియో చూస్తే వామ్మో అనిపించక మానదు. ఎందుకంటే ఏ మాత్రం స్లిప్ అయినా లోయలో పడిపోయే ప్రమాదమున్న చోట టీమ్ మొత్తం అక్కడికి వెళ్ళింది. చరణ్ స్టెప్పులు వేస్తున్న షాట్ ఎలా తీశారనేది అందులో పొందుపరిచారు. ఇప్పటికీ చికిరి చికిరి జ్వరంలో ఉన్న ఇన్స్ టా రీల్స్, షార్ట్స్ కు ఇది మళ్ళీ కొత్త ఊపునిచ్చేలా ఉంది. మేకింగ్ తప్ప ఇంకెలాంటి కొత్త విజువల్స్ ఇందులో ఇవ్వలేదు. జాన్వీ కపూర్ కూడా పాల్గొనగా రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబు తలా తలా అని సంబోధించడం చూస్తే ట్విట్టర్ ట్రెండ్స్ ని గట్టిగానే ఫాలో అవుతున్నట్టు అర్థమవుతోంది. కామెంట్స్ లో దాన్నే హైలైట్ చేస్తున్నారు.

ఇప్పుడు అందరి దృష్టి నెక్స్ట్ ఆడియో సింగల్ మీద ఉంది. డిసెంబర్ చివర్లో నూతన సంవత్సర కానుకగా రిలీజ్ చేయాలని బుచ్చిబాబు ప్లాన్. కానీ ఉస్తాద్ భగత్ సింగ్, మన శంకరవరప్రసాద్ గారుతో క్లాష్ లేకుండా చూసుకోవాలి. సో కొంచెం ఎక్స్ ట్రా టైం పట్టొచ్చు. అరవై శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న పెద్దికి ముఖ్యమైన షెడ్యూల్స్ మరికొన్ని బాకీ ఉన్నాయి. వాటిలో బ్యాలన్స్ పాటలు, యాక్షన్ ఎపిసోడ్స్, క్లైమాక్స్ తీయాలి. గ్రాఫిక్స్ పెద్ద స్థాయిలో అవసరం లేకపోయినా కంటెంట్ డిమాండ్ చేసిన మేరకు వాడుకుని మార్చి 27 విడుదల మిస్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత బుచ్చిబాబు మీద ఉంది.

Related Post

Top 10 Must-Watch Malayalam Films of 2025 on OTT: Pranav Mohanlal’s Diés Iraé to Lokah Chapter 1: ChandraTop 10 Must-Watch Malayalam Films of 2025 on OTT: Pranav Mohanlal’s Diés Iraé to Lokah Chapter 1: Chandra

Cast: Kalyani Priyadarshan, Naslen, Sandy Master, Arun Kurian, Chandu Salim Kumar, Raghunath Paleri, Vijayaraghavan, Dulquer Salmaan (cameo), Tovino Thomas (cameo), Mammootty (voice-only cameo) Director: Dominic Arun Genre: Superhero Action Where