hyderabadupdates.com movies టాలీవుడ్ స్టార్లు నిజంగా గోల్డు

టాలీవుడ్ స్టార్లు నిజంగా గోల్డు

బయట చాలా మంది జనాల్లో ఒక అపోహ ఉంది. స్టార్ హీరోలు పదులు, వందల కోట్ల రెమ్యునరేషన్లతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారని, డబ్బే ప్రపంచంగా ఉంటారని, దాన్ని వసూలు చేసుకోవడం కోసం నిర్మాతను పీడిస్తారనే అభిప్రాయం చాలాసార్లు సోషల్ మీడియాలో చూశాం. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసినప్పుడు అతన్ని రాబిన్ హుడ్ గా వర్ణించిన వాళ్ళు సందర్భంతో సంబంధం లేకుండా పారితోషికాల టాపిక్ తెచ్చి హడావిడి చేయబోయారు. కానీ మన టాలీవుడ్ స్టార్లు ఎంత గోల్డో ఇవాళ ఆంధ్రకింగ్ తాలూకా సక్సెస్ మీట్ లో నిర్మాత మైత్రి రవిశంకర్ చెప్పాక క్లారిటీ వచ్చింది. పేరుపేరునా ఉదాహరణలు చెప్పారు.

రంగస్థలం టైంలో రామ్ చరణ్ కు రావాల్సిన నాలుగు కోట్లు ఆయన చేతికి చేరడానికి రెండేళ్లు పట్టినా పెద్దగా పట్టించుకోలేదు. అదే బ్యానర్ భాగస్వామ్యంలో ఇప్పుడు పెద్ది చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏకంగా మీకు మిగిలితే ఇవ్వండి లేదంటే లేదు అని చెప్పడం మాములు విషయం కాదు. ఆంధ్రకింగ్ తాలూకాకు డబ్బు బదులు కంటెంట్ మీద నమ్మకంతో రామ్ రెండు ఏరియాల హక్కులు తీసుకున్నాడు. పుష్ప బ్యాలన్స్ సొమ్ముని అల్లు అర్జున్ కి ఏడాది టైంలో ఇచ్చినా లైట్ తీసుకున్నాడు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు ఎప్పుడుంటే అప్పుడే ఇవ్వండి అనే టైపు. వాల్తేరు వీరయ్యకు చిరంజీవి అదే చేశారు.

ఇన్ని ఎగ్జాంపుల్స్ చెబితే వాళ్ళను గోల్డ్ అనకుండా ఏమంటాం. కొన్నిసార్లు సినిమాలు డిజాస్టర్ అయినప్పుడు ప్రొడ్యూసర్లు బాకీలు చెల్లించలేని స్థితిలో ఉంటారు. గతంలో ఇలాంటివి జరిగినప్పుడు సూపర్ స్టార్ కృష్ణ రివర్స్ లో సహాయం చేసేవారని అప్పట్లో చెప్పుకునేవారు. బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలు మార్కెట్ కు తగ్గట్టే పారితోషికాలు తీసుకుంటారు కానీ ఊరికే లేనిపోని డిమాండ్ చేయరు. మైత్రి రవిశంకర్ చెప్పింది తనవరకు ఎదురైన అనుభవాలే అయినా కూడా మిగిలిన నిర్మాణ సంస్థలకు సైతం ఇదే ఎక్స్ పీరియన్స్ ఉంటుంది. ఫ్యాన్స్ తమ హీరోల గొప్పదనం చూసి మురిసిపోతున్నారు.

Related Post

భార్య జీతమే భర్త తీసుకున్న లంచంభార్య జీతమే భర్త తీసుకున్న లంచం

రాజస్థాన్‌లో ఐటీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఒక సీనియర్ ఆఫీసర్ ప్రద్యుమన్ దీక్షిత్ చేసిన స్కామ్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ప్రభుత్వ కాంట్రాక్టులు తీసుకునే రెండు ప్రైవేట్ కంపెనీల నుంచి, అతని భార్య పూనమ్ దీక్షిత్ దాదాపు రెండేళ్లలో ఏకంగా రూ.37.54 లక్షలు