hyderabadupdates.com movies ఫిట్‌నెస్ ముఖ్యం బిగిలు.. రోహిత్‌కు బీసీసీఐ స్వీట్ వార్నింగ్?

ఫిట్‌నెస్ ముఖ్యం బిగిలు.. రోహిత్‌కు బీసీసీఐ స్వీట్ వార్నింగ్?

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ మొదలవ్వక ముందే, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫ్యూచర్‌పై బీసీసీఐలో పెద్ద చర్చే నడుస్తోంది. ఈ సిరీస్ అయిపోగానే అహ్మదాబాద్‌లో ఒక సీక్రెట్ మీటింగ్ జరగబోతోంది. అందులో 2027 వన్డే వరల్డ్ కప్ రోడ్‌మ్యాప్ గురించి గట్టిగానే డిస్కస్ చేయబోతున్నారు. ముఖ్యంగా రోహిత్‌కు బోర్డు నుంచి క్లియర్ మెసేజ్ వెళ్లింది. “బయట వస్తున్న రూమర్స్ పట్టించుకోవద్దు.. కేవలం ఫిట్‌నెస్, పర్ఫార్మెన్స్‌పైనే ఫోకస్ పెట్టు” అని స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ వార్నింగ్ వెనుక ఒక బలమైన కారణం ఉంది. రోహిత్, కోహ్లీ ఇప్పుడు కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. సుదీర్ఘ విరామాల తర్వాత జట్టులోకి రావడం వల్ల వారి ఆటలో ‘రిథమ్’ మిస్ అవుతోందని బోర్డు పెద్దలు గమనించారు. ఆస్ట్రేలియా సిరీస్‌లో సిరీస్ పోయాక మూడో మ్యాచ్‌లో ఆడారు కానీ, మొదటి రెండు మ్యాచ్‌లలో తడబడ్డారు. ప్రతి సిరీస్‌లో ఇలా జరిగితే కుదరదని, జట్టుకు నష్టం జరుగుతుందని సెలెక్టర్లు భావిస్తున్నారు.

రోహిత్ బ్యాటింగ్ స్టైల్ మీద కూడా చర్చ జరుగుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో రోహిత్ ఎలాగైతే భయం లేకుండా, అగ్రెసివ్‌గా ఆడేవాడో.. ఇప్పుడు కూడా అలాగే ఆడాలని టీమ్ మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. ఆస్ట్రేలియాలో అతను కాస్త నెమ్మదించడం, రిస్క్ తీసుకోవడానికి భయపడటం గమనించారు. కెప్టెన్‌గా, ఓపెనర్‌గా రోహిత్ మునుపటిలా ‘ఫియర్‌లెస్’గా ఆడితేనే యువ ఆటగాళ్లకు ధైర్యం వస్తుందని బోర్డు అభిప్రాయపడుతోంది.

రోహిత్, కోహ్లీలు జట్టుకు ఇంకా కీలకమే. కానీ వాళ్లు కేవలం తమ ప్లేస్ కాపాడుకోవడానికి కాకుండా, జూనియర్లకు దారి చూపేలా ఆడాలి. ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు లేనప్పుడు దేశవాళీ క్రికెట్ విజయ్ హజారే ట్రోఫీ ఆడాలని కూడా బీసీసీఐ సూచించే అవకాశం ఉంది. ప్రాక్టీస్ లేకుండా నేరుగా పెద్ద మ్యాచ్‌లకు రావడం వల్ల వస్తున్న ఇబ్బందులను అధిగమించడానికి ఇదే మార్గమని భావిస్తున్నారు.

సౌతాఫ్రికా సిరీస్ ఈ ఇద్దరు దిగ్గజాలకు ఒక అగ్నిపరీక్ష లాంటిది. ఇక్కడ ప్రదర్శన బాగుంటే సరే, లేదంటే ఆ తర్వాత జరిగే మీటింగ్‌లో కఠిన నిర్ణయాలు తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. భారత క్రికెట్‌లో రెండు బలమైన స్తంభాలుగా ఉన్న రోహిత్ కోహ్లీల వన్డే కెరీర్ ఇంకెంత కాలం సాగుతుందో ఈ సిరీస్ తర్వాతే తేలనుంది.

Related Post

Chase Stokes’ Cryptic Post Sparks Breakup Rumors: What’s Really Going On With Kelsea Ballerini?Chase Stokes’ Cryptic Post Sparks Breakup Rumors: What’s Really Going On With Kelsea Ballerini?

The speculation intensified after a video of them dancing in the streets of Dubrovnik went viral. However, Chase’s recent Instagram posts suggest the relationship, romantic or otherwise, may be definitively