hyderabadupdates.com movies కీర్తి… ఆ సినిమాలు ఆపేస్తే మంచిది!

కీర్తి… ఆ సినిమాలు ఆపేస్తే మంచిది!

గత ఐదారేళ్లలో దక్షిణాదిన అత్యధికంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసిన హీరోయిన్ ఎవరు అంటే.. కీర్తి సురేష్ పేరే చెప్పాలి. ‘మహానటి’ చిత్రంతో తిరుగులేని పేరు సంపాదించడంతో పాటు బ్లాక్ ‌బస్టర్ విజయాన్నీ ఖాతాలో వేసుకున్న కీర్తి.. ఆ తర్వాత వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది. పెంగ్విన్, మిస్ ఇండియా, సాని కాయిదం, గుడ్ లక్ సఖి, రఘు తాత.. ఇలా కీర్తి ప్రధాన పాత్ర పోషించిన సినిమాలు చాలానే వచ్చాయి. 

కానీ వీటిలో ఒక్కటీ ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. సెంగ్విన్, సాని కాయిదం నేరుగా ఓటీటీలో రిలీజై మిశ్రమ స్పందన తెచ్చుకోగా.. మిగతా చిత్రాలు థియేటర్లలో రిలీజై నిరాశపరిచాయి. తాజాగా కీర్తి నుంచి ‘రివాల్వర్ రీటా’ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ వచ్చింది. ఈసారి కూడా ఫలితమేమీ మారలేదు. ఈ చిత్రం ఫ్లాప్ అని తొలి రోజే తేలిపోయింది. ఇటు తెలుగులో, అటు తమిళంలో ఈ సినిమాకు నెగెటివ్ రివ్యూలే వచ్చాయి.

సినిమా బాగా లేకపోవడం, వసూళ్లు రాకపోవడం సంగతి పక్కన పెడితే.. విడుదలకు ముందు ఈ చిత్రానికి మినిమం బజ్ క్రియేట్ కాకపోవడం గమనార్హం. అడ్వాన్స్ బుకింగ్స్ కనీస స్థాయిలో కూడా లేవు. హైదరాబాద్‌లోని థియేటర్లలో ఒకట్రెండు టికెట్లు కూడా బుక్ కాని థియేటర్లు బోలెడు కనిపించాయి. ఇక రిలీజ్ రోజు కూడా పరిస్థితి ఏమీ మారలేదు. చాలా చోట్ల జనం లేక మార్నింగ్ షోలు క్యాన్సిల్ చేశారు. టాక్ బాగుంటే సినిమా తర్వాత అయినా పుంజుకునేది. కానీ బ్యాడ్ టాక్ వల్ల తర్వాతి షోల పరిస్థితి అలాగే తయారైంది. ఇక సినిమా పరిస్థితి మెరుగుపడే సంకేతాలు ఎంతమాత్రం కనిపించడం లేదు. 

కీర్తి కథానాయికగా స్టార్ల పక్కన నటించినపుడు పరిస్థితి బెటర్‌గానే ఉంటోంది. నానితో ఆమె చేసిన ‘దసరా’ సినిమాకు మంచి హైప్ వచ్చింది. ఆ సినిమా పెద్ద హిట్టయింది. అందులో తన పెర్ఫామెన్స్‌కు కూడా మంచి స్పందనే వచ్చింది. ఆమె చేసే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఏ రకంగానూ మంచి ఫలితాన్నివ్వడం లేదు. ‘రివాల్వర్ రీటా’లో కీర్తి పెర్ఫామెన్స్ గురించి కూడా చెప్పడానికి ఏమీ లేదు.

లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చూసేందుకు జనం రావడం లేదని.. హీరోయిన్ల మీద వివక్ష ఉందని కీర్తి చేసిన కామెంట్ కూడా బూమరాంగే అయింది. ‘మహానటి’ సినిమాను ఎంతగా ఆదరించారో మరిచిపోతే ఎలా? తర్వాత ఆమె ఎంచుకున్న సినిమాల్లో విషయం లేదు. వాటిని సరిగా మార్కెట్ చేయనూ లేదు. ప్రస్తుతానికి పరిస్థితి చూస్తే ఈ తరహా సినిమాలకు ఆమె ఫుల్ స్టాప్ పెడితే మంచిదనిపిస్తోంది. ‘రివాల్వర్ రీటా’ రిజల్ట్ చూశాక నిర్మాతలు కూడా ఆ సాహసం చేయకపోవచ్చు.

Related Post

కొత్త ఎమ్మెల్యేలు: చిన్న ట్రిక్స్‌తో పెద్ద విజ‌యం.. !కొత్త ఎమ్మెల్యేలు: చిన్న ట్రిక్స్‌తో పెద్ద విజ‌యం.. !

రాజ‌కీయాల్లో గెలుపు – ఓట‌ములు దోబూచులాడుతూనే ఉంటాయి. అయితే.. ఇది ఇప్ప‌టి మాట‌. కొన్నాళ్ల కింద‌ట ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. వ‌రుస‌గా ఒకే నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచిన నాయ‌కులు చాలా మంది ఉన్నారు. ఎంతో మంది కీల‌క నాయ‌కుల పోరులో కూడా.. వ‌రుస‌గా