hyderabadupdates.com movies సీఎం సీరియస్: అటువంటివి ఉపేక్షించబోం..!

సీఎం సీరియస్: అటువంటివి ఉపేక్షించబోం..!

పార్టీలో క్రమశిక్షణకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తారు. ఇది పార్టీలో అందరికీ తెలిసిన విషయమే. అయినా అక్కడక్కడా గాడి తిప్పుతున్నారు. అటువంటి వారి విషయంలో సీఎం ఎప్పుడూ కఠినంగానే ఉంటారు. తాజా పరిణామాలపై ఆయన తీవ్రంగా స్పందించారు. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అనధికారిక పీఏ సతీష్ ఒక మహిళను వేధించినట్లు ఆరోపణలు వచ్చాక కూడా అతణ్ని వెంటనే తొలగించకుండా తాత్సారం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహిళల గౌరవానికి ఎవరు భంగం కలిగించినా ఊరుకోబోనన్నారు. వేధింపులకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు, కుటుంబసభ్యులు, వారి దగ్గర పనిచేసేవారు కూడా ఎలాంటి తప్పులు చేయకుండా చూసుకోవాలని సీఎం సూచించారు. సీఎం కార్యాలయం జోక్యం చేసుకుని సతీష్ ఒక మహిళను వేధించినట్లు ఆరోపణలు వచ్చాక కూడా అతణ్ని వెంటనే తొలగించకుండా తాత్సారం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యాఖ్యల పైనా ఆయన స్పందించారు. కొలికిపూడి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గం వెలుపల కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఇది అందరికీ తెలుసని పేర్కొన్నారు. తాను చంద్రబాబు ఆశీస్సులతోనే ఎమ్మెల్యే అయ్యానని, వేరే వారి వల్ల కాదని స్పష్టం చేశారు.

కొంతమంది ఎమ్మెల్యేను కింద కూర్చోబెట్టాలని అనుకుంటున్నారు, అలాంటి వారిని తొక్కి నార తీస్తానని హెచ్చరించారు. దీనిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా బలవంతులమని, పార్టీ అవసరం లేదని భావించినవారు బయటకు వెళ్లి బలనిరూపణ చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. ‘పార్టీతో అవసరం లేద నుకున్నప్పుడు సొంతంగా పోటీ చేసి గెలవాల్సింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినా, పార్టీకి అతీతులమ న్నట్టు ఎవరు వ్యవహరించినా సహించేది లేదు’ అని చంద్రబాబు పేర్కొన్నారు. కొలికపూడిని పిలిపించి మాట్లాడతానన్నారు.

Related Post

భళిరా బాహుబలి… రికార్డులన్నీ ఖాళీభళిరా బాహుబలి… రికార్డులన్నీ ఖాళీ

బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్ అంచనాలకు మించి వసూళ్లు రాబట్టేలా ఉంది. క్రేజ్ ఉంటుందని ముందే ఊహించినప్పటికీ ఈ స్థాయి రెస్పాన్స్ బయ్యర్ వర్గాలను ఆనందంలో ముంచెత్తుతోంది. 3 గంటల 44 నిమిషాల నిడివిని లెక్క చేయకుండా బిగ్గెస్ట్ థియేటర్

What is the age difference between newlyweds Anirudha Srikkanth and Samyuktha Shanmuganathan?What is the age difference between newlyweds Anirudha Srikkanth and Samyuktha Shanmuganathan?

Before confirming her relationship, Samyuktha often appeared in photos with a “mysterious man,” leading to speculation about a second marriage. In a recent interview, she addressed the rumors and said