hyderabadupdates.com movies షారుఖ్‌తో డ్యాన్స్ చేయడానికి పెళ్లికూతురు నో

షారుఖ్‌తో డ్యాన్స్ చేయడానికి పెళ్లికూతురు నో

బాలీవుడ్ ఇండియాలో బిగ్గెస్ట్ ఫిలిం ఇండస్ట్రీ. ఇప్పుడంటే సౌత్ సినిమాల ముందు నిలవలేక హిందీ చిత్రాలు వెనుకబడుతున్నాయి కానీ.. దశాబ్దాల పాటు ఇండియన్ సినిమాలో వారిదే ఆధిపత్యం. మిగతా ప్రపంచానికి ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్డే. అక్కడి స్టార్లు ఎప్పుడో అంతర్జాతీయ స్థాయిలో పాపులారిటీ తెచ్చుకున్నారు. వారి సినిమాల బడ్జెట్లు, వసూళ్లే కాదు.. పారితోషకాలు కూడా భారీగానే ఉంటాయి. ఐతే అక్కడి హీరోలు సినిమాల నుంచి సంపాదించే దానితో పోలిస్తే యాడ్స్ ద్వారా, అలాగే ప్రైవేటు కార్యక్రమాల ద్వారా ఆర్జించే మొత్తం ఇంకా ఎక్కువే. 

ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్స్ అయి ఉండి కూడా బాలీవుడ్ హీరోలు.. ప్రైవేటు వ్యక్తుల పెళ్ళిళ్ళకు వెళ్లి పెర్ఫామ్ చేయడం దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం. ఇందులో షారుఖ్ ఖాన్ ముందు వరసలో ఉంటారు. తన స్థాయి ఎంత పెరిగినా.. ఇలా డబ్బులు పుచ్చుకుని ప్రైవేటు వేడుకల్లో పెర్ఫామ్ చేయడాన్ని ఆయన ఎప్పుడూ చిన్నతనంగా భావించింది లేదు. అంత పెద్ద స్టార్ అయి ఉండి ఇలాంటివి అవసరమా అన్నా కూడా ఆయనేమీ పట్టించుకోడు. ‘కింగ్’ సినిమాతో ఇండియాలో అత్యధిక పారితోషకం అందుకోబోతున్న హీరోగా రికార్డు నెలకొల్పబోతున్నట్లు వార్తలు వస్తున్న సమయంలోనూ షారుఖ్ ఏమీ మారలేదు.

తాజాగా షారుఖ్ ఒక పెళ్లి వేడుకకు పెయిడ్ ఆర్టిస్టుగా వెళ్లాడు. స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేశాడు. ఒక హిందీ పాటకు చాలా హుషారుగా స్టెప్పులేశాడు కింగ్ ఖాన్. ఐతే పెళ్లి కూతురు మాత్రం ఆయనతో పాదం కదలపలేదు. షారుఖ్ ఎంత ఉత్సాహపరుస్తున్నా సరే.. ఆమె కదలకుండా ఉండిపోయింది. షారుఖ్ అంతటి వాడు చేయి ఇచ్చి తనతో కలిసి డ్యాన్స్ చేయమని ఎంకరేజ్ చేస్తున్నా సరే.. ఆమె అలా ఉండిపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షారుఖ్ ఇలా ప్రైవేట్ వెడ్డింగ్‌కు వెళ్లి డ్యాన్స్ చేయడం పట్ల తన అభిమానులనే నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు.

World’s richest actor, still dances at weddings. pic.twitter.com/9aqFoXmiTk— EpicCommentsTelugu (@EpicCmntsTelugu) December 3, 2025

Related Post

This Surprise Cameo in ‘The Terminal List: Dark Wolf’ Finale Hints at a Darker Season 2This Surprise Cameo in ‘The Terminal List: Dark Wolf’ Finale Hints at a Darker Season 2

Editor’s Note: The following contains spoilers for The Terminal List: Dark Wolf finale.When it was first announced that The Terminal List was getting a prequel series, some were understandably concerned