hyderabadupdates.com movies విమానాలకు ‘బ్లూ స్క్రీన్’ ఎఫెక్ట్.. ఆగిపోయిన ఫ్లైట్లు!

విమానాలకు ‘బ్లూ స్క్రీన్’ ఎఫెక్ట్.. ఆగిపోయిన ఫ్లైట్లు!

దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో మళ్లీ గందరగోళం మొదలైంది. ప్రయాణికులు చెక్ ఇన్ చేసుకోవడానికి కౌంటర్ల ముందు బారులు తీరుతున్నారు. ఎందుకంటే, విమానాశ్రయ వ్యవస్థలను నడిపించే ‘మైక్రోసాఫ్ట్ విండోస్’ సడెన్‌గా మొరాయించింది. దీనివల్ల కంప్యూటర్లు పనిచేయక, బోర్డింగ్ పాస్‌లు ఇవ్వడం, బ్యాగేజ్ ట్యాగింగ్ చేయడం కష్టమైపోయింది. ఫలితంగా అనేక విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా, కొన్ని పూర్తిగా రద్దయ్యాయి.

ముఖ్యంగా హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దీని ప్రభావం గట్టిగా పడింది. ఢిల్లీ, బెంగళూరు, గోవా, మదురై వంటి నగరాలకు వెళ్లాల్సిన విమానాలు రద్దవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులు కూడా ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. బుధవారం ఒక్క శంషాబాద్ నుంచే 19 సర్వీసులు (7 వెళ్లాల్సినవి, 12 రావాల్సినవి) రద్దయినట్లు అధికారులు తెలిపారు.

కంప్యూటర్లు పనిచేయకపోవడంతో ఎయిర్ లైన్స్ సిబ్బంది పాత పద్ధతిలో ‘మాన్యువల్’గా చెక్ ఇన్ చేస్తున్నారు. చేతితో బోర్డింగ్ పాస్‌లు రాసి ఇవ్వడం వల్ల ఎక్కువ సమయం పడుతోంది. ఇండిగో, స్పైస్‌జెట్, ఆకాశ ఎయిర్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వంటి ప్రధాన సంస్థలన్నింటిపైనా ఈ ఎఫెక్ట్ పడింది. అయితే, మైక్రోసాఫ్ట్ నుంచి దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

ఇటీవల జీపీఎస్ స్పూఫింగ్ కారణంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమానాలకు అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కొత్త టెక్నికల్ గ్లిచ్ ప్రయాణికులను మరింత బెంబేలెత్తిస్తోంది. విమానాశ్రయానికి వెళ్లే ముందు ఫ్లైట్ స్టేటస్ చెక్ చేసుకోవడం మంచిదని ఎయిర్‌లైన్స్ సూచిస్తున్నాయి. టెక్నాలజీ మీద అతిగా ఆధారపడటం వల్ల ఒక్కోసారి ఇలాంటి ‘బ్లూ స్క్రీన్’ కష్టాలు తప్పవని ఈ ఘటన మరోసారి నిరూపించింది.

Related Post

బాలీవుడ్ షాక్… ఇక సౌత్ మీదే ఆశలుబాలీవుడ్ షాక్… ఇక సౌత్ మీదే ఆశలు

తల్లి శ్రీదేవి ఘన వారసత్వాన్ని కొనసాగిస్తూ ఏడేళ్ల కిందట ‘దఢక్’ సినిమాతో కథానాయికగా అరంగేట్రం చేసింది జాన్వి కపూర్. తొలి సినిమా ఆమెకు మంచి విజయాన్నే అందించింది. కానీ తర్వాత బాలీవుడ్లో వరుసగా సినిమాలు చేస్తున్నా.. ఆమె కోరుకున్న విజయం దక్కట్లేదు.

ఆమెకు ‘ఏఐ’ మొగుడుఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ పిచ్చి పరాకాష్టకు చేరిందా అనిపిస్తుంది. మనుషులు నచ్చక, రిలేషన్స్ లో గొడవలు పడలేక ఇప్పుడు కొంతమంది ఏకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

రాజుగారి ప్రేమకథలో సరదా ఎక్కువేరాజుగారి ప్రేమకథలో సరదా ఎక్కువే

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత అనుకోకుండా జరిగిన చిన్న ప్రమాదం వల్ల గ్యాప్ తీసుకున్న నవీన్ పోలిశెట్టి ఈసారి అనగనగా ఒక రాజుతో వస్తున్నాడు. జనవరి 14 విడుదల కాబోతున్న ఈ ఎంటర్ టైనర్ ని సితార ఎంటర్ టైన్మెంట్స్