hyderabadupdates.com movies ఐ బొమ్మ రవికి పోలీస్ శాఖ బంపర్ ఆఫర్?

ఐ బొమ్మ రవికి పోలీస్ శాఖ బంపర్ ఆఫర్?

ఐ బొమ్మ రవి…ఈ మధ్యకాలంలో ఈ పేరు చాలా పాపులర్ అయింది. పేద, మధ్య తరగతి సినీ ప్రేక్షకులు రవిని సినీ రాబిన్ హుడ్ అంటున్నారు. అయితే, నిర్మాతలు మాత్రం అతడో సైబర్ నేరగాడని, చట్టవిరుద్ధంగా పైరసీ చేసి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు కోట్ల రూపాయల నష్టం చేకూర్చాడని మండిపడుతున్నారు. అయితే, టెక్నాలజీని వాడడంలో రవి నిష్ణాతుడని, కానీ, దానిని తప్పుడు పనులకు ఉపయోగించాడన్నది వాస్తవం. ఈ క్రమంలో ఐ బొమ్మ రవికి పోలీసులు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారని కొన్ని తెలుగు దిన పత్రికల్లో కథనాలు వచ్చాయి.

పోలీసు శాఖలోకి వచ్చి సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేయాలని, మంచి జీతం ఇస్తామని పోలీసులు ఆఫర్ చేశారని కొన్ని పత్రికలు కథనాలు రాశాయి. అయితే, రవి మాత్రం ఆ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించాడట. కరీబియన్ దీవుల్లో ఐ బొమ్మ రెస్టారెంట్ పెట్టి ఆంధ్రా, తెలంగాణ, భారతీయ వంటకాలను అక్కడి ప్రజలకు రుచిచూపిస్తానని పోలీసులతో రవి అన్నాడట. ఆ రెస్టారెంట్ ద్వారా సంపాదించిన డబ్బుతో శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతానని రవి చెప్పాడట.

దీంతో, పోలీసులు ఆఫర్ ఇచ్చినట్లు చెబుతున్న కథనాలపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. రవి తనకున్న టాలెంట్ ను సద్వినియోగం చేసే చాన్స్ పోలీసులు ఇచ్చారని, దానిని రవి రిజెక్ట్ చేయడం సరికాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఇలా సైబర్ నేరాలు చేసిన వారిని పోలీసులు ఎంకరేజ్ చేస్తే తప్పుడు సందేశం వెళుతుందని మరికొందరు అంటున్నారు. దొరికినా దొరే..దొరక్కపోయినా దొరే అన్న రీతిలో..టాలెంట్ ఉన్నంత మాత్రాన సైబర్ క్రైమ్ చేసి పట్టుబడి పోలీసు శాఖలో పనిచేస్తే ఇంక నేరం-శిక్ష అనే భయం సైబర్ నేరగాళ్లకు ఉండదని చెబుతున్నారు.

Related Post

పెద్దావిడ ఖాతాలో 50 కోట్ల బ్లాక్ బస్టర్పెద్దావిడ ఖాతాలో 50 కోట్ల బ్లాక్ బస్టర్

కాదేది కంటెంట్ కు అనర్హం అంటారు సినీ పెద్దలు. ఇది అక్షరాలా నిజం. డిజిటల్ యుగంలో కేవలం స్టార్ ఎలివేషన్లతోనే సినిమాలు నడవవు. జనాలకు నచ్చేలా తీస్తే ఎవరున్నారో కూడా పట్టించుకోకుండా కనక వర్షం కురిపిస్తారు. దానికి సాక్ష్యంగా ఇటీవలే విడుదలైన

ఇంగ్లాండ్‌పై భారత్ రివెంజ్ తీర్చుకుంటుందా?ఇంగ్లాండ్‌పై భారత్ రివెంజ్ తీర్చుకుంటుందా?

ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌తో తలపడేందుకు టీమ్ ఇండియా సిద్ధమైంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ నెల 5న గురువారం ఈ హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ప్రపంచ నంబర్ 1, నంబర్ 2