hyderabadupdates.com movies చైతూ వివాహ వార్షికోత్సవం… దర్శకుడి పోస్టు వైరల్

చైతూ వివాహ వార్షికోత్సవం… దర్శకుడి పోస్టు వైరల్

చైతూ వివాహ వార్షికోత్సవం… దర్శకుడి పోస్టు వైరల్ post thumbnail image

ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్‌‌గా పెళ్లి చేసుకుంది ఈ జంట. చైతూకు అది రెండో వివాహ కావడం, అప్పటి పరిస్థితుల దృష్ట్యా సోషల్ మీడియాలో తమ పెళ్లి గురించి ఎక్కువ చర్చ లేకుండా చూసుకున్నారు చైతూ, శోభిత. పెళ్లి తంతు పూర్తి చేశాక కొన్ని ఫొటోలను రిలీజ్ చేయడంతో సరిపెట్టారు. ఐతే ఇప్పుడు తమ తొలి వివాహ వార్షికోత్సవం సందర్భంగా పెళ్లికి సంబంధించి ఒక మెస్మరైజింగ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది శోభిత. తమ పెళ్లిని కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య చైతూ-శోభిత ఎంతో సంబరంగా జరుపుకున్నారో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. వివాహం సందర్భంగా వీళ్లిద్దరూ చేసిన అల్లరి.. నాగ్ అండ్ కో సంతోషాన్ని ఈ వీడియోలో చూడొచ్చు.

పెళ్లి విషయమై శోభిత, చైతూ వీడియో బైట్స్ కూడా ఇచ్చారిందులో. తమ జీవిత భాగస్వామి గురించి శోభిత, చైతూ చెప్పుకున్న తీరు కూడా చాలా బాగుంది. ఇంకొకరు వచ్చి తమ జీవితాల్లో ఖాళీలు పూరించాల్సిన అవసరం లేదని.. తాము వ్యక్తులుగా అప్పటికే సంపూర్ణం అని.. కానీ చైతూ లేకపోతే తన జీవితంలో ఏదో వెళితిగా ఉంటుందని శోభిత చెప్పింది. ఇక శోభిత గురించి చైతూ మాట్లాడుతూ.. ఆమె తన సొంతం అన్నపుడు కలిగిన ఫీలింగ్ చాలా గొప్పదని, తను తోడుంటే ఏదైనా సాధించగలనని అనిపిస్తుందని పేర్కొన్నాడు. 

ఇదిలా ఉండగా చైతూ-శోభితలకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు చెబుతూ.. దర్శకుడు చందూ మొండేటి పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుండడం గమనార్హం. ‘‘నిశ్శబ్దాన్ని మించిన శబ్దం లేదు. ఈ విషయంలో మీరు గొప్ప ఉదాహరణ శోభిత అక్కినేని’’ అంటూ చైతూ-శోభితల పెళ్లి ఫొటోకు వ్యాఖ్య జోడించాడు చందూ. చైతూతో మూడు సినిమాలు (ప్రేమం, సవ్యసాచి, తండేల్) చేసిన చందూకు అతడితో మంచి అనుబంధం ఉంది. శోభితకు కూడా అతను క్లోజే. గత ఏడాది చైతూ, శోభితల పెళ్లి జరిగినపుడు సమంత అభిమానులు వాళ్లిద్దరినీ టార్గెట్ చేశారు. ముఖ్యంగా శోభితను ఎటాక్ చేశారు. కానీ అప్పుడు ఆమె ఏమీ స్పందించకుండా సైలెంట్‌గా ఉంది. ఇటీవలే సమంత పెళ్లి జరగడంతో శోభిత మీద నెగెటివిటీ అంతా పక్కకు వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలోనే చందూ ఈ పోస్టు పెట్టినట్లు అర్థమవుతోంది.

Related Post

నంది అవార్డులంటే అంత చులకనానంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే టాలీవుడ్ ఆస్కార్ తో సమానం. దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ పురస్కారాల కోసం తెలుగు పరిశ్రమలో ప్రతి ఒక్కరు పరితపించి

పెళ్లైన వ్యక్తితో సంబంధం.. 16 ఏళ్ల కుమార్తె పై తల్లిదండ్రుల ఘాతుకంపెళ్లైన వ్యక్తితో సంబంధం.. 16 ఏళ్ల కుమార్తె పై తల్లిదండ్రుల ఘాతుకం

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం శివరాంపల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఒక ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ బాలికను ఆమె తల్లిదండ్రులే హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. ఆర్చన అనే 16 ఏళ్ల బాలిక నవంబర్

శృతి లాగే శ్రీలీల.. పవన్ హిట్ ఇస్తాడా?శృతి లాగే శ్రీలీల.. పవన్ హిట్ ఇస్తాడా?

​టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం కెరీర్ పరంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. ‘ధమాకా’ సినిమాతో ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీకి ఆ తర్వాత అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. రీసెంట్ గా రవితేజతో చేసిన ‘మాస్ జాతర’