hyderabadupdates.com movies ‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు ఈ సినిమాను షెడ్యూల్ చేశారు. ఆ రోజు పక్కాగా రిలీజవుతుందనుకున్న సినిమా.. అనూహ్య పరిణామాల మధ్య వాయిదా పడిపోయింది. తర్వాతి రోజైనా సినిమా రిలీజవుతుందేమో అని ఎంతో ఆశగా ఎదురు చూసిన అభిమానులకు నిరాశ తప్పలేదు.

ఇప్పుడిక ‘అఖండ-2’ కొత్త డేట్ ఏదనే విషయంలో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయొచ్చనే ప్రచారం నడుస్తోంది. కానీ అంత వెనక్కి వెళ్తే కష్టమని.. డిసెంబరులోనే రిలీజ్ చేద్దామని చూస్తున్నట్లుగా మరోవైపు డిస్కషన్ జరుగుతోంది.

ఐతే ‘అఖండ-2’ ఏ కొత్త డేట్‌ను ఎంచుకున్నా.. చిన్న సినిమాలకు తీవ్ర ఇబ్బంది తప్పదు. బాలయ్య సినిమా బాంబు ఎక్కడ వచ్చి తమ మీద పడుతుందో అని ఆయా చిత్రాల మేకర్స్ ఆందోళన చెందుతున్నారు. ముందుగా ముప్ప ఉన్నది.. ‘మోగ్లీ’, ‘సైక్ సిద్దార్థ’ సినిమాలకే. ఈ రెండూ డిసెంబరు 12కు షెడ్యూల్ అయ్యాయి. ‘మోగ్లీ’ సినిమాకు ఎంతో ఆలోచించి ఆ డేట్ తీసుకున్నారు. ‘అఖండ-2’కు వారం గ్యాప్‌లో సినిమాను ఫిక్స్ చేస్తూ వదిలిన ప్రోమోలో బాలయ్యతో గేమ్సా అంటూ టీం తమ మీద తామే సెటైర్ కూడా వేసుకుంది. ఇప్పుడేమో నేరుగా ‘అఖండ-2’ను ఢీకొట్టాలంటే కష్టం.

లేటుగా రేసులోకి వచ్చిన ‘సైక్ సిద్దార్థ’దీ ఇదే పరిస్థితి. నందు లేక లేక ఓ మంచి సినిమా చేసినట్లున్నాడు. బాలయ్య సినిమా వస్తుంటే వాయిదా వేసుకోవాల్సిందే. కార్తి సినిమా ‘అన్నగారు వస్తారు’ను తెలుగుతో పాటు తమిళంలో వారం వాయిదా వేయడానికి బాలయ్య సినిమానే కారణం. ఇప్పుడు 12న రిలీజ్‌కు అంతా సిద్ధం చేసుకుంటే.. మళ్లీ బాలయ్యతో క్లాష్ అంటే కష్టం. 

19న ‘అఖండ-2’ను రిలీజ్ చేయడం కష్టం. ఎందుకంటే ఆ రోజు ‘అవతార్-3’ రాబోతోంది. యుఎస్ సహా చాలా చోట్ల బాలయ్య చిత్రానికి ఇబ్బందులు తప్పవు కాబట్టి ఆ రోజు రాకపోవచ్చు. 25 ‘అఖండ-2’కు మంచి డేటే కానీ.. ఆ తేదీకి షెడ్యూల్ అయిన ఛాంపియన్, శంబాల సినిమాలకు చాలా కష్టం అవుతుంది. వాటికి చాలా ముందుగా డేట్ ఫిక్స్ చేశారు.

‘పెళ్ళి సందడి’ రిలీజైన నాలుగేళ్లకు ‘ఛాంపియన్’ సినిమాతో రాబోతున్నాడు శ్రీకాంత్ తనయుడు రోషన్. మరోవైపు పదేళ్లకు పైగా థియేట్రికల్ హిట్ లేని ఆది సాయికుమార్ ‘శంబాల’ మీద ఎన్నో ఆశలతో ఉన్నాడు. దీనికి ఆల్రెడీ ఓటీడీ డీల్ కూడా ఫిక్స్ కావడంతో 25నే రావాల్సి ఉంది. ‘అఖండ-2’తో పోటీ గురించి అతను స్పందిస్తూ.. అదే రోజు రిలీజ్ చేయడం తప్ప తమకు వేరే ఆప్షన్ లేదన్నాడు.

ఒకవేళ ‘అఖండ-2’ సంక్రాంతికి వచ్చినా.. ఆ పండక్కి షెడ్యూల్ అయిన భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారి నారి నడుమ మురారి లాంటి మిడ్ రేంజ్ సినిమాలకు ఇబ్బంది తప్పదు. వీటిలో చాలా సినిమాలు డిజిటల్ డీల్స్ దృష్ట్యా డేట్ మార్చుకోలేని స్థితిలో ఉన్నాయి. మరి ‘అఖండ-2’ బాంబు ఎవరి మీద పడుతుందో.. దేని షెడ్యూల్ ఎలా మారుతుందో చూడాలి.

Related Post

5 Hollywood Movies Releasing in January 2026: From Soulm8te to Greenland 25 Hollywood Movies Releasing in January 2026: From Soulm8te to Greenland 2

Cast: Rachel McAdams, Dylan O’Brien Director: Sam Raimi Language: English Genre: Survival, Drama Release date: January 30, 2026 Directed by Sam Raimi, Send Help stars Rachel McAdams and Dylan O’Brien