hyderabadupdates.com movies గోవా ప్రమాదం.. అసలు తప్పు ఎక్కడ జరిగింది?

గోవా ప్రమాదం.. అసలు తప్పు ఎక్కడ జరిగింది?

గోవా ట్రిప్ అంటే ఫుల్ ఎంజాయ్ అనుకుంటాం. కానీ ఆరపోరాలోని ‘బర్చ్ బై రోమియో లేన్’ అనే నైట్ క్లబ్ మాత్రం 25 మందికి మరణ శాసనం రాసింది. ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ ఘోర అగ్నిప్రమాదంలో నలుగురు పర్యాటకులు, 14 మంది సిబ్బంది సహా మొత్తం 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఇప్పుడు గోవా సేఫ్టీ ప్రోటోకాల్స్ మీద అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది.

తాటాకులే యమపాశాలుసరదాగా డ్యాన్స్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ క్లబ్ లోపల అలంకరణ కోసం వాడిన తాటాకులు క్షణాల్లో మంటలను వ్యాపింపజేశాయి. సిలిండర్ పేలుడు వల్లే ఇది జరిగిందని పోలీసులు చెబుతుంటే, ఫస్ట్ ఫ్లోర్ నుంచి మంటలు వచ్చాయని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. కారణం ఏదైనా, క్షణాల్లో క్లబ్ మొత్తం మంటల్లో చిక్కుకుంది.

అసలే ఇరుకైన ఎంట్రీ, ఎగ్జిట్ ఉండటంతో జనం భయంతో పరుగులు తీశారు. దారి తెలియక కొందరు గ్రౌండ్ ఫ్లోర్ కిచెన్ వైపు వెళ్లి అక్కడే ఇరుక్కుపోయారు. క్లబ్ వెనుక జలాశయాలు ఉండటం, దారి చిన్నగా ఉండటంతో ఫైర్ ఇంజన్లు కూడా 400 మీటర్ల దూరంలోనే ఆగిపోవాల్సి వచ్చింది. సరైన వెంటిలేషన్ లేకపోవడంతో పొగ కారణంగానే ఎక్కువమంది ఊపిరాడక చనిపోయారు.

అసలు ఆ క్లబ్ నిర్మాణం అక్రమమని తేలింది. దీనికి ఎలాంటి కన్‌స్ట్రక్షన్ లైసెన్స్ లేదని, గతంలోనే కూల్చివేత నోటీసులు ఇచ్చినా స్టే తెచ్చుకుని నడుపుతున్నారని సర్పంచ్ రోషన్ రెడ్కర్ చెప్పారు. పర్యావరణానికి హాని కలిగించే ప్రాంతంలో  నిబంధనలకు విరుద్ధంగా దీన్ని కట్టారు. ప్రభుత్వం ఈ ఘటనపై మెజిస్టీరియల్ ఎంక్వైరీకి ఆదేశించింది. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రధాని 2 లక్షల పరిహారం ప్రకటించారు. క్లబ్ యజమానులు, మేనేజర్లపై కేసులు నమోదు చేశారు.

Related Post

Nandamuri Balakrishna’s Historical Epic #NBK111 to Launch on this DateNandamuri Balakrishna’s Historical Epic #NBK111 to Launch on this Date

Nandamuri Balakrishna, known as the God of Masses, is ready to begin a new journey with his next big film #NBK111. After delivering back-to-back blockbusters, Balakrishna is now teaming up

కవిత దీక్ష.. ఎవరికీ పట్టట్లేదా?కవిత దీక్ష.. ఎవరికీ పట్టట్లేదా?

బీఆర్‌ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత గత రెండు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. అయితే దీనిపై ఎక్కడా చడీచప్పుడు వినిపించడం లేదు. కనిపించడమూ లేదు. ఎవ్వరూ దీనిపై పెద్దగా స్పందించడమూ

ఎంత బాగా చెప్పావు లోకేష్ఎంత బాగా చెప్పావు లోకేష్

“నేను కూడా అనేక అవమానాలు ఎదుర్కొన్నా. కానీ ఎక్కడా కుంగిపోలేదు. ధైర్యంగా నిలబడ్డాను. పోరాటం చేశాను. మనం కుంగిపోతే మనపై మరింత మంది రెచ్చిపోతారు. అప్పుడు మన ఉనికికే ప్రమాదం సంభవిస్తుంది.” అని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. తాజాగా