hyderabadupdates.com movies అఖండ-2… వాళ్ళందరితో కీలక సమావేశం

అఖండ-2… వాళ్ళందరితో కీలక సమావేశం

నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా ‘అఖండ-2’ అనూహ్య పరిణామాల మధ్య వాయిదా పడిపోయిన సంగతి తెలిసిందే. ఒక రోజు ఆలస్యంగా అయినా సినిమా రిలీజవుతుందేమో అని అభిమానులు ఆశించారు కానీ.. అలా జరగలేదు. ఈ వీకెండ్ సినిమా రాదని తేలిపోయాక.. కొత్త డేట్ ఏదా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఒక వారం ఆలస్యంగా రిలీజవుతుందన్నారు కానీ.. అది కష్టమే అనిపిస్తోంది. 

‘అఖండ-2’ వస్తే నాలుగు సినిమాలు డిసెంబరు 12 నుంచి వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. అంతే కాక ‘అఖండ-2’ టీంకు కూడా హడావుడి తప్పదు. కాబట్టే ఈ డేట్‌ను వదిలేసినట్లే తెలుస్తోంది. ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లు కూడా 12 రిలీజ్ పట్ల విముఖతతోనే ఉన్నారట. వాళ్లతో పాటు అభిమానులు ఎక్కువగా కోరుకుంటున్న డేట్.. డిసెంబరు 25 అని తెలుస్తోంది.

అఖండ-2 లాంటి పెద్ద సినిమాకు ఫెస్టివల్ సీజనే కరెక్ట్ అన్నది మెజారిటీ అభిప్రాయం. అలా అని సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయాలంటే చాలా కష్టమే. అక్కడ ఆల్రెడీ బెర్తులు ఓవర్ క్రౌడ్ అయిపోయాయి. క్రిస్మస్‌కు ఇతర భాషల్లోనూ భారీ చిత్రాలు లేవు. తెలుగు విషయానికి వస్తే ఛాంపియన్, శంబాల మూవీస్ షెడ్యూల్ అయి ఉన్నాయి. ఎక్కువ రోజులు సెలవులున్న ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఇంకో రెండు సినిమాలను రిలీజ్ చేసినా ఇబ్బంది ఉండదు. 19న అంటే ‘అవతార్-3’తో సమస్య తప్పదు. ముఖ్యంగా యుఎస్‌లో కోరుకున్నన్ని స్క్రీన్లు దొరకవు. అందుకే ఎక్కువమంది డిస్ట్రిబ్యూటర్లు డిసెంబరు 25న సినిమాను రిలీజ్ చేయాలని అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. 

ఈ రోజు హైదరాబాద్‌లో ‘అఖండ-2’ డిస్ట్రిబ్యూటర్లతో నిర్మాతలు సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి కొందరు ఇండస్ట్రీ పెద్దలు కూడా హాజరవుతున్నారు. ఏది బెస్ట్ డేట్ అనే విషయాన్ని చర్చించడంతో పాటు ముందు చేసుకున్న అగ్రిమెంట్లను రివైజ్ చేయడం మీదా మాట్లాడుకోబోతున్నారు. ఈ సమావేశం అయ్యాక ఈ రోజు లేదా ఒకట్రెండు రోజుల్లో రిలీజ్ డేట్ ఫైనలైజ్ చేసి ప్రకటన చేస్తారని సమాచారం. డిసెంబరు 25 డేట్‌ను ఎంచుకునే అవకాశాలు ఎక్కువ.

Related Post

పవన్ టూర్ తో ఉప్పాడకు ఊపిరొచ్చినట్టే!పవన్ టూర్ తో ఉప్పాడకు ఊపిరొచ్చినట్టే!

నిజమే. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వేస్తున్న నిర్మాణాత్మక అడుగులతో ఉప్పాడకు ఊపిరి వచ్చేసినట్టే. అదేదో ఏడాదో, రెండేళ్లో కాదు… శాశ్వతంగా ఉప్పాడ సమస్యకు పరిష్కారం లభించినట్టేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దాదాపుగా నెల రోజుల క్రితం ఉప్పాడలో

స్పిరిట్ ఇచ్చింది శాంపిల్ మాత్రమేస్పిరిట్ ఇచ్చింది శాంపిల్ మాత్రమే

నిన్న అర్ధరాత్రి న్యూ ఇయర్ కానుకగా విడుదల చేసిన స్పిరిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ క్షణాల్లో సోషల్ మీడియా టాపిక్ గా మారిపోయింది. ఊహించినట్టే సందీప్ రెడ్డి వంగా తన మార్క్ వయొలెన్స్ పరిచయం చేశారు. చొక్కా లేకుండా వెనుక నుంచి