hyderabadupdates.com movies జైల్లో ఉన్న హీరోకు థియేటర్ విడుదల

జైల్లో ఉన్న హీరోకు థియేటర్ విడుదల

స్వంత అభిమాని హత్య కేసులో అభియోగం ఎదురుకుంటున్న శాండల్ వుడ్ హీరో దర్శన్ ఎప్పుడు బయటికి వస్తాడో లేదా నేరం ఋజువై శిక్ష అనుభవిస్తాడో తెలియక అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ప్రస్తుతం బెంగళూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న దర్శన్ ఆ మధ్య కొన్ని వారాలు బెయిలు మీద బయటికి వచ్చాడు. గుట్టుచప్పుడు కాకుండా బ్యాలన్స్ ఉన్న డెవిల్ షూటింగ్, డబ్బింగ్ రెండూ పూర్తి చేశాడని ఇన్ సైడ్ టాక్. ఇప్పుడా సినిమానే డిసెంబర్ 11 అంటే రాబోయే గురువారం విడుదలవుతోంది. ఇటీవలే ట్రైలర్ లాంచ్ సైలెంట్ గా చేసేశారు. దర్శన్ ఫ్యాన్స్ ఈ నెలని హిట్ సెంటిమెంట్ గా భావిస్తారు.

సాక్ష్యాలు బలంగా ఉండటంతో దర్శన్ బయటికి రావడం అనుమానమేనని లాయర్లు చెబుతున్నారు. తన తరఫున వాదిస్తున్న న్యాయవాదులు మాత్రం శాయశక్తులా విడుదల చేయించేందుకు ట్రై చేస్తున్నారు. అయితే ఎలిబీలతో సహా అన్నీ దర్శన్ కు వ్యతిరేకంగా ఉండటం ప్రతికూలంగా మారింది. రాజకీయంగా కూడా ఎలాంటి మద్దతు దక్కకపోవడంతో దర్శన్ ఒంటరి పోరాడం చేస్తున్నాడు. కావాలంటే నన్ను చంపేయండి అంటూ గత హియరింగ్ లో జడ్జ్ ముందు వాపోయినప్పటికీ ఆ సింపతి పెద్దగా పని చేయలేదు. ఆ విన్నపాన్ని బుట్టదాఖలు చేయడంతో రిమాండ్ యథావిధిగా కొనసాగుతోంది.

ఇంత పెద్ద నేరంలో చిక్కుకున్నాక డెవిల్ కి ఎలాంటి ఆదరణ దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే స్వంత ఫ్యాన్స్ తప్ప ఇతర వర్గాల్లో తన పట్ల సానుభూతి లేదు. ఒక వ్యక్తిని అంత దారుణంగా చావుకు గురి చేయడం ఎవరూ సమర్ధించలేకపోతున్నారు. కొందరు డెవిల్ కు వ్యతిరేకంగా థియేటర్ల వద్ద నిరసన ప్లాన్ చేసే అవకాశం ఉండటంతో పోలీసులు దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నారట. డెవిల్ పెద్ద బడ్జెట్ తో రూపొందినప్పటికీ కన్నడలో మాత్రమే రిలీజవుతోంది. తెలుగుతో సహా ఇతర భాషల్లో డబ్బింగ్ చేయలేదు. హిట్టయినా ఫ్లాప్ అయినా దాన్ని ఆస్వాదించేందుకు దర్శన్ అయితే బయట ఉండడు.

Related Post

I got goosebumps watching Nani sir on the sets of The Paradise-Deekshith ShettyI got goosebumps watching Nani sir on the sets of The Paradise-Deekshith Shetty

Deekshith Shetty, who made his Telugu debut with Nani’s Dasara, is all praise for the star’s upcoming project The Paradise. Sharing his excitement, Deekshith said he recently visited the sets

అకీరానే కాదు అందరూ జాగ్రత్త పడాలిఅకీరానే కాదు అందరూ జాగ్రత్త పడాలి

పవన్ కళ్యాణ్ వారసుడిగా స్క్రీన్ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురు చూస్తున్న అకీరానందన్ ఇంకా ఇండస్ట్రీకి రాకముందే హాట్ టాపిక్ అవుతున్నాడు. తన అనుమతి, ప్రమేయం లేకుండా ఏఐ లవ్ స్టోరీ అనే ఇండిపెండెంట్ మూవీని తీసి, దాన్ని యూట్యూబ్ లో