hyderabadupdates.com movies హార్దిక్ దెబ్బకు పవర్ఫుల్ విక్టరీ

హార్దిక్ దెబ్బకు పవర్ఫుల్ విక్టరీ

టెస్ట్ సిరీస్ ఓటమి బాధను మరిపిస్తూ వన్డే సిరీస్ గెలిచిన టీమిండియా, ఇప్పుడు టీ20లోనూ అదే జోరు కొనసాగించింది. కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో సౌతాఫ్రికాను చిత్తుగా ఓడించింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అదరగొట్టి ఏకంగా 101 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

మొదట బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఆరంభంలో గట్టి షాక్ తగిలింది. శుభ్‌మన్ గిల్ (4), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (12) త్వరగా పెవిలియన్ చేరారు. అభిషేక్ శర్మ (17), తిలక్ వర్మ (26) కాసేపు వికెట్ కాపాడుకున్నా వేగంగా ఆడలేకపోయారు. కష్టాల్లో ఉన్న జట్టును హార్దిక్ పాండ్యా ఆదుకున్నాడు. ఆఖర్లో విశ్వరూపం చూపించిన హార్దిక్, కేవలం 28 బంతుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 59 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అక్షర్ పటేల్ (23) కూడా మెరవడంతో భారత్ 20 ఓవర్లలో 175 పరుగుల మంచి స్కోరు సాధించింది.

176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా, భారత బౌలర్ల ధాటికి పేకమేడలా కుప్పకూలింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (0) డకౌట్ అవ్వగా, కెప్టెన్ మార్క్రమ్ (14), స్టబ్స్ (14), మిల్లర్ (1) వంటి స్టార్లంతా చేతులెత్తేశారు. డెవాల్డ్ బ్రెవిస్ (22) ఒక్కడే కాస్త పోరాడాడు. మిగతా బ్యాటర్లెవరూ కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోవడంతో సఫారీ జట్టు 12.3 ఓవర్లలోనే కేవలం 74 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

భారత బౌలర్లు సమిష్టిగా రాణించి వికెట్ల పండగ చేసుకున్నారు. అర్ష్‌దీప్ సింగ్ (2/14), జస్ప్రీత్ బుమ్రా (2/17), స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి (2/19), అక్షర్ పటేల్ (2/7) తలో రెండు వికెట్లు తీసి ప్రత్యర్థిని కోలుకోనీయలేదు. శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా కూడా చెరో వికెట్ పడగొట్టారు. సౌతాఫ్రికా టాప్ ఆర్డర్‌ను మన బౌలర్లు వణికించిన తీరు మ్యాచ్‌కే హైలైట్.

ఈ విజయంతో టీమిండియా ఆత్మవిశ్వాసం రెట్టింపయింది. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ (1 వికెట్) రానించి ఆల్ రౌండర్ షోతో అదరగొట్టాడు. కష్టమైన పిచ్‌పై హార్దిక్ ఆడిన ఇన్నింగ్స్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. ఇదే జోరు కొనసాగిస్తే టీ20 సిరీస్ కూడా భారత్ ఖాతాలో చేరడం ఖాయం.

Related Post

Stranger Things Isn’t Over: Upside Down Returns in 2026 Animated Series Tales From ’85Stranger Things Isn’t Over: Upside Down Returns in 2026 Animated Series Tales From ’85

The Duffer Brothers explained in a Netflix featurette that an animated series was one of their earliest ideas for expanding the Stranger Things universe. Matt Duffer said, “When we started

మరో రాజకీయ చెల్లి! అన్నతో విబేధాలు లేవంటూ..మరో రాజకీయ చెల్లి! అన్నతో విబేధాలు లేవంటూ..

తెలుగు రాష్ట్రంలో మరో చెల్లి తన రాజకీయ ప్రస్తానాన్ని మొదలు పెట్టింది. వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా డిసెంబరు 26న విశాఖ లో రంగ నాడు పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు రంగ కుమార్తె వంగవీటి ఆశా కిరణ్

మ్యాక్స్ ఆడింది… మార్క్ ఓడిందిమ్యాక్స్ ఆడింది… మార్క్ ఓడింది

ఈగ విలన్ గా మనకు దగ్గరైన కిచ్చ సుదీప్ బాహుబలి, సైరా నరసింహారెడ్డిలో క్యామియోలు చేయడం ద్వారా ఇంకాస్త పేరు తెచ్చుకున్నాడు. ఇటీవలే క్రిస్మస్ పండగ రోజు తన మార్క్ సినిమా రిలీజయ్యింది. గత ఏడాది ఇదే టైంలో చేసిన మ్యాక్స్