hyderabadupdates.com movies మన దేశం పౌరసత్వం కోసం అతను చేసింది త్యాగమే

మన దేశం పౌరసత్వం కోసం అతను చేసింది త్యాగమే

విదేశాలకు వెళ్లిన చాలామంది అక్కడి సిటిజన్‌షిప్ కోసం ఆరాటపడుతుంటారు. గ్రీన్ కార్డు కోసమో, పాస్‌పోర్ట్ కోసమో ఏళ్ల తరబడి ఎదురుచూస్తారు. కానీ జర్మనీలో తొమ్మిదేళ్లుగా ఉంటున్న మయూఖ్ పాంజా అనే యువకుడు మాత్రం ఇందుకు విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నాడు. తనకు జర్మన్ పాస్‌పోర్ట్ వచ్చే అర్హత ఉన్నా సరే, దాన్ని సున్నితంగా తిరస్కరించాడు. భారతీయ పౌరసత్వాన్ని వదులుకోవడానికి మనసు ఒప్పుకోలేదని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

మయూఖ్ జర్మనీలో ఏఐ కంపెనీ ఫౌండర్. అక్కడికి వెళ్లి తొమ్మిదేళ్లు దాటింది. ఏడాది క్రితమే ఆయనకు జర్మన్ పౌరసత్వం తీసుకునే అర్హత వచ్చింది. కానీ ఆయన అప్లై చేయలేదు. దీనికి కారణం చెబుతూ సోషల్ మీడియాలో (X) ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టాడు. “ఇది కేవలం ఒక డాక్యుమెంట్ మాత్రమే కావచ్చు. కానీ నేను భారతీయుడిని. జర్మన్‌గా మారడం నాకు ఎందుకో వింతగా అనిపిస్తోంది. నేను ఇక్కడ ఎంతకాలం ఉన్నా నా మనసు మాత్రం ఇండియన్‌గానే ఫీల్ అవుతోంది” అని రాసుకొచ్చాడు.

జర్మనీ చరిత్ర, భాష, సంస్కృతి తనకు తెలుసు కానీ వాటితో ఎమోషనల్ కనెక్షన్ లేదని చెప్పాడు. ఉదాహరణకు జర్మనీ ఫుట్‌బాల్ మ్యాచ్ గెలిస్తే తనకు పెద్దగా ఏమీ అనిపించదని, అదే ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే ఆ కిక్కే వేరని చెప్పుకొచ్చాడు. తాను జర్మనీకి స్నేహితుడిని మాత్రమే తప్ప, జర్మనీ వాడిని కాలేనని స్పష్టం చేశాడు.

మరో ముఖ్యమైన కారణం కూడా చెప్పాడు. జర్మనీ పౌరసత్వం తీసుకుంటే అక్కడి పద్ధతులకు తగ్గట్టుగా తాను మారాల్సి ఉంటుంది. శతాబ్దాలుగా ఉన్న వారి సంస్కృతి తన కోసం మారాలని కోరుకోవడం తప్పు. అదే ఇండియాలో అయితే, మెజారిటీ అభిప్రాయంతో విభేదించినా సరే, తన గొంతు వినిపించే హక్కు తనకు ఉంటుందని ఫీల్ అయ్యాడు. “నా అభిప్రాయాలు భారతీయమైనవి. అవి అందరికీ నచ్చకపోవచ్చు. కానీ అవి కలిగి ఉండే హక్కు ఇండియన్ పాస్‌పోర్ట్ నాకు ఇస్తుంది” అని గర్వంగా చెప్పాడు.

Related Post

Akash Jagannadh Launches the Melodious Title Song of ‘Vasudeva Sutham’Akash Jagannadh Launches the Melodious Title Song of ‘Vasudeva Sutham’

The much-awaited title song from the upcoming film Vasudeva Sutham has been officially launched by young hero Akash Jagannadh. The movie stars Master Mahendran in the lead role and is