hyderabadupdates.com movies మోగ్లీకి ఊహించని పరీక్ష

మోగ్లీకి ఊహించని పరీక్ష

బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు వస్తుందేమో అనుకుంటే ఫ్యాన్స్ డిమాండ్ కు తలొగ్గో లేక ఇంకేదైనా కారణాల వల్లో ఏదైతేనేం ఫైనల్ గా డిసెంబర్ 12 లాక్ చేసుకుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోగా యుఎస్ లో కూడా మంచి పికప్ కనిపిస్తోంది. అయితే హఠాత్తుగా నిర్ణయం తీసుకోవడం వల్ల ఇదే డేట్ కి రావాలనుకున్న రిలీజులు ఇబ్బందిలో పడ్డాయి. సైక్ సిద్దార్థ్ ఏకంగా జనవరి 1కి వెళ్లిపోగా ఈషా డిసెంబర్ 25 వైపు చూస్తోంది. మోగ్లీ కూడా ఇదే రూటు పడుతుందేమో అనుకున్నారు కానీ ఫైనల్ గా పోటీకి సిద్ధపడింది.

ఒక రోజు ఆలస్యంగా డిసెంబర్ 13 మన ప్రేక్షకులను మోగ్లీ పలకరించబోతున్నాడు. ఇది టీమ్ కు పెద్ద సవాల్ లాంటి ప్రాజెక్టు. ఎందుకంటే దర్శకుడు సందీప్ రాజ్ మొదటి సినిమా కలర్ ఫోటో నేరుగా ఓటిటిలో వచ్చింది. జాతీయ అవార్డు వచ్చినా దాని థియేటర్ స్టామినా ఏంటో బయట పడలేదు. అందుకే మోగ్లీని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణం కావడంతో బడ్జెట్ కూడా ఎక్కువే అయ్యింది. యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల కొడుకు రోషన్ కనకాలకు గతంలో డెబ్యూ మూవీ బబుల్ గమ్ ఫ్లాప్ అయ్యింది. తన ఆశలన్నీ మోగ్లీ  మీదే ఉన్నాయి. బాగా కష్టపడ్డాడు కూడా.

ఇప్పుడు నేరుగా అఖండ 2ని ఢీ కొట్టడం మోగ్లీ  ముందున్న అతి పెద్ద పరీక్ష. ఎందుకంటే బాలయ్య మూవీకి హిట్ టాక్ వస్తే ఆపడం కష్టం. జనాల అటెన్షన్ అంతా దానివైపే వెళ్తుంది. ప్రమోషన్లకు ఎక్కువ టైం లేకపోవడంతో మోగ్లీ  ఉన్నంతలో పబ్లిసిటీ బాగానే చేసుకుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ తో దాన్ని పెంచే ప్లాన్ చేసుకుంది. ఇవి ఎక్కువ ఫలితం ఇస్తాయని చెప్పలేం కానీ ఫైనల్ గా కంటెంట్ తో మెప్పిస్తేనే నిలబడడానికి అవకాశం ఉంటుంది. ఎలాగూ రెండు వారాలుగా బాక్సాఫీస్ డ్రైగా ఉంది కాబట్టి అఖండ 2తో పాటు మరో సినిమాకు స్కోప్ ఉంది. ఇప్పుడా స్లాట్ ని మోగ్లీ సరైన రీతిలో వాడుకుంటే చాలు.

Related Post

టార్గెట్‌ చేస్తే దేశాన్ని షేక్‌ చేస్తా..: బీజేపీపై దీదీ ఫైర్టార్గెట్‌ చేస్తే దేశాన్ని షేక్‌ చేస్తా..: బీజేపీపై దీదీ ఫైర్

“బెంగాల్‌లో నన్ను లక్ష్యంగా చేస్తే, నా ప్రజలపై దాడి వ్యక్తిగత దాడిగానే పరిగణిస్తాను. ఎన్నికల తర్వాత దేశం మొత్తం తిరుగుతూ పెద్ద ఎత్తున పోరాడుతాను,” అని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ హెచ్చరించారు. కేంద్ర ఎన్నికల సంఘంపై బీజేపీ ప్రభావం చూపుతోందని

Prabhas Launches Global Short Film Festival to Spotlight New StorytellersPrabhas Launches Global Short Film Festival to Spotlight New Storytellers

Pan-India superstar Prabhas has unveiled a powerful new platform for aspiring filmmakers by launching The Script Craft International Short Film Festival, positioning it as a global launchpad for fresh storytelling