hyderabadupdates.com movies దురంధర్ భామకు దశ తిరుగుతోంది

దురంధర్ భామకు దశ తిరుగుతోంది

ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్ సింగ్ కెరీర్ లోనే పెద్ద నెంబర్లు నమోదవుతున్నాయి. ప్రస్తుతం రెండు వందల కోట్లను దాటే పనిలో ఉన్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాలో అందరూ అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్ ల గురించి మాట్లాడుకున్నారు కానీ బయటికి ఎక్కువ కనిపించకుండా యూత్ ని ఆకట్టుకుంటున్న హీరోయిన్ సారా అర్జున్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. పట్టుమని ఇరవై సంవత్సరాలు కూడా లేని ఈ టీనేజ్ బ్యూటీ, వయసు పరంగా చిన్నదే అయినా రణ్వీర్ సింగ్ ప్రియురాలిగా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది.

నిజానికి సారా అర్జున్ వెనుక యాక్టింగ్ బ్యాక్ గ్రౌండ్ ఎన్నో సంవత్సరాల నుంచే ఉంది. ఏడేళ్ల వయసులోనే విక్రమ్ నాన్నలో నటించి ప్రశంసలు దక్కించుకున్న సంగతి మూవీ లవర్స్ కు గుర్తుండే ఉంటుంది. రాజేంద్రప్రసాద్ దాగుడుమూతల దండాకోర్ లో ఆయన మనవరాలిగా నటించింది. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి లీడ్ హీరోయిన్ గా నిత్యం హిందీ తమిళ సినిమాలు చేస్తూనే వచ్చింది. పొన్నియిన్ సెల్వన్ లో చిన్నప్పటి ఐశ్వర్య రాయ్ పాత్రలో తళుక్కున మెరిసింది తనే. ఇది చూశాకే ఆదిత్య ధార్ ఈమెను ఎంపిక చేసుకున్నారు. సారా అర్జున్ తండ్రి రాజ్ అర్జున్ కూడా ఆర్టిస్టే. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు చేశాడు.

అన్నట్టు సారా అర్జున్ తెలుగులో కూడా డెబ్యూ చేయనుంది. గుణశేఖర్ దర్శకత్వంలో అందరూ కొత్త వాళ్ళతో రూపొందిన యూఫోరియాలో తనుంది. ఒక్కడు ద్వారా భూమికకు పెద్ద బ్రేక్ ఇచ్చినట్టు ఇప్పుడీ యూఫోరియాతో తనకు అలాంటి మలుపు దక్కుతుందని సారా అర్జున్ ఎదురు చూస్తోంది. ఫిబ్రవరిలో విడుదలకు రెడీ అవుతున్న ఈ యూత్ మూవీలో నటనకు ప్రాధాన్యం ఎక్కువ ఉండే పాత్రే ఇచ్చారట. చిన్న వయసులోనే దురంధర్ లాంటి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సారా అర్జున్ వయసు పెరిగే కొద్దీ సరైన అవకాశాలు దక్కించుకుంటే మాత్రం బాలీవుడ్లో దూసుకెళ్లిపోవచ్చు.

Related Post

గోవా… ఉన్న క్రేజ్ కూడా పోయినట్లే..గోవా… ఉన్న క్రేజ్ కూడా పోయినట్లే..

ఒకప్పుడు గోవా అంటే యూత్ కి అదో డ్రీమ్ డెస్టినేషన్. ఫ్రెండ్స్ తో ప్లాన్ వేస్తే ఫస్ట్ గుర్తొచ్చేది గోవానే. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. గోవా వెళ్లాలంటేనే జనం ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా

ఇంకో సెంచరీ కొట్టేస్తే… హిస్టరీనేఇంకో సెంచరీ కొట్టేస్తే… హిస్టరీనే

ప్రదీప్ రంగనాథన్.. ఈ పేరు ఇప్పుడు సౌత్ ఇండియాలో ఒక సంచలనం. జయం రవి హీరోగా ‘కోమాలి’ అనే కామెడీ మూవీతో అతను దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. తర్వాత కొన్నేళ్లు ఈ కుర్రాడు కనిపించలేదు.

ఉత్తర భారతం ఉక్కిరిబిక్కిరి.. రాహుల్ ఫైర్ఉత్తర భారతం ఉక్కిరిబిక్కిరి.. రాహుల్ ఫైర్

ఉత్తర భారతం కాలుష్య కోరల్లో చిక్కుకుంది. గాలి పీల్చడమే ఒక పెద్ద సాహసంగా మారింది. ఈ పరిస్థితులపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరినా, ప్రభుత్వం ఎందుకు