hyderabadupdates.com movies బీజేపీలో జ‌గ‌న్ కోవ‌ర్టులు.. అధిష్టానం ఆరా…?

బీజేపీలో జ‌గ‌న్ కోవ‌ర్టులు.. అధిష్టానం ఆరా…?

ఏపీ బీజేపీలో నాయ‌కుల మ‌ధ్య లుక‌లుక‌లు ఉన్నాయి. ఒక‌రంటే ఒక‌రికి ప‌డ‌క‌పోవ‌డం.. ఒకరిపై మ‌రొక‌రు ఆధిప‌త్య రాజ‌కీయాలు చేయ‌డం వంటివి కామ‌న్‌గా మారాయి. అయితే.. సాధార‌ణంగా ఏ పార్టీలో అయినా.. ఇలాంటి ఆధిప‌త్య రాజ‌కీయాలు ఉంటాయి. అదేస‌మ‌యంలో క్షేత్ర‌స్థాయి నాయ‌కులు కూడా త‌మ త‌మ శైలిలో రాజ‌కీయాలు చేస్తుంటారు. దీనిని పార్టీలు కూడా స‌హిస్తుంటాయి. కానీ.. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు కోవ‌ర్టులుగా వ్య‌వ‌హ‌రించే వారి విష‌య‌మే ఎప్పుడూ ఇబ్బందుల‌కు దారి తీస్తుంది.

ఇప్పుడు ఏపీ బీజేపీలో ఈ విష‌య‌మే చ‌ర్చ‌కు వ‌స్తోంది. పార్టీలో కోవ‌ర్టులు ఉన్నారంటూ.. కొన్నాళ్లుగా నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. అది కూడా వైసీపీకి మేలు చేసేలా వ్య‌వ‌హ‌రించే వారు ఉన్నార‌న్న‌ది వారి మాట‌.

ఒక వైపు కూట‌మి పార్టీలు క‌ల‌సి క‌ట్టుగా ముందుకు సాగాల‌ని భావిస్తుంటే.. నాయ‌కులు ఎవ‌రైనా కూడా.. దీనికి ద‌న్నుగా నిలవాల్సి ఉంటుంది. కానీ, పార్టీ ప‌రంగా మాత్రం కొంద‌రు నాయ‌కులు వైసీపీకి, జ‌గ‌న్‌కు కూడా కోవ‌ర్టులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ.. బీజేపీ అధిష్టానానికి లేఖ‌లు ముటాయ‌ని స‌మాచారం. ఇది ఇప్పుడు అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో హాట్ టాపిక్‌గా మారింద‌న్న‌ది వాస్త‌వం.

“నిజ‌మే. ఈ విష‌యం కొన్నాళ్లుగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కొంద‌రు నాయ‌కుల వ్య‌వ‌హార శైలి అలానే ఉంది.“ అని విజ‌య‌వాడ‌కు చెందిన కీల‌క బీజేపీ నాయ‌కుడు ఒక‌రు వ్యాఖ్యానించారు. అయితే.. దీనిని త‌ప్పుప‌ట్టాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్ప‌డం విశేషం. కేంద్రంతో ఉన్న స‌త్సంబంధాల విష‌యంలో బీజేపీ నాయ‌కులు కొంద‌రు గ‌తంలో వైసీపీ అధినేత‌తో ప‌నులు చేయించుకున్నార‌ని.. రాజ్య‌స‌భ సీటు కూడా ద‌క్కించుకున్నార‌ని.. సో.. అలాంట‌ప్పుడు ఇవ‌న్నీ కామ‌నేన‌ని చెప్పిన నాయ‌కుడు కూడా ఉన్నారు. కానీ, ఇప్పుడు ప‌రిస్థితులు మారాయి. కోవ‌ర్టులు వెన‌క్కి త‌గ్గాల్సిందేన‌ని హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం.

Related Post

కిరణ్ అబ్బవరం ప్రశ్న… మైత్రి రవి సమాధానంకిరణ్ అబ్బవరం ప్రశ్న… మైత్రి రవి సమాధానం

ఇటీవలే కిరణ్ అబ్బవరం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రదీప్ రంగనాథన్ కి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు దొరికినట్టు తన తెలుగు సినిమాని తమిళనాడులో రిలీజ్ చేద్దామంటే అక్కడి డిస్ట్రిబ్యూటర్లు స్క్రీన్లు ఇవ్వడం లేదని చెప్పడం సోషల్ మీడియాలో పెద్ద టాపిక్కే అయ్యింది.

సోషల్ మీడియాలో మోడీ సరికొత్త రికార్డు!సోషల్ మీడియాలో మోడీ సరికొత్త రికార్డు!

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో 10 కోట్ల మందికి పైగా ఫాలోవర్లను సొంతం చేసుకుని ప్రపంచ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ప్రపంచ దేశాల్లో ఇంత భారీ సంఖ్యలో ఫాలోవర్లను సొంతం చేసుకున్న