hyderabadupdates.com movies మొన్న టీచర్లు.. నేడు పోలీసులు.. ఏపీలో కొలువుల జాతర

మొన్న టీచర్లు.. నేడు పోలీసులు.. ఏపీలో కొలువుల జాతర

ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు పోలీసు శాఖలో ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న కానిస్టేబుళ్ల భర్తీని ముగించింది. మొత్తం 6,100 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా 6,014 మంది ఎంపికయ్యారు. వీరిలో 5,757 మందిని శిక్షణకు ఎంపిక చేయగా, సివిల్ కానిస్టేబుళ్లుగా 3,343 మంది, ఏపీఎస్‌పీ కానిస్టేబుళ్లుగా 2,414 మంది ఎంపికయ్యారు. సివిల్ విభాగంలో 993 మంది మహిళా కానిస్టేబుళ్లు ఉండడం విశేషం.

ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 22 నుంచే శిక్షణ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా పోలీసు శాఖలో నూతనంగా చేరుతున్న అభ్యర్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియామక పత్రాలు అందజేయనున్నారు. మంగళవారం మంగళగిరిలోని ఏపీఎస్‌పీ 6వ బెటాలియన్ ప్రాంగణంలో సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. ఎంపికైన ఉద్యోగులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్‌లో ఉన్న నియామక నోటిఫికేషన్‌లను పూర్తిచేసి ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించింది. కొద్ది నెలల క్రితం మెగా డీఎస్సీ ద్వారా 15,941 మంది ఉపాధ్యాయులకు ఉద్యోగాలు కల్పించిన ప్రభుత్వం, తాజాగా పోలీసు శాఖలో 6,104 ఖాళీలను భర్తీ చేసింది. రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన 31 రిట్ పిటిషన్లను న్యాయస్థానాల్లో పరిష్కరించి, పరీక్షలను పారదర్శకంగా నిర్వహించి 60 రోజుల్లోనే ఫలితాలు ప్రకటించడంతో ఈ నియామక ప్రక్రియ విజయవంతమైందని ప్రభుత్వం పేర్కొంది.

Related Post

హరీష్‌ను పవన్ కొట్టింది అందుకా…హరీష్‌ను పవన్ కొట్టింది అందుకా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే దర్శకుడు హరీష్ శంకర్‌కు ఎంత అభిమానమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తన ఆరాధ్య కథానాయకుడిని తనలాంటి అభిమానులు ఎలా చూడాలనుకుంటారో అలా చూపించి ‘గబ్బర్ సింగ్’తో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు హరీష్. మళ్లీ

D54 officially titled Kara: Dhanush presents his fierce and intense first lookD54 officially titled Kara: Dhanush presents his fierce and intense first look

Directed by Por Thozhil fame Vignesh Raja, Kara is touted to be an emotionally rooted suspense thriller that features Mamitha Baiju as the female co-lead, along with KS Ravikumar, Jayaram,

అంచనాల లెక్కల్లో ఓడిపోయింది ఎవరుఅంచనాల లెక్కల్లో ఓడిపోయింది ఎవరు

ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలను వారం రోజులు ముందుకు జరిపి మార్చి 19 ఫిక్స్ చేసినప్పుడు నిర్మాతలు చెప్పిన వెర్షన్ ఒకటే. టాక్సిక్ వాయిదా పడింది కాబట్టి డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేసి ఖచ్చితంగా ఉగాదికి పవన్ కళ్యాణ్ సినిమా ఉండాలని, దురంధర్