hyderabadupdates.com movies ఎన్టీఆర్ అభిమాని పాడే మోసిన నందమూరి తనయులు

ఎన్టీఆర్ అభిమాని పాడే మోసిన నందమూరి తనయులు

ఎన్టీఆర్ వీరాభిమాని, తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో సేవలందించిన ఎన్టీఆర్ రాజు అకాల మరణానికి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన నందమూరి రామకృష్ణ, నందమూరి మోహనకృష్ణలు గురువారం తిరుపతిలో ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించి, అంతిమయాత్రలో పాల్గొని పాడె మోసారు.

నందమూరి కుటుంబం తరపున రాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన, ఎన్టీఆర్ రాజు నందమూరి వీరాభిమానిగా ఎనలేని సేవలు చేశారని, రెండు సార్లు టీటీడీ బోర్డు సభ్యుడిగా భక్తులకు అమూల్య సేవలందించారని గుర్తు చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామరావు వీరాభిమాని ఎన్టీఆర్ రాజు, ఆయన పేరునే తన ఇంటి పేరుగా మార్చుకుని జీవితాంతం ఎన్టీఆర్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారు. బుధవారం తిరుపతిలో కన్నుమూశారు. ఈ మరణవార్తతో ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

రాజకీయ రంగంలో ఎన్టీఆర్‌కు అఖిల భారత కార్యదర్శిగా పనిచేసిన ఎన్టీఆర్ రాజు, తెలుగుదేశం పార్టీకి నిస్వార్థ సేవలు అందించారు. ఎన్టీఆర్ స్వయంగా ఉన్నత పదవులు, ఎమ్మెల్యే అవకాశాలు ఆఫర్ చేసినప్పటికీ, అభిమానిగా ఉండటమే చాలునని తిరస్కరించారు. పదవులకన్నా ఆదర్శాలు ముఖ్యమని చాటిన ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

Related Post

పదిరోజుల్లోనే మాట నిలబెట్టుకున్న పవన్పదిరోజుల్లోనే మాట నిలబెట్టుకున్న పవన్

మాటిచ్చిన కేవలం పదిరోజుల్లోనే ఆ హామీని కార్యరూపంలోకి తీసుకువచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌. తొమ్మిది రోజుల క్రితం చిలకలూరిపేట శారదా జిల్లా పరిషత్ హైస్కూల్‌ను సందర్శించిన ఆయన, మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్‌లో పాల్గొని విద్యార్థులతో మమేకమయ్యారు. పాఠశాల గదులు, ల్యాబ్‌ను

11 సీట్లు ఎలా వచ్చాయన్నదానిపై కోటి సంతకాలు చేయించాలి11 సీట్లు ఎలా వచ్చాయన్నదానిపై కోటి సంతకాలు చేయించాలి

ఏపీలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కొనసాగుతోంది. దీనికి డెడ్‌లైన్‌ను మళ్లీ మళ్లీ పొడిగించారు. కోటి సంతకాలు సేకరించి గవర్నర్ నజీర్‌ను కలిసి పీపీపీకి వ్యతిరేకంగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకోవాలన్నది వైసీపీ