hyderabadupdates.com movies పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిఫార్సుతో ఈ నిధులు కేటాయించబడినట్లు దేవాదాయ వర్గాలు వెల్లడించాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని జనసేన పార్టీ తెలంగాణ ఇన్చార్జి నేమూరి శంకర్ గౌడ్ సూచనప్రాయంగా వెల్లడించారు.

పవన్ కళ్యాణ్‌కు కొండగట్టు ఆలయం ప్రత్యేక సెంటిమెంట్‌గా మారింది. ఆయన రాజకీయ జీవితంలో కీలక దశలన్నింటిలోనూ ఈ ఆలయాన్ని సందర్శిస్తూ వస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ, జనసేన పార్టీ ప్రారంభ సమయంలో ఆంజనేయ స్వామి ఆశీస్సులు తీసుకోవడం, ఎన్నికల ప్రచారం ప్రారంభానికి ముందు ‘వారాహి’ వాహనానికి ప్రత్యేక పూజలు చేయించడం ఇందుకు నిదర్శనం.

ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఆలయ అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. భక్తుల సౌకర్యార్థం వసతి కోసం 100 గదులు, దీక్షా మండపం నిర్మాణానికి టీటీడీ నిధులు వినియోగించనున్నట్లు సమాచారం. 2024 జూన్‌లో వారాహి దీక్షలో భాగంగా కొండగట్టు ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా ఆలయ అధికారులు అభివృద్ధి నిధుల అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లగా, అందుకు సానుకూల స్పందన లభించినట్లు తెలుస్తోంది.

Related Post

దురంధరుడి ఊచకోతకు ‘వెయ్యి కోట్లు’దురంధరుడి ఊచకోతకు ‘వెయ్యి కోట్లు’

దురంధర్ అనుకున్నట్టే వెయ్యి కోట్ల మార్కును దాటేసింది. రిలీజ్ కు ముందు వరకు పెద్దగా ఆంచనాలు లేవు. ట్రైలర్ చూశాక ఇదేదో తేడాగా ఉందని నెగటివ్ కామెంట్స్ చేసినవాళ్లు ఎక్కువ. ఓపెనింగ్ రెండు రోజుల కలెక్షన్లు చూసి కార్పొరేట్ బుకింగ్స్ అని

మీ సొమ్ము మీరే తీసుకోండి: మోదీమీ సొమ్ము మీరే తీసుకోండి: మోదీ

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఆసక్తికర విష‌యాన్ని దేశ ప్ర‌జ‌ల‌తో పంచుకున్నారు. “ఇది మీ సొమ్మా.. అయితే.. సొంతం చేసుకోండి. మీ క‌ష్టార్జితాన్ని వ‌దులుకోకండి“ అని ఆయ‌న `లింక్డ్ ఇన్‌`లో పోస్టు చేశారు. సామాజిక మాధ్య‌మాల్లో స్పీడుగా ఉండే ప్ర‌ధాన‌మంత్రి.. తాజాగా