hyderabadupdates.com movies ఇంటిని తాక‌ట్టు పెట్టిన హ‌రీష్ రావు… దేనికో తెలుసా?

ఇంటిని తాక‌ట్టు పెట్టిన హ‌రీష్ రావు… దేనికో తెలుసా?

బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు.. త‌న ఇంటిని తాక‌ట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వ‌ద్దుకు వెళ్లిన ఆయ‌న స్వ‌యంగా త‌న ఇంటి ప‌త్రాల‌ను వారికి ఇచ్చి.. సంబంధిత ప‌త్రాల‌పై సంత‌కాలు చేశారు. అనంత‌రం.. 20 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను అప్పుగా తీసుకున్నారు. అయితే.. ఆయ‌న గ‌తంలోనూ మంత్రిగా ప‌నిచేసి ఉండ‌డం.. సుదీర్ఘ‌కాలంగా రాజ‌కీయాల్లో ఉన్న నేప‌థ్యంలో ఇప్పుడు అంత పెద్ద మొత్తం అప్పు చేయాల్సిన అవ‌స‌రం ఏముంద‌న్న సందేహం వ‌స్తుంది.

అయితే.. ఈ అప్పు.. త‌న కోసం కాదు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని పేద కుటుంబానికి చెందిన యువ‌తి ఉన్న‌త చ‌దువు కోసం.. హ‌రీష్‌రావు అప్పు చేసి మ‌రీ నిధులు స‌మ‌కూర్చారు. సిద్దిపేట నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన రామ‌చంద్రం కుటుంబం పేద‌రికంలో ఉంది. అయితే.. ఆయ‌న కుమార్తె మ‌మ‌త నీట్‌లో సీటు ద‌క్కించుకుంది. దీంతో గ‌తంలోనే హ‌రీష్‌రావు ఆ కుటుంబాన్ని ఆదుకుని.. ఎంబీబీఎస్ కు అయ్యే సొమ్మును భ‌రించారు. ఇప్పుడు మ‌మ‌త‌.. పీజీలోనూ సీటు ద‌క్కించుకుంది.

కానీ, ఏటా 7 ల‌క్ష‌ల రూపాయ‌లు చెల్లించాల్సి రావ‌డంతో ఈ విష‌యాన్ని రామ‌చంద్రం.. ఇటీవ‌ల హ‌రీష్ రావు దృష్టికి తెచ్చారు. త‌మ‌కు ఇల్లు, పొలం వంటివి ఏమీ లేవ‌ని.. ఉంటే విద్యారుణం తీసుకునే వార‌మ‌ని విల‌పించారు. ఈ క‌ష్టం చూసి క‌రిగిపోయిన హ‌రీష్‌రావు.. నేనున్నానంటూ.. పెద్ద మ‌న‌సు చాటుకున్నారు.

శుక్ర‌వారం ఉద‌యం బ్యాంకు కు వెళ్లి.. త‌న ఇంటి ప‌త్రాల‌ను తాక‌ట్టుగా పెట్టి.. విద్యా రుణం తీసుకున్నారు. అనంత‌రం.. త‌న ఇంటికి చేరుకుని.. మ‌మ‌త‌ను శాలువాతో స‌త్క‌రించి.. మూడేళ్ల‌కు స‌రిపోయేలా 20 ల‌క్ష‌ల రూపాయ‌ల సొమ్మును ఆమెకు అందించారు. దీంతో మ‌మ‌త ఆనంద‌బాష్పాలు రాల్చింది. హ‌రీష్ రావు చేసిన సాయాన్ని జ‌న్మ జ‌న్మ‌ల‌కూ మ‌రిచిపోలేన‌ని పేర్కొంది.

కాగా.. ఇటీవ‌ల కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే.. జ‌గ్గారెడ్డి కూడా.. ఓ పేద కుటుంబానికి చ‌దువు కోసం 10 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను సాయం చేశారు. విద్యార్థి కుటుంబాన్ని ఇంటికి పిలిచి.. భోజ‌నం పెట్టి, బ‌ట్టలు పెట్టి మ‌రీ న‌గ‌దు నోట్ల క‌ట్ట‌ల‌ను వారికి ఇచ్చి.. ప్రోత్స‌హించారు. ఇప్పుడు హ‌రీష్‌రావు కూడా ఇదే ప‌నిచేశారు. కాగా.. ఇరువురి సాయంపై నెటిజ‌న్లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

Related Post

మరోసారి భారత్ ఊచకోతమరోసారి భారత్ ఊచకోత

న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో టీమిండియా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి అదరగొట్టింది. రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ సింగ్ స్టేడియం వేదికగా జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

“Meesaala Pilla” Rules the Charts: 36 Million Views and Still Trending!“Meesaala Pilla” Rules the Charts: 36 Million Views and Still Trending!

The musical wave created by “Meesaala Pilla” from #ManaShankaraVaraPrasadGaru shows no signs of slowing down! The unanimous chartbuster has become the audience’s favourite song of the season, continuing its dream

నాటి `ప్రాభ‌వం` కోల్పోతున్న బీఆర్ ఎస్‌.. రీజ‌నేంటి?నాటి `ప్రాభ‌వం` కోల్పోతున్న బీఆర్ ఎస్‌.. రీజ‌నేంటి?

భార‌త రాష్ట్ర‌స‌మితి(బీఆర్ఎస్‌).. ఈ పేరుకు పెద్ద ప్రాభ‌వమే ఉంది. ఒక్కొక్క‌పార్టీకి నాయ‌కుల పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తుంది. కానీ, బీఆర్ఎస్ కు మాత్రం నాయ‌కుడే కాదు.. పార్టీ పేరు కూడా అత్యంత కీల‌కం. ప్ర‌జ‌ల మ‌ధ్య‌.. ప్ర‌జ‌ల చేత గుర్తింపు పొందిన పార్టీగా