hyderabadupdates.com movies ‘ఛాంపియన్’ జోడికి సక్సెస్ చాలా అవసరం

‘ఛాంపియన్’ జోడికి సక్సెస్ చాలా అవసరం

డిసెంబర్ 25 విడుదల కాబోతున్న ఛాంపియన్ మీద ఇంతకు ముందు ఏమో కానీ ట్రైలర్ వచ్చాక అంచనాలు ఏర్పడ్డాయి. సాధారణ ప్రేక్షకులకు కాన్సెప్ట్ ఏంటో ఐడియా వచ్చింది. పీరియాడిక్ డ్రామా అయినప్పటికీ ఇంత గ్రాండ్ గా తెరకెక్కించారా అంటూ ఆశ్చర్యపోయినవాళ్ళే ఎక్కువ. ఎంత స్వప్న, వైజయంతి సంస్థల ప్రొడక్షన్ అయినప్పటికీ కేవలం ఒక్క సినిమా అనుభవమున్న హీరో రోషన్ మేక మీద ఇంత ఖర్చు పెట్టడం విశేషమే. అఖండ 2 వైఫల్యం తర్వాత బాక్సాఫీస్ వద్ద వ్యాక్యూమ్ ఏర్పడిన నేపథ్యంలో దాన్ని వాడుకుంటే ఛాంపియన్ కు ఓపెనింగ్స్ తో పాటు మంచి వసూళ్లు దక్కుతాయి.

ఇదంతా బాగానే ఉంది కానీ ఛాంపియన్ పబ్లిసిటీలో హీరోయిన్ అనస్వర రాజన్ కు తగినంత ప్రాధాన్యం దక్కిందని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. గిర గిర పాటలో వేసిన ఒక స్టెప్ తో వైరల్ అయిపోయింది. ప్రమోషన్స్ లోనూ రోషన్ ను డామినేట్ చేస్తుంది అంటే అతిశయోక్తి కాదు.

మలయాళం నుంచి వచ్చిన ఆమె మనకు కొత్త కానీ మల్లువుడ్ లో చాలా సినిమాలే చేసింది. ఓటిటి కంటెంట్ రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్ళకు సూపర్ శరణ్యలో తన పెర్ఫార్మన్స్ గుర్తుండే ఉంటుంది. ఇదే కాదు చాలా హిట్స్ తన ఖాతాలో ఉన్నాయి. ఐఫా, ఫిలిం ఫేర్ లాంటి పురస్కారాలు వరించాయి. అనస్వర రాజన్ కమిట్ మెంట్ ఏ స్థాయిలో ఉందంటే తెలుగు నేర్చుకుని మరీ డబ్బింగ్ చెప్పుకుంది. ఈ విషయం మొన్న ఈవెంట్ లో రామ్ చరణ్ స్వయంగా చెప్పాడు.

ఇప్పుడు కనక ఛాంపియన్ బ్రేక్ ఇస్తే అనస్వర రాజన్ కు తెలుగులో మంచి వెల్కమ్ దక్కుతుంది. పెళ్లి సందడి తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రోషన్ మేకకు ఇది హిట్ కావడం చాలా అవసరం. లక్కీగా అనస్వర రాజన్ లాంటి నటించే అమ్మాయి దొరకడం ఒక రకంగా లక్ అని చెప్పాలి. పెళ్లి సందడితో పరిచయమైన శ్రీలీల ఎంత బిజీ ఆర్టిస్ట్ అయ్యిందో చూస్తున్నాం. ఇప్పుడీ అనస్వరకు అలాంటి బ్రేక్ దొరుకుతుందేమో చూడాలి. స్వాతంత్రం రాక ముందు, వచ్చిన తర్వాత తెలంగాణలోని భైరాన్ పల్లి అనే గ్రామంలో నిజ జీవిత సంఘటనలను ఆధారంగా చేసుకుని దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఈ ఛాంపియన్ తెరకెక్కించారు.

Related Post

82 వేల కోట్లు పెట్టబోతున్న భారీ కంపెనీ.. సస్పెన్స్ కు తెరతీసిన లోకేష్82 వేల కోట్లు పెట్టబోతున్న భారీ కంపెనీ.. సస్పెన్స్ కు తెరతీసిన లోకేష్

రేపు ఉదయం భారీ ప్రకటన అంటూ నిన్న ట్వీట్ చేసి సస్పెన్స్ క్రియేట్ చేసిన లోకేష్.. దానిని రివీల్ చేశారు. అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆ కంపెనీ పేరును ప్రకటించారు. 2019లో కొత్త ప్రాజెక్టులను నిలిపివేసిన ఆ కంపెనీ… రేపు

టాలీవుడ్ స్టార్లు నిజంగా గోల్డుటాలీవుడ్ స్టార్లు నిజంగా గోల్డు

బయట చాలా మంది జనాల్లో ఒక అపోహ ఉంది. స్టార్ హీరోలు పదులు, వందల కోట్ల రెమ్యునరేషన్లతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారని, డబ్బే ప్రపంచంగా ఉంటారని, దాన్ని వసూలు చేసుకోవడం కోసం నిర్మాతను పీడిస్తారనే అభిప్రాయం చాలాసార్లు సోషల్ మీడియాలో చూశాం.