hyderabadupdates.com movies ఒకే పడవలో రవితేజ – శర్వానంద్

ఒకే పడవలో రవితేజ – శర్వానంద్

సంక్రాంతి సినిమాల్లో కొన్ని సారూప్యతలు ఆసక్తికరంగా ఉన్నాయి. అన్నీ ఎంటర్ టైన్మెంట్ జానర్ అయినా రెండు మాత్రం ఒక కామన్ పాయింట్ పంచుకుంటున్నాయి. అవి భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారి నారి నడుమ మురారి. రవితేజ, శర్వానంద్ ఇద్దరు హీరోయిన్ల మధ్య నలిగిపోయే పాత్రలు చేస్తున్నారు. రాజా సాబ్ లో కూడా ముగ్గురు ఉన్నారు దాని జానర్ పూర్తిగా వేరే. హారర్ ప్లస్ కామెడీతో వేరే లెవెల్ గ్రాండియర్ ఉంటుంది. మన శంకరవరప్రసాద్ లో నయనతార మాత్రమే మెయిన్ లీడ్. క్యాథరిన్ త్రెస్సా కేవలం సపోర్టింగ్ రోల్. అనగనగా ఒక రాజు, జననాయకుడు, పరాశక్తి అన్నీ సింగల్ హీరోయిన్ బొమ్మలే. సో పోలిక రాదు.

భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారి నారి నడుమ మురారిలో వినోదం మొత్తం హీరోలు ప్రేమించిన, కట్టుకున్న వాళ్ళతో పడే ఇబ్బందుల మీదే నడుస్తోంది. మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు లాంటివి లేకుండా హ్యాపీగా నవ్వుకునేలా దర్శకులు డిజైన్ చేసుకున్నారు. పండగ సీజన్ కాబట్టి ఇలాంటివి వర్కౌట్ అవుతాయనే నమ్మకంతో హెవీ కాంపిటీషన్ లో బరిలో దిగుతున్నారు. ఒకవేళ శర్వా కనక బైకర్ ని తీసుకొచ్చి ఉంటే హైప్ ఇలా ఉండేది కాదు. అలాంటి రేసింగ్ డ్రామాలు ఈ సీజన్ కు కరెక్ట్ కాదు. సో నారి నారి రైట్ ఛాయసే. ఇక రవితేజ కూడా తన రెగ్యులర్ మాస్ వదిలేసి దారి మార్చుకోవడం మంచి ఫలితమే ఇచ్చేలా ఉంది.

బడ్జెట్ పరంగా కూడా రెండూ డీసెంట్ ఖర్చుతోనే తెరకెక్కాయి. టాక్ ఓ మోస్తరుగా బాగుందని వస్తే చాలు ఈజీగా రికవర్ అయిపోతాయి. మిగిలిన వాటితో పోలిస్తే బ్రేక్ ఈవెన్ కష్టమయ్యే ఛాన్స్ లేదు. వీటితో పాటు అనగనగా ఒక రాజుకు మాత్రమే ఫాస్ట్ ఛాన్స్ ఉంది. ప్రభాస్, చిరంజీవి సినిమాలకు అదిరిపోయే టాక్ వస్తేనే బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాలు అందుకుంటాయి. మొత్తానికి పోటీ అయితే రసవత్తరంగా ఉంది. ఎంత వద్దన్నా పోలికలు వస్తాయి బట్టి హాస్యాన్ని ఎవరు ఎక్కువ పండిస్తారనే దాన్ని బట్టి భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారి నారి నడుమ మురారిలో విజేత ఎవరో డిసైడ్ అవుతుంది. చూడాలి పైచేయి ఎవరిదో.

Related Post

సిట్ దూకుడు.. జగన్ బాబాయికి నోటీసులు!సిట్ దూకుడు.. జగన్ బాబాయికి నోటీసులు!

తిరుపతి కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు పెంచింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ బాబాయ్ వై.వి.సుబ్బారెడ్డికి ఈరోజు నోటీసులు ఇచ్చింది. ఈనెల 13వ తేదీ విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీచేసింది. వైసీపీ హయాంలో తిరుమల లడ్డు కల్తీ నిజమని