hyderabadupdates.com movies చిరు-ఓదెల ముహూర్తం కుదిరింది కానీ…

చిరు-ఓదెల ముహూర్తం కుదిరింది కానీ…

మెగాస్టార్ చిరంజీవి లైనప్‌లో అభిమానులకు అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న చిత్రం.. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఆయన నటించబోయేదే. మన శంకర వరప్రసాద్, విశ్వంభర చిత్రాలను మించి దాని మీద అంచనాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ‘దసరా’తో సెన్సేషన్ క్రియేట్ చేసి, ‘ది ప్యారడైజ్’తో మరోసారి బాక్సాఫీస్ షేక్ చేసేలా కనిపిస్తున్న శ్రీకాంత్ దర్శకత్వంలో చిరు నటిస్తే ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది.

శ్రీకాంత్‌ను వెలుగులోకి తెచ్చిన నాని.. చిరుతో అతడి సినిమాను సెట్ చేయడమే కాక, స్వయంగా నిర్మించడానికి ముందుకు రావడంతో ఈ ప్రాజెక్టుకు మరింత క్రేజ్ వచ్చింది. ఈ సినిమా గురించి తాజాగా నిర్మాత సుధాకర్ చెరుకూరి అప్‌డేట్ ఇచ్చారు. నాని, శ్రీకాంత్ కలయికలో వరుసగా రెండో చిత్రాన్ని నిర్మిస్తున్న సుధాకర్.. చిరు సినిమాను కూడా నానితో కలిసి ప్రొడ్యూస్ చేయబోతున్నాడు.

చిరు, శ్రీకాంత్ సినిమా వచ్చే ఏడాది మధ్యలో సెట్స్ మీదికి వెళ్తుందని సుధాకర్ చెరుకూరి వెల్లడించారు. శ్రీకాంత్ ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ సినిమాలో బిజీగా ఉంటూనే.. చిరు సినిమా స్క్రిప్టు వర్క్ చేస్తున్నట్లు సుధాకర్ తెలిపారు. ‘ది ప్యారడైజ్’ నుంచి పూర్తిగా ఫ్రీ అయ్యాక చిరు సినిమా మీద మరింత ఫోకస్ పెడతాడని.. తర్వాత 2026 జులైలో షూట్ మొదలు కావచ్చని ఆయన సంకేతాలు ఇచ్చారు.

ఐతే మరోవైపు బాబీ సినిమా కూడా సరిగ్గా అదే సమయానికి మొదలు పెడతారన్నది ఇండస్టీ టాక్. వర ప్రసాద్ గారు రిలీజ్ అయిన వెంటనే బాబీ తో మొదలు పెడతారా లేక రెండు ఒకేసారి మొదలుపెడతారా అన్నది తెలియాలంటే మరికొన్ని ఆగాల్సిందే.

Related Post

స్టేట్మెంట్ విషయంలో మాత్రం తగ్గేదేలే అంటున్న శివాజీస్టేట్మెంట్ విషయంలో మాత్రం తగ్గేదేలే అంటున్న శివాజీ

దండోరా సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. మహిళల వస్త్రధారణ గురించి సూచనలిచ్చే క్రమంలో ఆయన కొంచెం హద్దులు దాటిపోయారు. దానిపై తీవ్ర

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో గంట గ్యాప్‌… చంద్ర‌బాబు ఏం చేశారంటే!ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో గంట గ్యాప్‌… చంద్ర‌బాబు ఏం చేశారంటే!

సీఎం చంద్ర‌బాబు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేల‌తో మ‌రోసారి టెలీకాన్ఫ‌రెన్సు నిర్వ‌హించారు. ప్ర‌స్తుతం ఢిల్లీ ప‌ర్య ట‌న‌లో ఉన్న చంద్ర‌బాబు.. ఈ ప‌ర్య‌ట‌న‌లో దొరికిన ఓ గంట గ్యాప్‌ను కూడా వ‌దులు కోకుండా.. రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాలు.. అభివృద్ధిపై స్పందించారు. స‌హ‌జంగా నిరంత‌రం

The Godfather actor Robert Duvall passes away at 95The Godfather actor Robert Duvall passes away at 95

“He was brilliant without flamboyance. Powerful without theatrics,” expressed a heartbroken Kher, calling him a masterclass. According to the National Film Award-winner, actors like Robert don’t just perform, they become