hyderabadupdates.com movies జనార్ధన… రౌడీ కాదు రాక్షసుడుని మించి

జనార్ధన… రౌడీ కాదు రాక్షసుడుని మించి

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఈసారి రౌడీ జనార్ధనగా రాబోతున్నాడు. రాజావారు రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వం వహించిన ఈ వయొలెంట్ డ్రామాని ఎస్విసి బ్యానర్ మీద దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 2026 డిసెంబర్ లో విడుదల కాబోతున్న ఈ ప్యాన్ ఇండియా మూవీ టీజర్ ఇవాళ అభిమానుల భారీ కోలాహలం మధ్య హైదరాబాద్ లో లాంచ్ చేశారు. ఏడాదికి ముందే ఇలా ప్లానింగ్ చేయడం చూస్తే ప్రమోషన్ పరంగా పెద్ద స్కెచ్చే కనిపిస్తోంది. రెండు నిమిషాల వీడియోలో క్యారెక్టర్ ని పరిచయం చేసిన దర్శకుడు ఎక్కువ విజువల్స్ రివీల్ చేయలేదు. షూటింగ్ ఇంకా కీలక దశకు చేరుకోవాల్సి ఉంది.

అనగనగా కళింగపట్నం అనే ఊరు. మొత్తం రౌడీలతో రాక్షస రాజ్యం ఏలుతూ ఉంటుంది. అయితే వీళ్ళెవరూ రౌడీలు కాదని ఇంటి పేరునే అలా మార్చుకున్న జనార్ధన (విజయ్ దేవరకొండ) అనే యువకుడు ఊచకోత అంటే ఏమిటో రక్తం సాక్షిగా అందరికీ పరిచయం చేస్తాడు. అడ్డొచ్చిన వాళ్ళను తెగ నరికేందుకు వెనుకాడని అతని మనస్తత్వం వెనుక ఎవరికీ తెలియని ఒక చేదు బాల్యం ఉంటుంది. పసితనంలో తను చూసిన చీకటి నుంచి పుట్టిన ఉక్రోషమే రాక్షసుడిగా మారుస్తుంది. అసలు రౌడీ జనార్ధన అంటే ఎవరు, ఎందుకు ఇలాంటి విధ్వంసానికి పాల్పడ్డాడనేది తెలియాలంటే ఇంకో సంవత్సరం దాకా ఎదురు చూడాలి.

విజువల్స్ చాలా ఇంటెన్స్ గా ఉన్నాయి. క్రిస్టో క్సేవియర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంటెంట్ లో ఉన్న మూడ్ ని ప్రతిబింబించేలా ఉంది. హీరోయిన్ కీర్తి సురేష్ తో సహా ఎవరినీ రివీల్ చేయలేదు. కింగ్డమ్ తో విఫలమైనా మరోసారి అదే జానర్ తో తిరిగి హిట్టు కొట్టేందుకు విజయ్ దేవరకొండ బాగానే కష్టపడుతున్నాడు. దేహాన్ని మలుచుకున్న విధానం అదే సూచిస్తోంది. కొనతిరిగిన మీసకట్టు, విభిన్నంగా అనిపిస్తున్న స్లాంగ్ మొత్తానికి అభిమానులు కోరుకున్నట్టే ఉన్నాడు. అయితే సభ్యతగా అనిపించని ల….కొడుకు అనే పదం ఇందులో కూడా వాడేశారు. దీనికి సోషల్ మీడియా నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.

Related Post

Demon Slayer’s Success Will Teach Hollywood the Wrong Lesson
Demon Slayer’s Success Will Teach Hollywood the Wrong Lesson

When Demon Slayer: Infinity Castle shattered expectations at the global box office, surpassing even major superhero blockbusters like Superman, the news spread quickly across the entertainment industry. For anime fans,