ఔను! మీరు చదివింది నిజమే. వంటింటి నిత్యావసరమైన వాటిలో కీలకమైంది.. అదేసమయంలో ఎడం చేత్తో తీసి పారేసేది.. కరివేపాకు. ఒకప్పుడు.. వంట చేసే సమయంలో కరివేపాకు అవసరమైతే.. మన పక్కింటి పెరట్లోనో.. పొరుగింటి ఆంటీ దగ్గరో తెచ్చుకునే ఉంటాం. ఇప్పుడు కూడా రైతు బజారుకు వెళ్లినా.. కూరగాలయ మార్కెట్‌కు వెళ్లినా.. కరివేపాకు కొసరు దూసుకొచ్చి కూరల సంచీలో పడాల్సిందే!
వాస్తవానికి కరివేపాకుకు కూరల్లో ప్రాధాన్యం ఉన్నా.. అది వండే వరకే.. తర్వాత తీసేస్తాం. పైగా.. దీని గురించి ప్రత్యేకంగా ఆలోచన కూడా చేయం. `కూరలో కరివేపాకు` అనే సామెత కూడా తరచుగా వింటూనే ఉంటాం. అయితే.. తాజాగా.. దేశంలో ఇటీవల కాలంలో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన ఆన్‌లైన్ షాపింగ్‌లో టీవీలు, చీరలు, మొబైల్ ఫోన్లు.. బంగారంవంటి వస్తువులను ప్రజలు విరివిగా కొనుగోలు చేస్తున్నారని అందరూ అనుకుంటారు.
కానీ.. తాజాగా `ఇన్‌స్టామార్ట్ క్విక్ కామర్స్` సంస్థ విడుదల చేసిన ఈ ఏడాది ఆన్‌లైన్ షాపింగ్ రివ్యూ.. సర్వేలో కరివేపాకుకు పెద్దపీట పడింది. ఏముందిలే తీసిపారేసేదే కదా.. అని భావించే కరివేపాకు కోసం.. ఆన్‌లైన్‌లో ఎక్కువ మంది ఆర్డర్లు పెట్టారని.. ఇదే మెజారిటీ స్థానంలో నిలిచిందని సర్వే తెలిపింది. హైదరాబాద్‌కు చెందిన ఒకే వ్యక్తి.. ఆరు మాసాల్లో 368 సార్లు కరివేపాకును ఆన్‌లైన్‌లో కొనుగోలుచేసి.. అత్యంత రికార్డు సృష్టించారని తెలిపింది.
ఇక, కండోమ్‌లది కూడా..
+ ఈ పరంపరలో కండోమ్‌లది రెండోస్థానంగా ఉందని సర్వే తెలిపింది. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి ఏడాది కాలంలో 1.2 లక్షల రూపాయల విలువైన కండోమ్‌లను ఆన్‌లైన్ లో కొనుగోలు చేశారట.
+ హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఐఫోన్ లేటెస్ట్ మోడల్స్ కోసం 4.3 లక్షలు చెల్లించాడు.
+ ముంబైకి చెందిన ఓ వ్యక్తి 15 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని ఆన్‌లైన్‌లో కొన్నాడు.