hyderabadupdates.com movies తెలుగు డబ్బింగ్ చేయకపోవడమే మంచిది

తెలుగు డబ్బింగ్ చేయకపోవడమే మంచిది

పుష్ప 2, యానిమల్ ని టార్గెట్ చేస్తూ వెయ్యి కోట్ల వైపు పరుగులు పెడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ దురంధర్ తెలుగు డబ్బింగ్ కోసం ఇక్కడి అభిమానులు గట్టిగానే ఎదురు చూస్తున్నారు. ముందు డిసెంబర్ 19 అన్నారు. తర్వాత ఇంకో వారం లేట్ అన్నారు. కానీ ఎలాంటి సూచనలు కనిపించలేదు.

తాజాగా తెలుస్తున్న సమాచారం మేరకు దురంధర్ ఇతర బాషల అనువాదాలు థియేటర్ రిలీజ్ చేయడం లేదు. దీనికి కారణాలున్నాయి. మొదటిది ఒరిజినల్ వెర్షన్ ఇప్పటికే ఏపీ తెలంగాణాలో లక్షల సంఖ్యలో ప్రేక్షకులు చూశారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఖర్చు పెట్టుకుని డబ్ చేయించడం ద్వారా ఏదో అద్భుతం జరగడం అనుమానమే.

పైగా సినిమాలో తొంభై శాతం పాకిస్థాన్ లోనే జరుగుతుంది. అక్కడ పాత్రలు తెలుగులో మాట్లాడితే నేచురాలిటీ దెబ్బ తింటుంది. దీని వల్ల దర్శకుడి ఉద్దేశం ఆడియన్స్ కి చేరకపోయే ప్రమాదముంది. అందుకే డ్రాప్ అయ్యారని సమాచారం.

జనవరి 30 నెట్ ఫ్లిక్స్ లో దురంధర్ స్ట్రీమింగ్ కానుందని ముంబై రిపోర్ట్. అప్పుడు మాత్రం అన్ని భాషల్లో అందుబాటులో ఉంచుతారట. అగ్రిమెంట్ టైంలో ఎన్ని లాంగ్వేజెస్ లో ఉండాలనేది రాసుకుంటారు. దానికి అనుగుణంగానే అనువాదం పనులు కూడా నిర్మాతలే చేస్తారు. కాకపోతే వాటిని థియేటర్ రిలీజ్ చేయాలా వద్దానేది మార్కెట్ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది.

ఇంకో లాంగ్ వీకెండ్ టార్గెట్ చేసుకున్న దురంధర్ ఇప్పట్లో నెమ్మదించేలా లేదు. జనవరి 1 నుంచి కూడా ఇదే ప్రభంజనం ఉంటుందని నార్త్ ట్రేడ్ అంచనా వేస్తోంది. కొత్త రిలీజ్ తు మేరీ మై తేరా మై తేరి తు మేరాని జనాలు పెద్దగా పట్టించుకోకపోవడమే దానికి సాక్ష్యం.

అల్లు అర్జున్ రికార్డును దాటేసే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. రణ్వీర్ సింగ్, దర్శకుడు ఆదిత్య ధార్, ఆర్టిస్ట్ అక్షయ్ ఖన్నా డిమాండ్ ఇప్పుడు మాములుగా లేదు. దురంధర్ 2 బిజినెస్ ఆఫర్లు కూడా క్రేజీగా ఉన్నాయి. షారుఖ్, సల్మాన్ ని మించిపోయేలా డీల్స్ జరగొచ్చని ప్రాధమిక అంచనా. అది నిజమైనా ఎంత మాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు.

Related Post

అవతార్ నిప్పులను తక్కువంచనా వేయొద్దుఅవతార్ నిప్పులను తక్కువంచనా వేయొద్దు

ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన సినిమాల లిస్టు తీస్తే ఖచ్చితంగా టాప్ త్రీలో ఉండే మూవీ అవతార్. మూడో భాగం డిసెంబర్ 19 పెద్ద ఎత్తున ఇండియాలోనూ విడుదల కానుంది. బుక్ మై షోలో 1.2 మిలియన్ల ఇంట్రెస్టులు నమోదు చేయడం

షారుఖ్‌తో డ్యాన్స్ చేయడానికి పెళ్లికూతురు నోషారుఖ్‌తో డ్యాన్స్ చేయడానికి పెళ్లికూతురు నో

బాలీవుడ్ ఇండియాలో బిగ్గెస్ట్ ఫిలిం ఇండస్ట్రీ. ఇప్పుడంటే సౌత్ సినిమాల ముందు నిలవలేక హిందీ చిత్రాలు వెనుకబడుతున్నాయి కానీ.. దశాబ్దాల పాటు ఇండియన్ సినిమాలో వారిదే ఆధిపత్యం. మిగతా ప్రపంచానికి ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్డే. అక్కడి స్టార్లు ఎప్పుడో అంతర్జాతీయ స్థాయిలో పాపులారిటీ

శ్రీవారికి అప్రతిష్ట తెచ్చే పనులు చేయను… ఎవరినీ చేయనివ్వను: సీఎంశ్రీవారికి అప్రతిష్ట తెచ్చే పనులు చేయను… ఎవరినీ చేయనివ్వను: సీఎం

శ్రీవెంకటేశ్వరస్వామి పాదాల చెంత పుట్టిపెరిగా.. స్వామివారికి అప్రతిష్ట తెచ్చే ఏ పని నేను చేయను.. ఎవరినీ చేయనివ్వను.. అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధానిలోని వెంకటపాలెంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రెండు