hyderabadupdates.com movies అమెరికా వీసా లాటరీపై బాంబు వేసిన ట్రంప్ సర్కార్

అమెరికా వీసా లాటరీపై బాంబు వేసిన ట్రంప్ సర్కార్

అమెరికా వెళ్లాలనుకునే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ఇది నిజంగా పెద్ద షాకింగ్ న్యూస్. దశాబ్దాలుగా కొనసాగుతున్న హెచ్ 1బి వీసా ‘లాటరీ విధానానికి’ ట్రంప్ ప్రభుత్వం మంగళం పాడింది. ఇకపై అదృష్టం ఉంటే వీసా వస్తుంది అనుకోవడం కుదరదు. దీని స్థానంలో అత్యధిక నైపుణ్యం, ఎక్కువ జీతం ఉన్నవారికే రెడ్ కార్పెట్ పరిచే కొత్త విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది.

ఇన్నాళ్లు ఉన్న లాటరీ సిస్టమ్ వల్ల తక్కువ జీతానికి పని చేసే విదేశీయులను కంపెనీలు రప్పించుకుంటున్నాయని, దీనివల్ల అమెరికన్ల ఉద్యోగాలు పోతున్నాయని ప్రభుత్వం సీరియస్ గా ఉంది. అందుకే ఈ పాత పద్ధతిని రద్దు చేసి, కేవలం ‘హై పెయిడ్’, ‘హై స్కిల్డ్’ వర్కర్లకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. అమెరికన్ వర్కర్ల వేతనాలు, పని పరిస్థితులను కాపాడటమే దీని ప్రధాన ఉద్దేశమని అధికారులు క్లారిటీ ఇచ్చారు.

ఇది మాత్రమే కాదు, వీసా సంపాదించడం అనేది ఇకపై చాలా ఖరీదైన వ్యవహారం కాబోతోంది. కొత్త హెచ్ 1బి అప్లికేషన్లకు ఏటా ఏకంగా 100,000 డాలర్ల ఫీజు కట్టాలన్న ట్రంప్ నిర్ణయాన్ని ఫెడరల్ జడ్జి కూడా సమర్థించారు. ఇది అమెజాన్, టీసీఎస్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి కంపెనీల నియామకాలపై భారీ ప్రభావం చూపనుంది.

ఈ కొత్త విధానం వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 నుంచి అమల్లోకి రానుంది. అంటే రాబోయే సీజన్ నుంచి ఈ రూల్స్ వర్తిస్తాయి. ఇకపై వీసా రావాలంటే ‘వెయిటెడ్ సెలెక్షన్ ప్రాసెస్’ ఉంటుంది. అంటే మీ జీతం ఎంత ఎక్కువ ఉంటే, వీసా వచ్చే ఛాన్స్ అంత ఎక్కువ అన్నమాట.

మొత్తానికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వీసా విధానాన్ని పూర్తిగా మార్చేస్తోంది. ఒకపక్క 1 మిలియన్ డాలర్లతో ‘గోల్డ్ కార్డ్’ ఇస్తూ సంపన్నులకు పౌరసత్వానికి దారి చూపిస్తోంది. మరోపక్క సాధారణ ఉద్యోగులకు లాటరీని రద్దు చేసి కఠిన ఆంక్షలు పెడుతోంది. అమెరికా కల సాకారం చేసుకోవాలంటే ఇకపై టాలెంట్ తో పాటు ఆఫర్ లెటర్ లో భారీ ప్యాకేజీ ఉండాల్సిందే.

Related Post

Manchu Lakshmi’s Daksha OTT Release: When and where to watch the crime thriller film onlineManchu Lakshmi’s Daksha OTT Release: When and where to watch the crime thriller film online

Daksha was jointly produced by Srilakshmi Prasanna Pictures and Manchu Entertainment, with Mohan Babu making a special appearance. The cast also includes Samuthirakani, Rangasthalam Mahesh, Viswanth Duddumpudi, and Malayalam actor

People who do piracy must be encountered: Kalyan C at Telugu Film Chamber press meetPeople who do piracy must be encountered: Kalyan C at Telugu Film Chamber press meet

Cinephiles and Tollywood breathed a huge sigh of relief after Cyberabad Police arrested Immadi Ravi, the mastermind behind the notorious film piracy portal iBomma, a couple of days ago. The

2.5 కోట్ల రూపాయ‌లు-భూమి-ఉద్యోగం: శ్రీచ‌రణికి ఏపీ కానుక‌!2.5 కోట్ల రూపాయ‌లు-భూమి-ఉద్యోగం: శ్రీచ‌రణికి ఏపీ కానుక‌!

భార‌త మ‌హిళా క్రికెట‌ర్ శ్రీచ‌ర‌ణికి సీఎం చంద్ర‌బాబు భారీ కానుక ప్ర‌క‌టించారు. ఇటీవ‌ల జ‌రిగిన ఉమెన్ వ‌ర‌ల్డ్ క‌ప్‌ను సొంతం చేసుకున్న టీంలో ఏపీకి చెందిన శ్రీచ‌రణి కూడా ఉన్నారు. ఆమె క‌డ‌ప జిల్లాకు చెం దిన వ‌ర్ధ‌మాన క్రికెట‌ర్‌. ప్ర‌పంచ