hyderabadupdates.com movies ప్యారడైజ్‌ లో డ్రాగన్ భామ కన్ఫర్మ్

ప్యారడైజ్‌ లో డ్రాగన్ భామ కన్ఫర్మ్

నేచురల్ స్టార్ నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ చిత్రీకరణ వేగంగానే జరుగుతుందని తెలుస్తోంది. అనుకున్న ప్రకారమే మార్చి 26న తమ చిత్రాన్ని విడుదల చేయడానికి చూస్తోంది చిత్ర బృందం. ఐతే ఇప్పటిదాకా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. విలన్ పాత్ర చేస్తున్న మోహన్ బాబు గురించి అధికారిక ప్రకటన చేశారు. ఆయన ఫస్ట్ లుక్ కూడా లాంచ్ చేశారు.

ఇటీవలే సంపూర్ణేష్ బాబు చేస్తున్న బిరియాని పాత్రకు సంబంధించిన లుక్ కూడా లాంచ్ చేశారు. కానీ హీరోయిన్ గురించి మాత్రం ఏ ప్రకటనా లేదు. ఇందులో ‘డ్రాగన్’ భామ కాయదు లోహర్ కథానాయికగా నటించబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అది నిజమా కాదా అన్న స్పష్టత లేదు. కానీ కాయుదు తాజాగా ఒక సోషల్ మీడియా పోస్టుతో ఈ విషయాన్ని చెప్పకనే చెప్పింది.

‘ది ప్యారడైజ్’ గ్లింప్స్‌ను తన ఇన్‌స్టా పేజీలో షేర్ చేసిన కాయదు.. లవ్ ఎమోజీలు పెట్టింది. సడెన్‌గా ఈ వీడియో పెట్టడాన్ని బట్టి ఆమె ఈ చిత్రంలో నటిస్తోందని స్పష్టమైంది. కాయదు ఇటీవలే ‘ది ప్యారడైజ్’ సెట్స్‌లోకి అడుగు పెట్టిందని.. ఆమె మీద కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించారని సమాచారం. త్వరలోనే ఆమె ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేస్తారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఇన్‌స్టాలో ఆ సినిమా గ్లింప్స్‌ను షేర్ చేసినట్లు కనిపిస్తోంది.

ఈ చిత్రంలో అన్ని పాత్రల లుక్స్ రా అండ్ రస్టిగ్గా ఉన్నాయి. మరి అల్ట్రా గ్లామరస్‌గా కనిపించే కాయదుతో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఎలాంటి పాత్ర చేయిస్తున్నాడో.. తన లుక్ ఎలా ఉంటుందో అన్నది ఆసక్తికరం. కచ్చితంగా ఏదో ఒక సర్ప్రైజ్ ఉంటుందనే అంచనా వేస్తున్నారు నెటిజన్లు. నాని, శ్రీకాంత్ కాంబినేషన్లో ‘దసరా’ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసిన సుధాకర్ చెరుకూరినే ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Related Post

అలా చేస్తే కాంగ్రెస్ పార్టీకి కూడా మద్దతిస్తాం: ఆర్ఎస్ఎస్అలా చేస్తే కాంగ్రెస్ పార్టీకి కూడా మద్దతిస్తాం: ఆర్ఎస్ఎస్

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)…బీజేపీ హ్యాట్రిక్ విజయాల వెనుక ఉన్న శక్తి. చాలామంది బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వారే. ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లోనే బీజేపీ నడుస్తుందని, చాలా టికెట్లు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రికమండేషన్ పై

లెనిన్ కబుర్లు రావడం లేదేంటిలెనిన్ కబుర్లు రావడం లేదేంటి

అక్కినేని మూడో తరం వారసుడిగా నాగ చైతన్యని మించిపోతాడని అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకున్న అఖిల్ కెరీర్ మొదలుపెట్టి దశాబ్దం అవుతున్నాపెద్ద బ్లాక్ బస్టర్ సాధించనే లేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బాగానే ఆడింది కానీ మరీ రికార్డులు బద్దలు కొట్టే