జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజకీయాల్లో 2025 మేలి మలుపు సంవత్సరంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధానంగా 5 అంశాలు.. పవన్‌కు ఈ సంవత్సరం కలిసి వచ్చాయి. దీంతో ఇప్పటి వరకు.. పవన్‌ను ప్రజలు చూసిన కోణానికి భిన్నంగా ఆయన సామాన్యులకు చేరువ అయ్యారన్న చర్చ సాగుతోంది.
1)సనాతని: ఈ ఏడాది పవన్ కల్యాణ్ వ్యవహరించిన తీరు పూర్తి సనాతన వాదిగా ఆయన ప్రోజెక్టు అయ్యేలా చేసింది. అప్పటి వరకు పవన్ అంటే.. ఉన్న అభిప్రాయం పూర్తిగా తొలిగిపోయి.. ఆయనను పక్కా సనాతన వాదిగా ప్రజలు యాక్సప్ట్ చేసేలా చేసింది. తిరుమల లడ్డూ వ్యవహారం నుంచి తిరుపతిలో జరిగిన వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట వరకు..(భక్తులకు క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్) పవన్ హిందువులకు వెన్నుదన్నుగా నిలిచారు.
2)పేదల పక్షపాతి: పవన్ అంటే.. కేవలం ఎన్నికల ప్రచారానికి.. కూటమి ఏర్పాటుకు మాత్రమే వచ్చారన్న ప్రచారం జరిగింది. ఇది ఎన్నికలకు ముందు.. తర్వాత కూడా జరిగింది. కానీ.. దీని నుంచి పవన్ చాలా చాకచక్యంగా బయటపడ్డారు. పేదల పక్షపాతిగా.. ముఖ్యంగా ఎస్టీలు, ఎస్సీల విషయంలో ఆయన చూపిన ఆప్యాయత.. వంటివి ఈ ఏడాది పవన్‌ను పేదల పక్షపాతిగా నిలబెట్టాయి. ఇదేసమయంలో ఆయనను వారికి చాలా చేరువ కూడా చేశాయి.
3)అభివృద్ధికి కేరాఫ్‌గా: డిప్యూటీ సీఎంగా, పంచాయతీరాజ్, అటవీ శాఖ మంత్రిగా తన శాఖల విషయంలో పవన్ అభివృద్ధికి పెద్దపీట వేశారు. 1) అటవీ సంపదను పరిరక్షించడంతోపాటు.. చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించారు. 2) కుంకీ ఏనుగులు తీసుకువచ్చి రైతులు, గ్రామాలను కాపాడుతున్నారు. 3) గ్రామీణ ప్రాంతాల నిధులను గ్రామీణులకు అందిస్తూ.. అభివృద్ధి పనులను వేగవంతం చేశారు. 4) పంచాయతీలను బలోపేతం చేసేలా ఇటీవలే సంస్కరణలకు పెద్దపీట వేశారు.
4) కూటమి సఖ్యతకు పునాది: ఇక, రాజకీయంగా కూటమి కట్టడమే కాకుండా.. ఆ కూటమి పదికాలాలు పదిలంగా ఉండేలా కూడా.. పవన్ వ్యవహరిస్తున్నారు. మీరు ఎన్నయినా.. చెప్పండి. కూటమి మాత్రం 15 ఏళ్లు పదిలంగా ఉంటుందన్న సందేశాన్ని బలంగా పంపించారు. తద్వారా.. అందరూ కలివిడిగా ఉండాలన్న లక్ష్యాన్ని నిర్దేశించారు.
5) బలమైన గళం: ఇక, తన బలమైన గళంతో ప్రజలను ఆకట్టుకోవడంలోనూ పవన్ ఈ ఏడాది(2025) వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఎక్కడ అవసరమో అక్కడ బలంగా మాట్లాడారు. ఎక్కడ తగ్గాలో అక్కడ మౌనంగా ఉన్నారు. ఇది రాజకీయ వ్యూహమే కాదు.. కూటమిని పరిరక్షించుకునే క్రమంలో వేసిన ఎత్తుగడ. పైగా.. ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలను కూడా ఆయన గమనిస్తున్నారు. ఇలా.. ఈ ఐదు రీజన్లతో పవన్ ఈ ఏడాది మంచి నాయకుడిగా ఎదిగారన్నవిషయంలో సందేహం లేదు.