hyderabadupdates.com movies సాయిబాబాపై వివాదాస్పద వ్యాఖలు, బీజేపీ నేతపై కేసు

సాయిబాబాపై వివాదాస్పద వ్యాఖలు, బీజేపీ నేతపై కేసు

మతపరమైన అంశాలపై  వ్యాఖ్యలు మరోసారి వివాదానికి దారితీశాయి. ప్రజలు భక్తి ప్రపత్తులతో కొలుచుకునే వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత కేసులు ఎదుర్కోవడం తరచుగా జరుగుతోంది. తాజాగా  షిరిడీ సాయిబాబాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పులువురిపై కేసులు నమోదయ్యాయి.

నటి మాధవీ లతపై ఎఫ్ఐఆర్ చేశారు. పలువురు యూట్యూబర్లపై కూడా కేసులు ఫైల్అయ్యాయి. వీరంతా సరూర్ నగర్ లో విచారణలకు కావాలని ఆదేశించారు. మాధవీలత ఒక్కరిపైనే కాకుండా, ఆమె వ్యాఖ్యలకు మద్దతుగా ఇంటర్వ్యూలు నిర్వహించి వీడియోలను వైరల్ చేసిన కొందరు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై కూడా కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి మంగళవారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని అందరికీ నోటీసులు జారీ చేశారు.

హిందూ దేవుళ్లపై తరచూ ఇటువంటి వ్యాఖ్యలనే కొందరు చేస్తున్నారు. భావప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇతరుల మతపరమైన నమ్మకాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం చట్టపరంగా నేరమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇటువంటి చర్యలపై ఐటీ చట్టాలు, ఇతర సంబంధిత సెక్షన్ల కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కూడా. అయినా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వార్తల్లో నిలవడం పరిపాటిగా మారింది.

సమాజంలో గుర్తింపు ఉన్న వ్యక్తులు మాట్లాడేటప్పుడు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. సెలబ్రిటీలు లేదా సోషల్ మీడియాలో ఎక్కువ మంది అనుసరించే వ్యక్తులు చేసే వ్యాఖ్యలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఇవ్వకూడాదనేది పోలీసుల వాదన.

తెలుగమ్మాయి అయిన మాధవీలత  నచ్చావులే, స్నేహితుడా తదితర సినిమాల్లో హీరోయిన్‌గా చేసి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆ తర్వాత నటనను పూర్తిగా పక్కన పెట్టింది, బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తోన్న మాధవీలత ఇటీవల సోషల్ మీడియాలో షిరిడీ సాయిబాబాపై ఒక పోస్ట్ పెట్టింది ఇప్పుడు ఆ పోస్టులే నటిని ఇబ్బందుల్లోకి నెట్టాయి.

Related Post

ఇక్కడ ప్రతిపక్షం తరఫున నోరు విప్పే నాయకుడే లేరుఇక్కడ ప్రతిపక్షం తరఫున నోరు విప్పే నాయకుడే లేరు

రాజకీయాల్లో పోటీ లేకుండా ఎక్కడా ఉండదు. చిన్నచితకా పార్టీలైనా పోటీ ఇస్తుంటాయి. ఇక ప్రధాన పార్టీల మధ్య పోరు, పోటీ ఎలానూ ఉంటుంది. కానీ చిత్రంగా రాష్ట్రంలోని విజయవాడ, గుంటూరు పార్లమెంటు నియోజకవర్గాల్లో టిడిపికి పోటీ లేకుండాపోయింది. అంతేకాదు, ఈ రెండు

రాజ్య‌స‌భ ఎఫెక్ట్‌: 4 మాసాల ముందే క‌ర్చీఫ్‌లు వేసేశారా.. ?రాజ్య‌స‌భ ఎఫెక్ట్‌: 4 మాసాల ముందే క‌ర్చీఫ్‌లు వేసేశారా.. ?

రాష్ట్రంలో ఈ ఏడాది నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో మూడు వైసిపి అభ్యర్థులకు సంబంధించినవి ఉండడం విశేషం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్, ఉత్తరాది రాష్ట్రానికి చెందిన పరిమళ నత్వాని, అదేవిధంగా మంగళగిరి కి

భారత విద్యార్థులకు పీడకలగా మారుతోన్న మరో దేశంభారత విద్యార్థులకు పీడకలగా మారుతోన్న మరో దేశం

ఒకప్పుడు ఉన్నత విద్యకు, కెరీర్‌కు స్వర్గధామంగా కనిపించిన ఐర్లాండ్, ప్రస్తుతం భారతీయ విద్యార్థుల పాలిట పెను సవాలుగా మారింది. అమెరికా, యూకే వంటి దేశాల్లో వీసా నిబంధనలు కఠినతరం కావడంతో చాలామంది ఐర్లాండ్‌ను ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారు. గత ఏడాది భారతీయ విద్యార్థుల