hyderabadupdates.com movies ఏపీ ప్రభుత్వ సలహాదారుడిగా కార్టూనిస్ట్ శ్రీధర్

ఏపీ ప్రభుత్వ సలహాదారుడిగా కార్టూనిస్ట్ శ్రీధర్

ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ ఇరు తెలుగు రాష్ట్ర ప్రజలకు సుపరిచితులే. వ్యంగ్యమైన కార్టూన్లతో రాజకీయ నాయకులపై శ్రీధర్ వేసే సెటైర్లు ఎంతో పాపులర్. నాలుగు దశాబ్దాలపాటు ప్రింట్ మీడియా కార్టూనిస్ట్ లలో మకుటం లేని మహరాజులాగా ఓ వెలుగు వెలిగారు శ్రీధర్. అన్న ఎన్టీఆర్ మొదలు జగన్ వరకు…అంజయ్య నుంచి చంద్రబాబు వరకు…ఇందిరమ్మ నుంచి మోదీ వరకు…ఎంతోమంది రాజకీయ నాయకులపై తన మార్క్ కార్టూన్లు వేసిన ఘనత శ్రీధర్ కే దక్కింది. 42 ఏళ్లపాటు ఈనాడులో కార్టూనిస్ట్ గా సేవలందించిన శ్రీధర్ ప్రస్తుతం కార్టూనిస్ట్ గా రిటైర్ అయ్యారు. అయితేనేం, ఆయన అనుభవాన్ని ఈ తరానికి కూడా అందించాలన్న సదుద్దేశ్యంతో ఏపీ ప్రభుత్వం ఆయనను సలహాదారుగా నియమించింది.

ఏపీ ప్రభుత్వ మాస్ కమ్యూనికేషన్ సలహాదారుడిగా శ్రీధర్ ను రెండేళ్లపాటు నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సమాచార ప్రచార విభాగానికి సంబంధించిన కీలక బాధ్యతలను ఆయన చూసుకోబోతున్నట్లు తెలుస్తోంది. 1982లో టీడీపీ ఆవిర్భావం, ఆగస్టు సంక్షోభం వంటి కీలక రాజకీయ పరిణామాల నేపథ్యంలో శ్రీధర్ వేసిన కార్టూన్లు బాగా పేలాయి. కేవలం రాజకీయాలే కాదు సమకాలీన, సామాజిక, సందేశాత్మక, మానవతా కోణం ఉన్న కార్టూన్లు వేసిన శ్రీధర్ కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. దివంగత రామోజీ రావు మానన పుత్రిక అయిన ఈనాడు పత్రికలో తనకంటూ ఓ పేజీ రాసుకున్న శ్రీధర్ అంటే రామోజీరావుకు ఎనలేని అభిమానం.

అటువంటి శ్రీధర్ ను ఏపీ ప్రభుత్వం మాస్ కమ్యూనికేషన్ సలహాదారుడి నియమించడం సముచితమే. ఆ పదవికి ఆయన అన్ని విధాలా అర్హుడే. అయితే, ఈ సోషల్, డిజిటల్ మీడియా యుగంలో శ్రీధర్ వంటి వెటరన్ కార్టూనిస్ట్ ను ఆ పదవిలో ఏపీ ప్రభుత్వం నియమించడం, ఆ హోదా ఇవ్వడం అంత చిన్న విషయమేమీ కాదు. కానీ, శ్రీధర్ కు ఉన్న అపార అనుభవంతో ఈ పదవిని సమర్థవంతంగా నిర్వహిస్తారని ప్రభుత్వం భావిస్తోంది.

Related Post

బేబీ జంటను కలుపుతున్న వెరైటీ ‘ఎపిక్’బేబీ జంటను కలుపుతున్న వెరైటీ ‘ఎపిక్’

బేబీ క్లైమాక్స్ లో కలుసుకోలేక ప్రేమ విఫలమైన జంటగా మిగిలిపోయిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ఈసారి ఆ తప్పు చేయడం లేదు. హ్యాపీగా అమెరికాలో కలుసుకుని తమ కొత్త లవ్ స్టోరీని ప్రేమికులకు చూపించబోతున్నారు. 90స్ మిడిల్ క్లాస్ వెబ్