hyderabadupdates.com movies శ్రీవారి సన్నిధిలో రాజకీయలు ఎందుకు రోజా గారు

శ్రీవారి సన్నిధిలో రాజకీయలు ఎందుకు రోజా గారు

తిరుమల కొండపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. కుల, మత, రాజకీయ భేదాలు లేకుండా కోట్లాది మంది భక్తులు ఇక్కడ స్వామివారి దర్శనానికి వస్తుంటారు. సామాన్య భక్తులతో పాటు రాజకీయ, సినీ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు సైతం మొక్కులు చెల్లించుకుంటారు. రోజుకు వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చే ఈ పవిత్ర క్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడటం టీటీడీ ప్రధాన బాధ్యతగా భావిస్తోంది.

ఈ నేపథ్యంలో తిరుమలలో రాజకీయాలు, ద్వేషపూరిత వ్యాఖ్యలకు ఎలాంటి స్థానం లేదని టీటీడీ ట్రస్ట్ బోర్డు ఇప్పటికే స్పష్టంగా ప్రకటించింది. ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పలుమార్లు హెచ్చరికలు కూడా జారీ చేసింది. తిరుమల కొండపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నదే టీటీడీ స్పష్టమైన ఆదేశం ఉంది.

అయితే, ఇటువంటి ఆంక్షలు ఉన్నప్పటికీ శ్రీవారి సన్నిధిలో మాజీ మంత్రి ఆర్కే రోజా రాజకీయ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తిరుమలలో దర్శనం అనంతరం ఆమె మాట్లాడుతూ ‘జగనన్న మళ్లీ సీఎం కావాలి’ అని కోరుకున్నట్లు తెలిపారు. పవిత్ర క్షేత్రంలో రాజకీయ ఆకాంక్షలు వ్యక్తపరచడం సరైందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

వాస్తవానికి తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు చేయడం రోజాకు ఇదే మొదటిసారి కాదు. గతంలో వైసీపీ అధికారాన్ని కోల్పోయిన కొత్తలోనే, తిరుమల కొండపై నుంచే రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని ఆమె వ్యాఖ్యానించారు. అప్పట్లోనే ఆమె వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఘోర పరాజయం తర్వాత కూడా ఆమె తీరులో ఎలాంటి మార్పు లేదని, పవిత్ర స్థలాల గౌరవాన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారనే విమర్శలు మరోసారి వినిపిస్తున్నాయి.

Related Post

ఎవరెస్ట్ బరువు మోస్తున్న మారుతీ సాబ్ఎవరెస్ట్ బరువు మోస్తున్న మారుతీ సాబ్

ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది ఏ నిమిషంలో వచ్చినా బుక్ మై షో బ్లాస్ట్ అయ్యేలా ఉంది. మాములుగా ప్రభాస్ రేంజ్ ప్యాన్ ఇండియా హీరోకు

ఐబొమ్మ ర‌వికి మ‌రిన్ని క‌ష్టాలు!ఐబొమ్మ ర‌వికి మ‌రిన్ని క‌ష్టాలు!

సినిమా పైర‌సీల ద్వారా గుర్తింపు పొందిన ఐబొమ్మ ర‌వికి మ‌రిన్ని క‌ష్టాలు వెంటాడుతున్నాయి. ప్ర‌స్తుతం ఐదు కేసుల్లో ర‌వి నిందితుడిగా ఉన్న విష‌యం తెలిసిందే. పైర‌సీతో పాటు మ‌నీలాండ‌రింగ్ వంటి కీల‌క కేసుల్లో ఆయ‌న నిందితుడిగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో పోలీసులు

దురంధరా… అంత నిడివి భరిస్తారాదురంధరా… అంత నిడివి భరిస్తారా

మనం అఖండ 2 తాండవం హడావిడిలో పడిపోయాం కానీ బాలీవుడ్ నుంచి వస్తున్న దురంధర్ మీద కూడా చెప్పుకోదగ్గ అంచనాలే ఉన్నాయి. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాకు ఆదిత్య ధార్ దర్శకత్వం వహించారు. అయితే ఫైనల్