hyderabadupdates.com movies మోహన్ లాల్ కుటుంబంలో విషాదం

మోహన్ లాల్ కుటుంబంలో విషాదం

మోహన్ లాల్ తల్లి శాంతకుమారి అనారోగ్య సమస్యలతో మరణించారు. ఆమె వయసు 90 ఏళ్లు. శాంతకుమారి కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. కొంత కాలంగా ఆమె మంచానికే పరిమితం అయ్యారు. కోచిలోని ఎలమక్కరలో ఉన్న మోహన్ లాల్ ఇంటిలోనే శాంతకుమారి తుది శ్వాస విడిచారు. శాంతకుమారి సొంత ఊరు ఎలంతూర్ కాగా.. పెళ్లి తర్వాత భర్తతో కలిసి తిరువనంతపురంలో స్థిరపడ్డారు.

ఉన్నత విద్యావంతురాలైన ఆమె.. కేరళ ప్రభుత్వ న్యాయ కార్యదర్శిగా పని చేయడం విశేషం. అనారోగ్యం పాలయ్యాక తల్లిని మోహన్ లాల్ కోచిలో తన ఇంటికి తీసుకొచ్చారు. అక్కడే ఉంచి ఆమెను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. తల్లి మరణం నేపథ్యంలో తాను చిన్నపిల్లాడిగా ఉండగా ఆమెతో కలిసి తీయించుకున్న ఫొటోను సోషల్ మీడియాలో మోహన్ లాల్ పంచుకున్నారు.

‘అమ్మ’ అనే కామెంట్‌కు లవ్ ఎమోజీ జోడించి పోస్టు పెట్టారు.ఏ వయసులో అయినా సరే తల్లి మరణం ఓ వ్యక్తికి తీవ్ర భావోద్వేగానికి గురి చేసేదే. ఈ నేపథ్యంలో మోహన్ లాల్‌కు సామాజిక మాధ్యమాల్లో సానుభూతి సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. దేశం గర్వించదగ్గ నటుడిని అందించిన శాంతకుమారిని అందరూ కొనియాడుతున్నారు.

Related Post

సమయం ముంచుకొస్తోంది వరప్రసాద్ గారూసమయం ముంచుకొస్తోంది వరప్రసాద్ గారూ

మన శంకరవరప్రసాద్ గారు విడుదలకు ఇంకో 17 రోజులు మాత్రమే టైం ఉంది. మాములుగా అనిల్ రావిపూడి తనదైన స్టైల్ లో చేసే ప్రమోషన్లు కనిపించక మెగా ఫ్యాన్స్ వర్రీ అవుతున్నారు. అవుట్ డోర్ పబ్లిసిటీ, థియేటర్లకు కొత్త హోర్డింగులు పంపించడం

రాజా సాబ్ రాకలో ఆలస్యం లేదురాజా సాబ్ రాకలో ఆలస్యం లేదు

ఇంకో రెండు నెలలు మాత్రమే ఉన్న నేపథ్యంలో ది రాజా సాబ్ చెప్పిన డేట్ కి వస్తుందా రాదానే ప్రచారం సోషల్ మీడియాలో గట్టిగా తిరిగింది. కొన్ని హ్యాండిల్స్ ఏకంగా వాయిదా ప్రచారం చేయడంతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధికారిక ప్రకటన