hyderabadupdates.com movies మెగా విక్టరీ ‘సంగతి’ అదిరిపోయిందా

మెగా విక్టరీ ‘సంగతి’ అదిరిపోయిందా

నలభై సంవత్సరాలుగా కుదరని కాంబినేషన్ దర్శకుడు అనిల్ రావిపూడి సాధ్యం చేశారు. మన శంకరవరప్రసాద్ గారులో చిరంజీవి, వెంకటేష్ ని కలపడమే కాదు ఏకంగా పాట, ఫైట్లు పెట్టడంతో అంచనాలు ఎక్కడికో వెళ్లిపోతున్నాయి. గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్ బస్టర్ అందుకున్న వెంకీ ఈసారి మెగా మూవీలో స్పెషల్ క్యామియో చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రత్యేకంగా ఈ సాంగ్ మీద హైప్ ఎక్కువగా ఉండటానికి కారణం డాన్స్ బ్యాక్ డ్రాప్ తో పబ్ లో తీయడమే. భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన పాటకు మెగాస్టార్, విక్టరీ కలిసి నృత్యం చేస్తుంటే అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు.

హే వెంకీ ఇచ్చేయి ధమ్కీ, హే బాసు పెంచేయ్ బేసూ అంటూ చిరు, వెంకీ పరస్పరం పాడుకోవడం బాగుంది. అయితే ట్యూన్ మరీ ఎక్స్ ట్రాడినరిగా అనిపించదు కానీ చూస్తూ చూస్తూ విజువల్ గా ఆకట్టుకునేలా ఉండబోతోంది. కీలకమైన స్టెప్స్ ని అనిల్ రావిపూడి ఇందులో రివీల్ చేయలేదు.

కాసర్ల శ్యామ్ సాహిత్యం సమకూర్చగా విజయ్ పొలంకి కొరియోగ్రఫీ చేశారు. ఏడు పదుల వయసులో మెగాస్టార్, ఆరు పదుల ఈడులో విక్టరీ వెంకీ కలిసి డాన్స్ చెయ్యడం చూస్తుంటే రెండు కళ్ళు చాలలేదని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. నెక్స్ట్ వచ్చే ప్రమోషనల్ కంటెంట్ లో చిరు ఇంట్రో సాంగ్, థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు.

ఇంకో కోణంలో చూస్తే ఫ్యాన్స్ అంచనాలు ఈ పాట మీద ఇంకా ఎక్కువే ఉన్నాయి కాబట్టి మిశ్రమ స్పందన వచ్చే అవకాశాలు కొట్టి పారేయలేం. అధిక శాతం సినిమా ఇంటీరియర్ లో తీసిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే చాలా సర్ప్రైజులు అనిల్ రావిపూడి బిగ్ స్క్రీన్ కోసం దాచి పెట్టాడని యూనిట్ టాక్.

ట్రైలర్ వచ్చి క్లారిటీ ఇచ్చేదాకా ఇలాంటి అనుమానాలు మాములే. లాంచ్ ఈవెంట్ కోసం ఏపీలో ల్యాండ్ అయిన అనిల్ రావిపూడి విజయవాడలో మీడియాతో మాట్లాడి గుంటూరు విజ్ఞాన్ కాలేజీకి వెళ్ళిపోయాడు. ఏంటి సంగతి, ఆడేద్దాం సంక్రాంతి అంటూ బొబ్బిలి రాజా, కొండవీటి రాజా చేసే ఫుల్ అల్లరి ఏ స్థాయిలో ఉంటుందో జనవరి 12 తేలనుంది.

Related Post

ఫౌజీ దర్శనం ఎప్పుడు ఉంటుందిఫౌజీ దర్శనం ఎప్పుడు ఉంటుంది

రాజా సాబ్ ఫలితం వల్ల ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశ చెందిన మాట వాస్తవమే కానీ రాబోయే ప్రభాస్ సినిమాలు చాలా ప్రామిసింగ్ గా ఉన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోకూడదు. అధిక శాతం అభిమానుల దృష్టి స్పిరిట్ మీద ఉంది కానీ ఆల్రెడీ

Dekho Vishnu Vinyasam song from Sree Vishnu’s Vishnu Vinyasam is quirkyDekho Vishnu Vinyasam song from Sree Vishnu’s Vishnu Vinyasam is quirky

Sree Vishnu will be next seen in the fun-entertainer ‘Vishnu Vinyasam’. Debutant Maruthi Rao helmed this flick, whose first look motion poster was launched recently. The movie is locked for