hyderabadupdates.com movies హెల్మెట్‌పై పాలస్తీనా జెండా.. కశ్మీర్ క్రికెటర్‌పై కేసు నమోదు!

హెల్మెట్‌పై పాలస్తీనా జెండా.. కశ్మీర్ క్రికెటర్‌పై కేసు నమోదు!

జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఒక క్రికెట్ మ్యాచ్ ఇప్పుడు పెద్ద వివాదానికి దారి తీసింది. ఆటలో ఒక ప్లేయర్ హెల్మెట్ మీద పాలస్తీనా జెండా స్టిక్కర్ పెట్టుకొని బ్యాటింగ్ కు రావడం కలకలం రేపింది. జమ్మూ కాశ్మీర్ ఛాంపియన్స్ లీగ్ లో భాగంగా ‘జమ్మూ కాశ్మీర్ 11’ (JK11) – ‘జమ్మూ ట్రైల్ బ్లేజర్స్’ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ఫర్హాన్ భట్ అనే ఆ ఆటగాడు పాలస్తీనా జెండా ఉన్న హెల్మెట్ ధరించి ఆడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్ల నుంచి విమర్శలు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

ఇది శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందని భావించి, పోలీసులు వెంటనే ఆ క్రికెటర్ కు నోటీసులు జారీ చేశారు. సెక్షన్ 173(3) కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అసలు అతను ఆ జెండా ఎందుకు పెట్టుకున్నాడు? అతని వెనుక ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. 

కేవలం ఆ ప్లేయర్ నే కాకుండా, ఈ టోర్నమెంట్ నిర్వాహకుడు జాహిద్ భట్ ను కూడా పిలిపించి ప్రశ్నిస్తున్నారు. అసలు ఈ లీగ్ నిర్వహించడానికి సరైన అనుమతులు ఉన్నాయా లేదా అని కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఈ వివాదంపై జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ (JKCA) వెంటనే స్పందించింది.

ఈ లీగ్ కు, తమకు ఎలాంటి సంబంధం లేదని, ఆ ఆటగాడు తమ అసోసియేషన్ కు చెందిన వ్యక్తి కాదని స్పష్టం చేసింది. అనవసరంగా తమ పేరును ఇందులో లాగొద్దని విజ్ఞప్తి చేసింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Related Post

ఏపీలో కొత్త గుర్తింపు కార్డు.. ఫ్యామిలీ మొత్తానికి ఒకటే!ఏపీలో కొత్త గుర్తింపు కార్డు.. ఫ్యామిలీ మొత్తానికి ఒకటే!

రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, హెల్త్ కార్డ్.. ఇవన్నీ కాదు. ఏపీలో ఇప్పుడు కొత్తగా మరో కార్డు వస్తోంది. ఒకే కార్డు ద్వారా పౌరులు అన్ని ప్రభుత్వ సేవల్ని, పథకాలను అందేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. ఇందులో భాగంగా