hyderabadupdates.com movies డాన్ దర్శకుడితో ‘టైలర్’ రజినీకాంత్ ?

డాన్ దర్శకుడితో ‘టైలర్’ రజినీకాంత్ ?

కమల్ హాసన్ నిర్మాతగా రజనీకాంత్ హీరోగా రూపొందబోయే సినిమా తాలూకు దర్శకుడి సస్పెన్స్ వీగిపోయింది. శివ కార్తికేయన్ డాన్ డీల్ చేసిన శిబి చక్రవర్తిని అఫీషియల్ గా లాక్ చేస్తూ ఇవాళ ప్రకటన ఇచ్చారు. దీనికన్నా ముందు రెండుమూడు పేర్లు వినిపించాయి కానీ ఫైనల్ గా శిబిని ఫిక్స్ చేయడం అనూహ్యం.

కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే దసరా టైంలో న్యాచురల్ స్టార్ నానికి ఇదే శిబి ఒక కథ వినిపించి కొంత కాలం దాని మీద హైదరాబాద్ లో వర్క్ చేశారు. కానీ ఏవో కారణాల వల్ల అది క్యాన్సిల్ కావడం, అతను చెన్నైకి తిరిగి వెళ్లిపోవడం జరిగాయని ఫిలిం నగర్ టాక్. ఇప్పుడు రజనికి చెప్పింది అదే కథనా కాదానేది సస్పెన్స్.

ఇప్పుడీ ప్యాన్ ఇండియా మూవీలో రజనీకాంత్ టైలర్ గా కనిపించబోతున్నట్టు సమాచారం. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో ఒక సూట్ చుట్టూ కత్తెర్లు బెట్టి ఒక మూలాన బటన్లు ఉంచి, బులెట్లను కనిపించి కనిపించినట్టు హైడ్ చేయడం చూస్తే ఏదో డిఫరెంట్ గానే అనిపిస్తోంది.

కుర్ర దర్శకులతో పని చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్న రజనీకాంత్ కాలా నుంచి కూలి దాకా ఇదే ఫాలో అయ్యారు. ముందు సుందర్ సిని అనుకున్నా ఆయన స్క్రిప్ట్ నచ్చకపోవడంతో ఏకాభిప్రాయం రాలేదని, దాని వల్లే ఆయన హఠాత్తుగా బయటికి వచ్చారనే ప్రచారం చెన్నై వర్గాల్లో జోరుగా జరిగింది. ఒకరకంగా ఇదీ మంచికేనని అభిమానులు ఫీలయ్యారు.

నిజానికి శిబి చక్రవర్తి మరోసారి శివ కార్తికేయన్ తో సినిమా చేయాలని చాలా ట్రై చేసారు. కానీ కుదరలేదు. మదరాసి, పరాశక్తి అంటూ వరుస కమిట్ మెంట్లతో డేట్లు ఇవ్వలేని పరిస్థితి నెలకొనడంతో పాటు వెంకట్ ప్రభుకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ద్వారా తాను ఇప్పట్లో దొరకనని శివ కార్తికేయన్ సంకేతం ఇచ్చాడు.

తంతే బూరెల బుట్టలో పడ్డట్టు ఇప్పుడు శిబి ఏకంగా సూపర్ స్టార్ నే మెప్పించాడు. ఇది పూర్తయ్యాక వేరే దర్శకుడితో కమల్ హాసన్ – రజనీకాంత్ మల్టీస్టారర్ ఇదే బ్యానర్ లో ఉంటుంది. కాకపోతే కాంబినేషన్ కుదరడానికి కొంచెం ఎక్కువ టైం పట్టేలా ఉంది. అన్నట్టు శిబి మూవీకి టైలర్ టైటిల్ పెడితే బాగుంటుందేమో.

Related Post

Interview: Raashii Khanna – Telusu Kada boasts a never-before-attempted elementInterview: Raashii Khanna – Telusu Kada boasts a never-before-attempted element

Celebrity stylist Neerraja Kona is making her directorial debut with the romantic drama Telusu Kada, which features Siddhu Jonnalagadda, Raashii Khanna, and Srinidhi Shetty in the lead roles. The triangular

రాజా సాబ్ సంగీతానికి అభిమానుల సూచనలురాజా సాబ్ సంగీతానికి అభిమానుల సూచనలు

సంగీత దర్శకుడు తమన్ అఖండ 2 కోసం ఇచ్చిన సంగీతం మీద మిశ్రమ స్పందనే దక్కింది. ఆడియో శివ భక్తులకు బాగా కనెక్ట్ కాగా జాజికాయ జాజికాయ సాంగ్ అఖండ 1లో జై బాలయ్య రేంజ్ లో కంపోజ్ కాలేదు. ఇక

మావయ్యతో వరప్రసాద్… మేనల్లుడితో ‘క’ కలయికమావయ్యతో వరప్రసాద్… మేనల్లుడితో ‘క’ కలయిక

మన శంకరవరప్రసాద్ గారుతో రీజనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న నిర్మాత సాహూ గారపాటి కొత్త సినిమా ‘క’ దర్శకులు సుజిత్ అండ్ సందీప్ తో లాకైనట్టు సమాచారం. కిరణ్ అబ్బవరంకి అదిరిపోయే థ్రిల్లర్ హిట్ ఇచ్చిన ఈ దర్శక ద్వయం తర్వాత