hyderabadupdates.com movies 9 రోజుల డ్యూటీకి ప్రసాద్ గారు సిద్ధం

9 రోజుల డ్యూటీకి ప్రసాద్ గారు సిద్ధం

మన శంకరవరప్రసాద్ గారుకి కౌంట్ డౌన్ మొదలైపోయింది. రేపు ట్రైలర్ మీద అంచనాలు పెరగడమో తగ్గడమో ఆధారపడి ఉన్న నేపథ్యంలో ఫ్యాన్స్ ఎదురు చూపులు దాని మీదే ఉన్నాయి. అయితే ప్రమోషన్ల పరంగా అనిల్ రావిపూడి మార్కు పూర్తి స్థాయిలో కనిపించడం లేదనే కామెంట్స్ కు సమాధానం రాబోయే వారం రోజుల్లో దొరుకుతుందని టీమ్ నమ్మకంగా చెబుతోంది.

దానికి తగ్గట్టే తొమ్మిది రోజులు తొమ్మిది ఊళ్ళలో చేయబోతున్న ఈవెంట్లు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అన్నింటికి చిరంజీవి హాజరు ఉండకపోవచ్చు కానీ కీలకమైన ప్రీ రిలీజ్ వేడుకలో ఆయనతో పాటు టీమ్ మొత్తం వస్తుంది.

ఇవాళ రాజమండ్రి రేవు మీద సెలబ్రేషన్స్ జరిగాయి. ప్రత్యేకంగా కంటెంట్ ఏం వదల్లేదు కానీ మెగా ఫ్యాన్స్ గుమికూడి స్థానిక ఎమ్మెల్యేతో పాటు పలువురు ముఖ్య నాయకులను పిలిచి ఘనంగా జరుపుకున్నారు. రేపు తిరుపతిలో ట్రైలర్ లాంచ్ పెద్ద ఎత్తున ఉండబోతోంది.

అనిల్ రావిపూడి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. జనవరి 5 నెల్లూరు, 6 విశాఖపట్నం, 7 హైదరాబాద్, 8 తాడేపల్లిగూడెం, 9 అనంతపూర్, 10 వరంగల్, 11 బెంగళూరు ఇలా మొత్తం మూడు రాష్ట్రాలు కవర్ చేస్తూ రకరకాల ప్రోగ్రాంస్ చేయబోతున్నారు. అన్నింటిలోనూ అనిల్ తనదైన ముద్ర ఉండేలా చూసుకుంటున్నారట.

కాంపిటీషన్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో మన శంకరవరప్రసాద్ గారుకి పబ్లిసిటీ చాలా కీలకం కానుంది. నయనతార యాక్టివ్ కావడం సంతోషించాల్సిన విషయమే అయినా వీలైనన్ని ఎక్కువ సార్లు చిరంజీవి బయటికి రావడం అవసరం. జనవరి 9 ఎలాగూ రాజా సాబ్ హడావిడి ఉంటుంది కాబట్టి ఆ ఒక్క రోజు మినహాయించి సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా ఏమేం చేయాలనే దాని మీద అనిల్ రావిపూడి ఆల్రెడీ ఒక క్లారిటీతో ఉన్నారట.

సంక్రాంతి బరిలో వస్తున్న రెండో సినిమాగా దీని ఓపెనింగ్స్ మీద అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. బాగుందనే టాక్ వస్తే చాలు మెగా అనిల్ చేయబోయే వసూళ్ల జాతర ఓ రేంజ్ లో ఉంటుంది.

Related Post

జన నాయకుడు కోసం పెద్ద చేతులుజన నాయకుడు కోసం పెద్ద చేతులు

అసలే సంక్రాంతి పోటీ తీవ్రంగా ఉంది. పైగా భగవంత్ కేసరి రీమేక్ అనే ప్రచారం. ఎంత విజయ్ హీరో అయినా తెలుగు వరకు జన నాయకుడు మీద విపరీతమైన బజ్ లేదన్నది వాస్తవం. అయినా సరే తన స్టార్ పవర్ ఇక్కడ

Telusu Kada flops; Will Neerraja Kona’s film with Nithiin achieve success?Telusu Kada flops; Will Neerraja Kona’s film with Nithiin achieve success?

The romantic drama Telusu Kada starring Siddu Jonnalagadda, Raashii Khanna, and Srinidhi Shetty ended up as a box office flop. The film, which sparked discussions online, marked the directorial debut