hyderabadupdates.com movies డ్ర‌గ్స్ కేసులో బీజేపీ ఎమ్మెల్యే కుమారుడి అరెస్టు

డ్ర‌గ్స్ కేసులో బీజేపీ ఎమ్మెల్యే కుమారుడి అరెస్టు

క‌డ‌ప జిల్లాలోని జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గం.. బీజేపీ ఎమ్మెల్యే సీనియ‌ర్ నాయ‌కుడు ఆదినారాయ‌ణ‌రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిని హైద‌రాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. శ‌నివారం సాయంత్రం జ‌రిపిన దాడిలో సుధీర్ రెడ్డి స‌హా ఆయ‌న స్నేహితు లు డ్ర‌గ్స్ తీసుకుంటున్న‌ట్టు గుర్తించి.. వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఆ వెంట‌నే డ్ర‌గ్స్ టెస్ట్ చేయ‌గా.. పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఎమ్మెల్యే కుమారుడిపైనా.. ఆయ‌న స్నేహితుల‌పైనా కేసులు న‌మోదు చేశారు. అనంత‌రం.. వారిని డీ అడిక్ష‌న్ కేంద్రానికి త‌ర‌లించారు.

హుటాహుటిన‌..

త‌న కుమారుడి అరెస్టు విష‌యం తెలుసుకున్న ఆదినారాయ‌ణ‌రెడ్డి హుటాహుటిన హైద‌రాబాద్‌కు వెళ్లారు. త‌న కుమారుడికి ఎలాంటి చెడు అల‌వాట్లు లేవ‌ని.. ఈ కేసులో అన్యాయంగా ఇరుక్కున్నాడ‌ని ఆయ‌న వ్యాఖ్యానించిన‌ట్టు తెలిసింది.

అయితే.. పోలీసులు ఎమ్మెల్యే వైఖ‌రిని త‌ప్పుబ‌ట్టారు. ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోవాల‌ని చెప్ప‌డంతో ఆయ‌న సైలెంట్ అయ్యారు. మ‌రోవైపు నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల్లోనూ భారీ ఎత్తున డ్ర‌గ్స్ తీసుకునే ప్ర‌య‌త్నం చేసిన‌..వారిని క్ల‌బ్బు నిర్వాహ‌కుల‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇటీవ‌ల కాలంలో హైద‌రాబాద్ కేంద్రంగా డ్ర‌గ్స్ ర‌వాణా.. వినియోగం పెరిగింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి సీరియ‌స్ అవుతున్నారు. `ఈగ‌ల్`విభాగాన్ని ఏర్పాటు చేసి డ్ర‌గ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా సుధీర్ రెడ్డి ఉదంతంతో రెండు రాష్ట్రాల్లోనూ తీవ్ర అల‌జ‌డి రేగింది.

ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్న ఆదినారాయ‌ణ‌రెడ్డికి అటు కాంగ్రెస్‌, ఇటు టీడీపీ నాయ‌కుల‌తోనూ అత్యంత స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే.. డ్ర‌గ్స్ కేసును రాష్ట్ర ప్ర‌భుత్వం, కేంద్రం కూడా సీరియ‌స్‌గా తీసుకుంటున్న నేప‌థ్యం లో ఆయ‌న ఈ విష‌యంలో ఏ చేయాలో పాలుపోక‌.. స‌త‌మ‌తం అవుతున్నారు.

Related Post

These 4 James Bond Movies Are Amazing, but I Think They’re a Bit Overrated
These 4 James Bond Movies Are Amazing, but I Think They’re a Bit Overrated

The James Bond franchise is among the few recurring blockbuster sagas that has maintained a consistent level of quality throughout its run. While there aren’t many Bond fans that would