hyderabadupdates.com movies రాజాసాబ్-2పై దర్శకుడి క్లారిటీ

రాజాసాబ్-2పై దర్శకుడి క్లారిటీ

ఇండియన్ సినిమాలో ఒక కథను రెండు భాగాలుగా తీయడం, సీక్వెల్స్ చేయడం అనే ట్రెండు బాగా ఊపందుకోవడంలో ‘బాహుబలి’ సినిమా పాత్ర కీలకం. ముఖ్యంగా ఈ మధ్య ప్రభాస్ సినిమా అంటే చాలు.. రెండో భాగం తెరపైకి వచ్చేస్తోంది. సలార్, కల్కి చిత్రాలకు సీక్వెల్స్ లైన్లో ఉండగా.. ‘ఫౌజీ’కి సైతం సీక్వెల్ ఉంటుందని వెల్లడైంది. మరి రెబల్ స్టార్ కొత్త చిత్రం ‘రాజాసాబ్’కు పార్ట్-2 ఉంటుందా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు. 

దీని గురించి దర్శకుడు మారుతి తాజాగా క్లారిటీ ఇచ్చాడు. ట్రైలర్లో చూసిన ‘జోకర్’ షాట్.. పార్ట్-2కు లీడ్ ఇవ్వడం కోసమే పెట్టినట్లు అతను వెల్లడించాడు. ఐతే పార్ట్-2కు ఇంకా స్క్రిప్టు ఏమీ రెడీ కాలేదని కూడా అతను క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతానికి లీడ్ ఇస్తామని.. తర్వాత అన్నీ అనుకూలించడాన్ని బట్టి పార్ట్-2 ఉంటుందని అతను తెలిపాడు.

రాజాసాబ్-2 కోసం ఇప్పుడున్న కథను సాగదీయడం లాంటిదేమీ చేయనని మారుతి స్పష్టం చేశాడు. పార్ట్-2 విషయంలో ఏం చేయాలి అనే విషయంలో తనకు, ప్రభాస్‌కు ఫుల్ క్లారిటీ ఉందని.. కథను సాగదీస్తారేమో అని ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని అన్నాడు మారుతి. ఇంతకుముందు ఓ సందర్భంలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. సీక్వెల్ గురించి క్లారిటీగా చెప్పకుండా ‘రాజాసాబ్’ ప్రపంచం కొనసాగుతుందని మాత్రం వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం మారుతి మాటల్ని బట్టి చూస్తుంటే.. పార్ట్-2కు లీడ్ ఇచ్చి, ఈ సినిమాకు వచ్చే ఫలితాన్ని బట్టి, ప్రభాస్ వీలును బట్టి కొత్తగా ఇంకో కథ రాసి దాన్ని రాజాసాబ్-2గా తీసుకొస్తారని అర్థమవుతోంది. మరి ఈ నెల 9న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘రాజాసాబ్’కు ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.

Related Post

ఆర్జీవీ గట్టిగా ట్రై చేస్తున్నాడు కానీ…ఆర్జీవీ గట్టిగా ట్రై చేస్తున్నాడు కానీ…

ఒక భారీ భవంతిని పేలుడు పదార్థాలు వాడి నిమిషాల్లో ధ్వంసం చేయొచ్చు. కానీ అదే భవంతిని కట్టడానికి సంవత్సరాలు పడుతుంది. అదే రకంగా ఒక మనిషికి మంచి పేరు రావడానికి చాలా సమయం పడుతుంది. కానీ చెడ్డపేరు తెచ్చుకోవడానికి నిమిషం చాలు.

మోదీతో మరోసారి పుతిన్.. అందరి కళ్లు భారత్ వైపేమోదీతో మరోసారి పుతిన్.. అందరి కళ్లు భారత్ వైపే

ప్రపంచ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లు భారత్ వైపే ఉన్నాయి. ఉక్రెయిన్ యుద్ధం, అంతర్జాతీయ పరిణామాల మధ్య రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇండియాకు వస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ఆహ్వానం మేరకు డిసెంబర్ 4, 5 తేదీల్లో ఆయన

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపుఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు

బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ఏ1గా చేర్చారు. అయితే, ఆయనకు కొంతకాలం క్రితం సుప్రీం కోర్టు మధ్యంతర రక్షణను