hyderabadupdates.com movies విజయ్ పొలిటికల్ వాడకం మామూలుగా లేదు

విజయ్ పొలిటికల్ వాడకం మామూలుగా లేదు

సూపర్ స్టార్ రజినీకాంత్‌ను సైతం వెనక్కి నెట్టి తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరో పోటీలో కొనసాగుతున్నాడు విజయ్. ఇలాంటి పొజిష‌న్‌ను వదిలేసి అతను పూర్తి స్థాయి రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్నాడు. తమిళ వెట్రి కళగం (టీవీకే) పేరుతో పార్టీ పెట్టిన విజయ్ ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సై అంటున్నాడు.

విజయ్ పార్టీ ఇప్పటికే తమిళ రాజకీయాలపై తనదైన ముద్ర వేయగలిగింది. కరూర్ తొక్కిసలాట విషాదాన్ని పక్కన పెడితే.. విజయ్‌కి సానుకూల వాతావరణమే కనిపిస్తోంది. విజయ్‌కి ఉన్న జనాదరణకు తోడు తమిళనాట ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తొలి ఎన్నికల్లో అతను మంచి ఫలితాలే రాబడతాడని, కింగ్ మేకర్ కాగలడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టే ముందు చివరగా ‘జననాయగన్’ అనే చిత్రంతో అతను ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఈ సంక్రాంతికి. నిన్ననే ఈ సినిమా ట్రైలర్ కూడా లాంచ్ అయింది.

‘జననాయగన్’ అని పేరు పెట్టుకోవడంతోనే ఈ చిత్రాన్ని పొలిటికల్ మైలేజీ కోసం విజయ్ బాగానే వాడుకోబోతున్నాడని అర్థమైంది. ఇక ట్రైలర్ చూస్తే.. సినిమాకు పొలిటికల్ కలర్ బాగానే అద్దినట్లు స్పష్టమైంది. ‘‘అర్హత లేని వాళ్లంతా కలిసి నిలబడ్డారు. వాళ్లు గెలవకూడదు’’.. ‘‘ప్రజలకు మంచి చేయడానికి రాజకీయాల్లోకి రమ్మంటే హత్యలు చేయడానికి, దోచుకోవడానికేంట్రా రాజకీయాల్లోకి వచ్చేది’’.. ‘‘నిన్ను నాశనం చేస్తాను, అవమానిస్తాను అని ఎవ్వడు చెప్పినా సరే, తిరిగెళ్లే ఐడియానే లేదు. ఐయామ్ కమింగ్’’.. లాంటి డైలాగులతో తన రాజకీయ ప్రత్యర్థుల మీద పరోక్షంగా గట్టి పంచులే వేశాడు విజయ్.

ఇంకోవైపు విజయ్ పార్టీ సింబల్‌ను పోలినట్లుగా రెండు ఏనుగులల మధ్య విజయ్ నిలబడి ఉన్న ఒక ఫ్రేమ్‌ను ట్రైలర్లో చూడొచ్చు. ఈ చిత్రంలో విజయ్ పేరు కూడా పొలిటికల్ టచ్ ఉన్నదే. ‘దళపతి వెట్రి కొండాన్’.. ఇదీ సినిమాలో విజయ్ పేరు. ఇంగ్లిష్‌లో షార్ట్‌ చేస్తే ‘టీవీకే’ అని వస్తుంది. తన పార్టీ షార్ట్ నేమ్ కూడా అదే అన్న సంగతి తెలిసిందే. దళపతి వెట్రి కొండాన్ అంటే ‘దళపతి విజయాన్ని తీసుకొస్తాడు’ అని అర్థం. అంటే రాబోయే ఎన్నికల్లో తాను గెలవబోతున్నాననే సంకేతాన్ని విజయ్ ఇచ్చాడన్నమాట.

Related Post

పద్మభూషణ్ ను కూడా మోసం చేసేశారు…పద్మభూషణ్ ను కూడా మోసం చేసేశారు…

డిజిటల్ అరెస్ట్ పేరిట జరుగుతున్న సైబర్ మోసాలు సామాన్యులకే కాదు, ప్రముఖులకూ పెద్ద ముప్పుగా మారాయి. ప్రభుత్వం ఎంత అవగాహన కల్పిస్తున్నా, సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతులతో ప్రజలను మభ్యపెడుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే పద్మభూషణ్ అవార్డు గ్రహీత, ప్రముఖ