hyderabadupdates.com movies గోదావ‌రి యాస‌… తెలంగాణ కుర్రాడు అద‌ర‌గొట్టాడే

గోదావ‌రి యాస‌… తెలంగాణ కుర్రాడు అద‌ర‌గొట్టాడే

ఆంధ్ర నేప‌థ్యం ఉన్న న‌టులు తెలంగాణ యాస‌లో డైలాగులు చెప్పాలంటే ఇబ్బంది ప‌డ‌తారు. అదే స‌మ‌యంలో తెలంగాణ నుంచి వ‌చ్చిన ఆర్టిస్టులు ప‌క్కా ఆంధ్ర యాస మాట్లాడాలంటే త‌డ‌బ‌డ‌డం స‌హ‌జం. అంద‌రికీ కామ‌న్‌గా అనిపించే యాస అంటే ఓకే కానీ.. ఒక ప్రాంతానికే ప‌రిమిత‌మైన, రూర‌ల్ స్లాంగ్ మాట్లాడాలంటే మాత్రం ఇబ్బందే.

ఈ స్లాంగ్ కుద‌ర‌కే కొన్ని క్యారెక్ట‌ర్లు, సినిమాలు కూడా తేడా కొట్టిన సందర్భాలున్నాయి. ఐతే తెలంగాణ నుంచి వ‌చ్చిన‌ సుమంత్ ప్ర‌భాస్ అనే కొత్త కుర్రాడు మాత్రం గోదావ‌రి యాస‌లో భ‌లేగా డైలాగులు చెబుతూ అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నాడు. ఇంత‌కుముందు స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో మేం ఫేమ‌స్ అనే సినిమా చేసి త‌న ప్ర‌తిభ‌ను చాటుకున్నాడు సుమంత్. ఇప్పుడ‌త‌ను ప్ర‌ధాన పాత్ర‌లో గోదారి గ‌ట్టుపైన అనే సినిమా తెర‌కెక్కింది. ఈ సినిమా టీజ‌ర్ ఇటీవ‌లే రిలీజైంది.

ఫుల్ ఫ‌న్ మోడ్‌లో సాగిన టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తోంది. ఈ సినిమా టీజ‌ర్ లాంచ్‌లో తాను గోదావ‌రి యాస నేర్చుకోవ‌డానికి ప‌డ్డ ఇబ్బందిని గుర్తు చేస్తూనే.. త‌మ ప్రాంత యాస‌కు, గోదావ‌రి యాస‌కు ఉన్న తేడాను తెలియ‌జేస్తూ భ‌లేగా డైలాగులు చెప్పి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు సుమంత్.

”ఇప్పుడు నేనే ఉన్నా. నేనేమో కొట్టే తెచ్చే పెట్టిన‌ట్లు ఉంట‌ది నేను మాట్లాడేదంతా. నేను పుట్టి పెరిగిందంతా తెలంగాణ‌లో కాబట్టి. ఈ అన్న వ‌చ్చి గోదావ‌రి యాస‌లో డైలాగులు చెప్ప‌మ‌న్నాడు. అదేమో మెలోడీ సాంగ్ లెక్కుంట‌ది. నాదేమో ఫోక్ సాంగ్ లెక్కుంట‌ది. మ‌స్తు క‌ష్ట‌మ‌య్యేది రెంటినీ బ్లెండ్ చేసుడు.

ఇప్పుడు ఈ అన్నో డైలాగ్ చెప్త‌డు. మ‌న‌దాంట్లో అయితే మాట‌లు ఎలా ఉంటాయి? ఏమ్రా అల్లుడు ఎట్లున్న‌వు అనంటే.. అదే మంచిగున్న మామా నువ్వెట్లున్నావ్ అంటాం. ఇదే డైలాగ్ మ‌న సినిమాలో ఉంది. వీళ్లంద‌రూ న‌న్ను బాగా ట్రైన్ చేసిర్రు. మ‌న‌కు మ‌స్తు క‌ష్ట‌మైత‌ది ఆ స్లాంగ్ మాట్లాడ్డం. నాకు త‌ర్వాత అర్థ‌మైంది. సినిమా ఏదో జోష్‌లో ఓకే చేసేసినా.. ఎమోష‌న్లు, ఆ ఫ్లో అంత తేలిక విషయాలు కావు.

డైరెక్ట‌ర్, క‌సిరెడ్డ‌న్న‌, డైరక్ష‌న్ డిపార్ట్‌మెంట్లో విజ‌య్ అని ఉంటడు.. వీళ్లంతా వ‌చ్చి ఏమ్రా అల్లుడు అని ఆయ‌న నిన్ను అన‌డు సుమంత్.. ఏరా అల్లుడూ ఎలా ఉన్నావ్ అనంటాడు. అప్పుడు నువ్వేం చెప్పాలంటే.. కేకా నువ్వేంటి మాయా.. జుట్టుకు మంచి రంగేహేస్తున్నట్లున్నావ్ ఇంట్లో అత్త‌య్య లేదా అనాలి.

ఇప్పుడు నేను చాలా ఫ్లోలో ఏదో చెప్పేస్తున్నా. అక్క‌డ పుట్టి పెరిగిన వాళ్లంత ఆర్గానిగ్గా లేక‌పోవ‌చ్చు కానీ.. ఇది నేను అచీవ్ చేయ‌డానికి వీళ్లంతా చాలా క‌ష్ట‌ప‌డ్డారు. అందుకు థ్యాంక్యూ సోమ‌చ్” అని సుమంత్ అన్నాడు. ఈ రెండు యాస‌ల మ‌ధ్య తేడాను చూపిస్తూ డైలాగులు చెప్పిన తీరు చూస్తే కుర్రాడిది మామూలు టాలెంట్ కాద‌ని అర్థ‌మ‌వుతుంది.

Related Post

రాహుల్ గాంధీని ఉరి తియ్యాలంటున్న కేటీఆర్రాహుల్ గాంధీని ఉరి తియ్యాలంటున్న కేటీఆర్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం తార స్థాయికి చేరింది. అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన బీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశాల్లో కాంగ్రెస్ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్

Samantha Prabhu, Raj Nidimoru Perform Sacred Bhuta Shuddhi VivahaSamantha Prabhu, Raj Nidimoru Perform Sacred Bhuta Shuddhi Vivaha

Actor Samantha Ruth Prabhu and filmmaker-producer Raj Nidimoru performed a sacred Bhuta Shuddhi Vivaha ceremony on Monday morning at the Linga Bhairavi Devi abode located inside Sadhguru’s Isha Yoga Center,

త‌మిళ‌నాడులో ‘బీహార్ గాలి’: మోడీత‌మిళ‌నాడులో ‘బీహార్ గాలి’: మోడీ

రాజ‌కీయ విశ్లేష‌కులు ఊహించిందే జ‌రిగింది. త‌మిళ‌నాడులో ప‌ర్య‌టించిన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ఖ‌చ్చితంగా ఎన్నిక‌ల వ్యూహాన్ని ఆవిష్క‌రిస్తార‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేశారు. వ‌చ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న త‌మిళ‌నాడులో ఆయ‌న ప‌ర్య‌ట‌న పెట్టుకోవ‌డం కూడా కీల‌క వ్యూహ‌మేన‌ని చెప్పారు.