hyderabadupdates.com movies ‘ప‌ర‌కామ‌ణి దొంగ‌తనం.. ఏ ఒక్క‌రినీ వ‌ద‌ల‌ద్దు’

‘ప‌ర‌కామ‌ణి దొంగ‌తనం.. ఏ ఒక్క‌రినీ వ‌ద‌ల‌ద్దు’

తిరుమ‌ల శ్రీవారికి భ‌క్తులు స‌మ‌ర్పించుకునే కానుకల హుండీ ప‌ర‌కామ‌ణిలో దొంగ‌త‌నం జ‌రిగిన విష‌యం తెలిసిందే. 2021-22 మ‌ధ్య కాలంలో ర‌వికుమార్ అనే ఉద్యోగి(కాంట్రాక్టు) 900 డాల‌ర్ల‌ను దొంగిలించారు. ఈ విష‌యం బ‌య‌ట‌కు వచ్చాక రాజీ చేసుకున్నారు.

దీనిని ప్ర‌శ్నిస్తూ.. తిరుప‌తికి చెందిన ఓ జ‌ర్న‌లిస్టు.. హైకోర్టులో కేసు దాఖ‌లు చేశారు. ఈ కేసు విచార‌ణ జ‌రుగుతోంది. గ‌త విచార‌ణలో ప‌ర‌కామ‌ణి లెక్కింపు వ్య‌వ‌హారంపై త‌క్ష‌ణ‌మే విధానాలు మార్చాల‌ని హైకోర్టు ఆదేశించింది.

ఈ నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం జ‌రిగిన విచార‌ణ‌లో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఓ నివేదిక‌ను కోర్టుకు స‌మ‌ర్పించింది. ప‌ర‌కామ‌ణి లెక్కింపు విష‌యంలో కొన్ని మార్పులు చేర్పులు చేయ‌నున్న‌ట్టు తెలిపింది. అయితే.. ఈ సంద‌ర్భంగా హైకోర్టు కొన్ని కీల‌క ప్ర‌శ్న‌లు సంధించింది.

తాము చెప్పిన‌ట్టుగా మార్పులు చేసేందుకు మీరెందుకు వెనుకాడుతున్నారంటూ.. ప్ర‌శ్నించింది. లెక్కింపు స‌మ‌యంలో లుంగీల‌తో భ‌క్తుల‌ను అనుమ‌తించేబ‌దులు ప్ర‌త్యామ్నాయ విధానాలు చూడ‌లేరా? అని ప్ర‌శ్నించింది.

అదేవిధంగా నేల‌పై కూర్చునికాకుండా.. టేబుళ్లు ఏర్పాటు చేసే విధానం ప‌రిశీలించాల‌ని కోరామ‌ని.. కానీ దీనిపైనా స్పందించ‌లేద‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. అదేవిధంగా ఏఐని వినియోగించి లెక్కింపు చేపేట్టే ప్ర‌క్రియ‌పైనా టీటీడీ బోర్డు నిర్ణ‌యం వెల్ల‌డించ‌క‌పోవ‌డాన్ని కూడా త‌ప్పుబ‌ట్టింది.

ప‌ర‌కామ‌ణి దొంగ‌త‌నం కేసులో ప్ర‌మేయం ఇంకెవ‌రెవ‌రికి ఉంద‌ని కోర్టు ఆరా తీసింది. ఈ కేసులో ప్ర‌మేయం ఉన్న ఏ ఒక్క‌రినీ వ‌దిలి పెట్ట‌రాద‌ని.. ప్ర‌తి విష‌యాన్నీ కూలంక‌షంగా చ‌ర్చించి.. నిర్ణ‌యం తీసుకోవాల‌ని సూచించింది. ప‌ర‌కామ‌ణి కేసు అంటే.. కేవ‌లం ఒక‌రిద్ద‌రికి సంబంధించిన వ్య‌వ‌హారం కాద‌ని.. కోట్ల మంది శ్రీవారి భ‌క్తులకు సంబంధించిన కేసుగా హైకోర్టు స్ప‌ష్టం చేసింది.

Related Post

పార్లమెంటులో ఈ సిగరెట్ తాగారా?పార్లమెంటులో ఈ సిగరెట్ తాగారా?

కొద్ది సంవత్సరాల క్రితం వరకు చట్ట సభలను సభ్యులు పరమ పవిత్రంగా…దేవాలయాల మాదిరిగా చూసేవారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజల చేత ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు సభలో ఎంతో హుందాగా, బాధ్యతగా నడుచుకునేవారు. కాలం మారింది…కలికాలం వచ్చింది…అందుకే కాబోలు గత దశాబ్ద

`ల‌డ్డూ నివేదిక`: వైసీపీ ఎందుకు తొక్కిపెట్టింది?`ల‌డ్డూ నివేదిక`: వైసీపీ ఎందుకు తొక్కిపెట్టింది?

ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జ‌రుగుతున్న అత్యంత కీల‌క‌మైన చ‌ర్చ శ్రీవారి ప‌విత్ర ల‌డ్డూ ప్ర‌సాదం క‌ల్తీ కావ‌డ‌మే!. ఒక్క రాష్ట్రంలోనే కాదు.. దేశ‌వ్యాప్తంగా కూడా ఈ వ్య‌వ‌హారం చ‌ర్చ‌కు వ‌స్తోంది. ముఖ్యంగా వైసీపీ నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు వైవీ సుబ్బారెడ్డి క‌ల్తీ