hyderabadupdates.com movies సంక్రాంతి కుర్రోళ్ళను తక్కువ అంచనా వేయొద్దు

సంక్రాంతి కుర్రోళ్ళను తక్కువ అంచనా వేయొద్దు

ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్‌లో ఎన్నడూ లేనంత పోటీని చూడబోతున్నాం. తెలుగు నుంచి ఏకంగా అయిదు సినిమాలు రిలీజవుతున్నాయి. వీటికి తోడు తమిళం నుంచి వస్తున్న ‘జననాయకుడు’కు కూడా మంచి రిలీజే దక్కుతోంది. ఇంత పోటీలో ఏ సినిమా విజేతగా నిలుస్తుందన్నది ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతానికి అందరి చూపూ భారీ చిత్రాలైన రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ మీదే ఉంది. 

ఎక్కువమంది ప్రేక్షకులు చూడాలనుకుంటున్న సినిమాలు అవే. ప్రభాస్, చిరు సినిమాలకు భారీ ఓపెనింగ్ రావడం ఖాయం. వీటితో పాటు రవితేజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, నవీన్ పొలిశెట్టి చిత్రం ‘అనగనగా ఒక రాజు’, శర్వానంద్ సినిమా ‘నారీ నారీ నడుమ మురారి’ కూడా పండుగ పోటీలో ఉన్నాయి. వీటిలో రవితేజది మిడ్ రేంజ్ మూవీ. 

హీరోల స్థాయి, బడ్జెట్లను బట్టి ‘అనగనగా ఒక రాజు’, ‘నారీ నారీ నడుమ మురారి’లను చిన్న చిత్రాలుగా చెప్పొచ్చు. అలా అని వీటిని తక్కువ అంచనా వేయడం కరెక్ట్ కాదు. సంక్రాంతికి సూటయ్యే పర్ఫెక్ట్ ఎంటర్టైనర్లలా కనిపిస్తున్నాయి ఈ రెండు చిత్రాలు.

నవీన్ పొలిశెట్టి ఎలాంటి ఎంటర్టైనరో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. స్వతహాగా అతడికి కామెడీ మీద మంచి పట్టుంది. అతను రైటింగ్, మేకింగ్‌లో కూడా బాగా ఇన్వాల్వ్ అయి చేసిన సినిమా ‘అనగనగా ఒక రాజు’. సినిమాకు సంబంధించిన ప్రోమోలే కాదు.. ప్రమోషన్లలోనూ ఫన్‌కు ఢోకా లేకపోయింది. కాబట్టి కంటెంట్ బలంగా ఉంటే ఈ సినిమా ఎవ్వరూ అంచనా వేయలేని స్థాయిలో వసూళ్లు రాబట్టవచ్చు. 

ఇక శర్వానంద్ గత సినిమాల ఫలితాల మాట ఎలా ఉన్నా.. ‘నారి నారి నడుమ మురారి’ మంచి ఎంటర్టైనర్ లాగే కనిపిస్తోంది. దీని టీజర్ చూస్తే వినోదానికి ఢోకా లేనట్లే కనిపించింది. ఇది ‘సామజవరగమన’ లాంటి ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ తీసిన దర్శకుడి నుంచి వస్తున్న సినిమా. ఇంత పోటీ ఉన్నా నిర్మాత చాలా ధీమాగా సంక్రాంతి పోటీలో నిలబెట్టడాన్ని బట్టి సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్‌ను సూచిస్తోంది. కాబట్టి ఈ రెండు చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాలకు ముప్పు పొంచి ఉన్నట్లే.

Related Post

Chiranjeevi’s Warm Birthday Message for Salman Khan Wins HeartsChiranjeevi’s Warm Birthday Message for Salman Khan Wins Hearts

Megastar Chiranjeevi has shared a heartfelt birthday message for Bollywood superstar Salman Khan, celebrating the actor’s 60th birthday with warmth and affection. Taking to social media, Chiranjeevi referred to Salman