hyderabadupdates.com Gallery ఓరుగ‌ల్లు కోట భూముల ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించండి

ఓరుగ‌ల్లు కోట భూముల ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించండి

ఓరుగ‌ల్లు కోట భూముల ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించండి post thumbnail image

ఢిల్లీ :కేంద్ర మంత్రి గంగాపురం కిష‌న్ రెడ్డి సుదీర్ఘ లేఖ రాశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డికి. కోట భూముల నుండి ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించాల‌ని కోరారు. వాటిని తిరిగి ఏఎస్ఐకి అప్ప‌గించాల‌ని సూచించారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కాగా స్వాధీనం చేసుకున్న‌ ఆ భూములను ఏఎస్‌ఐ ఆస్తిగా స్పష్టంగా గుర్తించేలా రెవెన్యూ రికార్డులను సరి చేయడానికి అవసరమైన చర్యలు చేప‌ట్టాల‌ని సూచించారు. దాదాపు 250 సంవత్సరాల పాటు కాకతీయ రాజవంశానికి రాజధానిగా ఓరుగ‌ల్లు (వ‌రంగ‌ల్) పని చేసిందని అన్నారు. ఇది తన అద్భుతమైన చారిత్రక వారసత్వం, గొప్ప సాంస్కృతిక సంపదకు ప్రసిద్ధి చెందిందని చెప్పారు గంగాపురం కిష‌న్ రెడ్డి.
కాకతీయ కాలంలో రాజధానిని దండయాత్రల నుండి రక్షించడానికి ఏడు కోట గోడలతో వరంగల్ కోటను ప్రణాళికా బద్ధంగా నిర్మించారని వెల్ల‌డించారు. ఈ కోట ఢిల్లీ సుల్తానులు హైదరాబాద్ నిజాంల దాడులను తట్టుకుని, కాకతీయ పాలకుల శౌర్యం, బలానికి ప్రతీకగా నిలుస్తూనే ఉందన్నారు. అంతే కాకుండా ప్రతిరోజూ వేలాది మంది పర్యాటకులు వరంగల్ కోట వాస్తు శిల్పం, శిల్పాలు, దేవాలయాలు , చారిత్రక ప్రాముఖ్యత గురించి తెలుసు కోవడానికి సందర్శిస్తార‌ని చెప్పారు. పర్యాటకాన్ని మరింత ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల కోటలో సౌండ్ అండ్ ఇల్యూమినేషన్ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసింద‌న్నారు గంగాపురం కిష‌న్ రెడ్డి. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) పరిధిలోని రక్షిత స్మారక చిహ్నమైన వరంగల్ కోట రక్షణ , పునరుద్ధరణ కోసం నిరంతరం చర్యలు తీసుకుంటోంద‌న్నారు.
The post ఓరుగ‌ల్లు కోట భూముల ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించండి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

జిరాఫీల‌ను దత్త‌త తీసుకున్న డిప్యూటీ సీఎంజిరాఫీల‌ను దత్త‌త తీసుకున్న డిప్యూటీ సీఎం

విశాఖ‌పట్నం జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వన్ క‌ళ్యాణ్ కొణిద‌ల గురువారం విశాఖ‌ప‌ట్నం జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా పర్యటనలో భాగంగా ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలను పరిశీలించారు. త‌న తల్లి అంజనా దేవి జన్మదినోత్సవం సందర్భంగా జూ పార్క్

జగన్ మాటలు నిలువెత్తు వంచనకు నిదర్శనాలు!జగన్ మాటలు నిలువెత్తు వంచనకు నిదర్శనాలు!

జగన్ తన మెడికల్ కాలేజీల డ్రామాను రక్తికట్టించడానికి నర్సీపట్నం వెళ్లాలనుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ.. విశాఖలో విమానం దిగిన తర్వాత.. అక్కడినుంచి రోడ్డుమార్గంలో నర్సీపట్నం వెళ్లాలనుకోవడమే ఆయన దురాలోచనకు నిదర్శనం. ఒకవైపు అదేరోజున విశాఖపట్నంలో క్రికెట్ మ్యాచ్ ఉన్న నేపథ్యంలో..

Pawan Kalyan: మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యం – పవన్ కల్యాణ్Pawan Kalyan: మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యం – పవన్ కల్యాణ్

Pawan Kalyan : ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లో సదుపాయాలు కల్పించడంతోపాటు వారి జీవనోపాధిని మెరుగుపర్చేందుకు ఉన్న అవకాశాలు అన్వేషించాలని అధికారులను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆదేశించారు. శుక్రవారం ఉదయం క్యాంపు కార్యాలయంలో 100