hyderabadupdates.com movies పెద్ద సంకటంలో పడ్డ జన నాయకుడు

పెద్ద సంకటంలో పడ్డ జన నాయకుడు

భయపడినంతా అయ్యింది. రాజకీయాల్లోకి వెళ్లేముందు చివరి సినిమాగా విజయ్ ప్రకటించుకున్న జన నాయకుడుకి ఇంకా అడ్డంకులు తొలగలేదు. సెన్సార్ సర్టిఫికెట్ లో జరుగుతున్న ఆలస్యం గురించి మదరాసు హైకోర్టుని ఆశ్రయించిన నిర్మాతలకు సానుకూల వాతావరణం ఏర్పడలేదు.

తీర్పుని జనవరి 9 ఉదయానికి రిజర్వ్ చేస్తూ కేసుని వాయిదా వేశారు. కానీ రిలీజ్ డేట్ అదే రోజు కావడంతో ఓవర్సీస్ ప్రీమియర్లు క్యాన్సిల్ చేస్తే తీవ్ర నష్టం జరుగుతుంది. ఇప్పటికే మూడు మిలియన్ మార్క్ దాటేసిన జన నాయగన్ అనుకున్న టైంకి షోలు వేయకపోతే ఆడియన్స్ కి మొత్తం రీ ఫండ్ చేయాల్సి ఉంటుంది.

సమయం తక్కువగా ఉన్నప్పటికీ సుప్రీమ్ కోర్టులో అత్యవసర మోషన్ పిటీషన్ వేసే సాధ్యాసాధ్యాలను జన నాయకుడు లీగల్ టీమ్ పరిశీలిస్తోంది. ఒకవేళ రేపటి లోగా హియరింగ్ తో పాటు జడ్జ్ మెంట్ వస్తే ఏ టెన్షన్ ఉండదు. లేకపోతే మొత్తం అల్లకల్లోలం అవుతుంది.

జనవరి 9 హైకోర్టు అనుమతులు ఇచ్చినా అప్పటికీ తగ్గిపోయిన షోల వల్ల కలిగే ఎఫెక్ట్ వసూళ్ల మీద పడుతుంది. ఈ లెక్కన తెలుగు వెర్షన్ అదే రోజు వచ్చే ఛాన్స్ లేనట్టే. అదే జరిగితే రాజా సాబ్ కు ఏపీ తెలంగాణలో మొత్తం ఫ్రీ గ్రౌండ్ దొరుకుతుంది. రాత్రి ప్రీమియర్లతో పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం ఆలస్యం తెలుగు రాష్ట్రాల కలెక్షన్లు ఊపెక్కిపోతాయి.

సస్పెన్స్ థ్రిల్లర్ ని తలపిస్తున్న జన నాయకుడు పరిణామాలు అభిమానుల్లో తీవ్ర ఆగ్రహానికి దారి తీస్తున్నాయి. కాంపిటీషన్ లో పరాశక్తికి సైతం సెన్సార్ సమస్య ఉన్నప్పటికీ జనవరి 10 రిలీజ్ కాబట్టి ఆలోగా పరిష్కారం అవుతుందనే ధీమాలో ఉంది.

విజయ్ సినిమా ఇబ్బందుల వెనుక ఏమైనా రాజకీయ శక్తులు ఉన్నాయా అనే దానికి ఇంకా సమాధానం దొరకాల్సి ఉంది. ఎల్లుండి సానుకూలంగా తీర్పు వచ్చినా షోలు బాగా ఆలస్యమవుతాయి. భగవంత్ కేసరి రీమేక్ గా కీలకమైన మార్పులు చేసుకుని రూపొందిన జన నాయకుడులో పూజా హెగ్డే హీరోయిన్ కాగా మమిత బైజు తెలుగులో శ్రీలీల చేసిన క్యారెక్టర్ లో కనిపించనుంది.

Related Post

Zootopia 2 Opening Weekend Box Office: Tops Inside Out 2 in India to collect Rs 9 croreZootopia 2 Opening Weekend Box Office: Tops Inside Out 2 in India to collect Rs 9 crore

Disney’s latest outing, Zootopia 2, recorded a low opening weekend in India. Released on November 27, 2025, the Hollywood animation film clocked over Rs. 9.10 crore gross (Rs. 7.60 crore