14 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ స్టేడియంలో బౌలర్లను ఉతికి ఆరేస్తున్నాడు. కేవలం ఒక ప్రామిసింగ్ ప్లేయర్ లా కాకుండా, టీమ్ ఇండియాకు ఒక పవర్‌ఫుల్ వెపన్‌లా మారిపోయాడు. వైభవ్ వస్తున్నాడంటే అది కేవలం సోషల్ మీడియా బజ్ మాత్రమే కాదు, అతని కన్సిస్టెన్సీ చూస్తుంటే సీనియర్ టీ20 టీమ్‌లోకి ఎంట్రీ చాలా దగ్గరలోనే ఉందనిపిస్తోంది.
వైభవ్ రికార్డులు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అండర్ 19 ఆసియా కప్‌లో మెరుపులు, తాజాగా సౌతాఫ్రికాపై కేవలం 74 బంతుల్లోనే 127 రన్స్.. ఇవన్నీ ఒకెత్తయితే, విజయ్ హజారే ట్రోఫీలో ఫాస్టెస్ట్ సెంచరీ మరో ఎత్తు. రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే ఇతన్ని కోటి పది లక్షలతో కొనేసింది. పవర్‌ప్లేలో బంతిని బాదడంలో ఇతని రేంజ్ వేరే లెవల్‌లో ఉంది.
వైభవ్ గనుక టీమ్ లోకి వస్తే ఎవరి ప్లేస్ గల్లంతవుతుంది? అన్నదే ఇప్పుడు అసలైన ప్రశ్న. విశ్లేషకుల అంచనా ప్రకారం, సంజూ శాంసన్‌పై వేటు పడే అవకాశం ఉంది. టీమ్ బ్యాలెన్స్ కోసం వికెట్ కీపర్ బ్యాటర్ అయిన సంజూను పక్కన పెట్టి, వైభవ్‌ను ఓపెనర్‌గా బరిలోకి దింపే ఛాన్స్ ఉంది. ఇది సంజూ టాలెంట్ మీద కాకుండా, టీమ్ కాన్ఫిగరేషన్ కోసం తీసుకునే నిర్ణయం అయ్యేలా ఉంది.
ఒకవేళ సంజూ తప్పుకుంటే, ఇషాన్ కిషన్ ప్రైమరీ వికెట్ కీపర్‌గా మారుతాడు. ఇషాన్ నంబర్ 3లో బ్యాటింగ్‌కు వస్తే, ఓపెనింగ్‌లో వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ జోడీ ఇంపాక్ట్ చూపించవచ్చు. ఫస్ట్ ఆరు ఓవర్లలోనే మ్యాచ్‌ను పూర్తిగా తమ వైపు తిప్పేసుకోవాలనేది బీసీసీఐ మాస్టర్ ప్లాన్ లా కనిపిస్తోంది. దీనివల్ల మిడిల్ ఆర్డర్ మీద ఒత్తిడి కూడా తగ్గుతుంది.
దీనివల్ల శుభ్‌మన్ గిల్ పరిస్థితి కూడా ఇబ్బందుల్లో పడేలా ఉంది. గిల్ స్ట్రైక్ రేట్ కంటే వైభవ్ అగ్రెషన్ ఎక్కువగా ఉండటంతో గిల్ బ్యాకప్ ప్లేయర్ గా మిగిలిపోయే ప్రమాదం ఉంది. అటు శివమ్ దూబే ప్లేస్ లో కూడా మార్పులు రావచ్చు. వైభవ్ లాంటి హిట్టర్ పవర్‌ప్లేలోనే విధ్వంసం సృష్టిస్తే, చివరి ఓవర్ల వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. మరి ఈ సంచలన మార్పులు 2026 వరల్డ్ కప్ లోపు జరుగుతాయో లేదో వేచి చూడాలి.