hyderabadupdates.com Gallery రూ.425.20 కోట్లతో ఇస్కాన్ ఆధ్యాత్మిక కేంద్రం

రూ.425.20 కోట్లతో ఇస్కాన్ ఆధ్యాత్మిక కేంద్రం

రూ.425.20 కోట్లతో ఇస్కాన్ ఆధ్యాత్మిక కేంద్రం post thumbnail image

పెనుకొండ : ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత సంచ‌లన ప్ర‌క‌ట‌న చేశారు. పెనుకొండకు ప్రతిష్టాత్మకమైన ఇస్కాన్ టెంపుల్ ఆధ్యాత్మిక, సాంస్కృతిక బేస్ క్యాంప్ రానుందంటూ వెల్ల‌డించారు.. రూ.425.20 కోట్లతో ఈ ఆధ్యాత్మిక బేస్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ బేస్ క్యాంపు ఏర్పాటుతో 4,035 మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి లభించనుందని ఆమె వెల్లడించారు. ఈ మేరకు ఇవాళ‌ మంత్రి సవిత మీడియాతో మాట్లాడారు. పెనుకొండలోని ప్రఖ్యాతగాంచిన గణగిరి లక్ష్మీ నరసింహా స్వామి ఆలయం ఉన్న కొండపై ఇస్కాన్ టెంపుల్ ఆధ్యాత్మిక, సాంస్కృతిక బేస్ క్యాంపును ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రూ. 425.20 కోట్లతో ఈ ఆధ్యాత్మిక బేస్ క్యాంపు ఏర్పాటుకు రెండ్రోజుల కిందట జరిగిన రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహం బోర్డు (ఎస్ఐపీబీ) పచ్చజెండా ఊపిందన్నారు.
60 ఎకరాల్లో ఆథ్యాత్మిక కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో ఆధ్యాత్మిక బేస్ క్యాంపు ఏర్పాటుకు ఆమోదం లభించిందని మంత్రి సవిత తెలిపారు. ఇస్కాన్ టెంపుల్ ఆధ్యాత్మిక, సాంస్కృతిక బేస్ క్యాంపు ఏర్పాటుతో పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా పెనుకొండ అభివృద్ది చెందుతుందన్నారు. దేశ, విదేశాలకు చెందిన భక్తులు పెనుకొండకు రానున్నారన్నారు. ఈ బేస్ క్యాంపు ఏర్పాటుతో 1,035 మందికి ప్రత్యక్షంగా, 3 వేల మందికి పరోక్ష ఉపాధి లభించనుందన్నారు. త్వరలోనే ఇస్కాన్ టెంపుల్ ఆధ్యాత్మిక, సాంస్కృతిక బేస్ క్యాంప్ ఏర్పాటుకు సంబంధించిన పనులు ప్రారంభం కానున్నట్ల మంత్రి సవిత తెలిపారు.
The post రూ.425.20 కోట్లతో ఇస్కాన్ ఆధ్యాత్మిక కేంద్రం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Bhatti Vikramarka: హైదరాబాద్‌ అభివృద్ధికి ఏటా రూ.10 వేల కోట్లు – భట్టి విక్రమార్కBhatti Vikramarka: హైదరాబాద్‌ అభివృద్ధికి ఏటా రూ.10 వేల కోట్లు – భట్టి విక్రమార్క

Bhatti Vikramarka : తెలంగాణ రాష్ట్ర వనరులు, అవకాశాలపై ప్రచారం బాధ్యత నరెడ్కోపై ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అన్నివైపులా హైదరాబాద్ అభివృద్ధి చెందేలా ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందని చెప్పారు. నరెడ్కో ఆధ్వర్యంలో హైటెక్స్‌లో ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారు.

Delhi: ఢిల్లీ పేలుడు ఘటనలో వెలుగులోకి సంచలన విషయాలుDelhi: ఢిల్లీ పేలుడు ఘటనలో వెలుగులోకి సంచలన విషయాలు

    ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనతో కేంద్ర ఇంటెలిజన్స్ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. అయితే, ఈ ఘటనలో పలు కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ బాంబు బ్లాస్ట్ ఘటనలో ఇప్పటివరకు