hyderabadupdates.com movies పెద్ద ప్రభాస్ రిటర్న్స్… టికెట్ ధరలు నార్మల్

పెద్ద ప్రభాస్ రిటర్న్స్… టికెట్ ధరలు నార్మల్

నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్ లో ప్రకటించినట్టు 112 కోట్ల కలెక్షన్ ప్రభాస్ స్టామినా ఏంటో అనేది మరోసారి చాటింది. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్ లో కొన్ని ఇష్యూస్ కి క్లారిటీ ఇచ్చేశారు.

ముఖ్యంగా ట్రైలర్ లో చూపించిన పెద్ద వయసు ప్రభాస్ క్యారెక్టర్ ని తాజాగా జోడించారు. 8 నిముషాల ఆ ఎపిసోడ్ కొంచెం సర్వర్ సమస్య వల్ల ఇంతకుముందు యాడ్ అవ్వలేదని, ఇప్పుడు కథ అవసరానికి తగ్గట్టు వేరే సన్నివేశాలు ట్రిమ్ చేసి దీన్ని జోడించామని చెప్పుకొచ్చారు. సో పెద్ద డౌట్ తీరిపోయింది.

ఇక సోమవారం నుంచి సాధారణ టికెట్ రేట్లు ఉంటాయని దర్శకుడు మారుతీ అనౌన్స్ చేశారు. ఆదివారం కొంచెం వీలైనంత తిననివ్వండని చెబుతూ మండేతో సాధారణ ధరలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఇక దీన్ని డిస్ట్రిబ్యూటర్లు పాటించడమే మిగిలింది.

సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చిన నేపథ్యంలో టీమ్ ఇంత వేగంగా స్పందించి ఇలాంటి చర్యలు తీసుకోవడం మంచి పరిణామం. ఎందుకంటే ఫ్యాన్స్ అసంతృప్తిని అలాగే వదిలేస్తే చాల రిస్కు. వాళ్ళ కోరుకున్నవాటిని గౌరవించి అందించినప్పుడే మరింత మెరుగైన రిజల్ట్ అందుకోవచ్చు. ఈ విషయంలో పీపుల్స్ మీడియా తీసుకున్నది రైట్ డెసిషన్.

సోషల్ మీడియాలో ప్రచారం జరిగినట్టు వయసు మళ్ళిన ప్రభాస్ గెటప్ రెండో భాగంలో రావడం లేదు. ఇప్పుడే చూసి ఎంజాయ్ చేయొచ్చు. సోమవారం మన శంకరవరప్రసాద్ గారు, అటుపై వరసగా భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారి నారి నారి నడుమ మురారి విడుదలవుతున్న నేపథ్యంలో ఈ వీకెండ్ రాజా సాబ్ కు చాలా కీలకం.

ఆక్యుపెన్సీని స్టడీగా హోల్డ్ చేస్తే కనక నెంబర్లు మరింత మెరుగవుతాయి. ఆడియన్స్ కంటెంట్ పట్ల హ్యాపీగా ఉన్నారని చెబుతున్న టీమ్ మాటలు ఎంతమేరకు నిజమో ఇంకో నాలుగైదు రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది. చూడాలి కొత్త వర్షన్ రియాక్షన్లు ఎలా ఉంటాయో.

Related Post

మంత్రులతో భేటీ… క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ సీఎంమంత్రులతో భేటీ… క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ సీఎం

సింగరేణి బొగ్గు స్కాం ఆరోపణలు, ఆ నేపథ్యంలో మీడియాలో రకరకాల కథనాలు, కాంగ్రెస్ కీలక నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలపై సోషల్ మీడియాలో గుసగుసలు…ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో ఈ టాపిక్ లపై హాట్ డిబేట్ లు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే సీఎం

సీఎం సీరియస్: అటువంటివి ఉపేక్షించబోం..!సీఎం సీరియస్: అటువంటివి ఉపేక్షించబోం..!

పార్టీలో క్రమశిక్షణకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తారు. ఇది పార్టీలో అందరికీ తెలిసిన విషయమే. అయినా అక్కడక్కడా గాడి తిప్పుతున్నారు. అటువంటి వారి విషయంలో సీఎం ఎప్పుడూ కఠినంగానే ఉంటారు. తాజా పరిణామాలపై ఆయన